Venu Yeldandi : బలగం సినిమా తెర వెనుక విశేషాలు.. ఎవ్వరికి తెలియని నిజాలు దర్శకుడు వేణు మాటల్లో..?

Venu Yeldandi : బలగం సినిమా తెర వెనుక విశేషాలు.. ఎవ్వరికి తెలియని నిజాలు దర్శకుడు వేణు మాటల్లో..? : దర్శకుడు వేణు బలగం సినిమా తెర వెనుక విశేషాలు మరియు సినిమాకు సంబందించిన పలు ఆసక్తికర విషయాల్ని పంచుకోవడం జరిగింది.

Venu Yeldandi : బలగం సినిమా తెర వెనుక విశేషాలు.. ఎవ్వరికి తెలియని నిజాలు దర్శకుడు వేణు మాటల్లో..?

Venu Yeldandi : బలగం సినిమా తెర వెనుక విశేషాలు.. ఎవ్వరికి తెలియని నిజాలు దర్శకుడు వేణు మాటల్లో..?

దర్శకుడు వేణు ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా బలగం సినిమా తెర వెనుక విశేషాలు మరియు ఆసక్తికర విషయాల్ని పంచుకోవడం జరిగింది.

బలగం సినిమా ఐడియా ఎలా స్టార్ట్ అయ్యింది సినిమా భీజం ఎక్కడ పడింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు వేణు… సినిమా పిచ్చి వల్ల జబర్దస్త్ నుండి బయటికి వచ్చాను. జబర్దస్త్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ లో సినిమాలు చేయాలనీ డిసైడ్ అయ్యాను.

సినిమాల్లో కూడా కమర్షియల్ బ్రేక్ రావాలి. కమర్షియల్ బ్రేక్ రావాలి అంటే సినిమా హిట్ కొట్టాలి. సినిమా హిట్ కొడితేనే సినిమాలు వస్తాయి. జబర్దస్త్ నుంచి బోలెడంత డబ్బులు మిస్ అయ్యాను. అంతే కాకుండా ప్రేక్షకుల ఆదరణ మిస్ అయ్యాను. అంత పీక్ లో ఉన్నప్పుడు జబర్దస్త్ ని వదిలేసుకొని సినిమా కోసం వచ్చాను.

ఏమి చేయాలో అర్థం కానీ పరిస్థితి బయటికి వచ్చి తప్పు చేశానా అనే మానసిక వేదన నాకు చాలా రోజులు ఉండేది. అలా చాలా డిస్టర్బ్ అయ్యాను. నేను కథలు రాసుకుందాం అన్నప్పుడు, కథ ఏమో రాస్తున్న అవి రెగ్యులర్ అయిపోతున్నాయి. కొత్తదనం లేదు అనిపించేది.

కొత్తగా ఏం చేయాలి అనుకున్నప్పుడు మా ఫాదర్ కి జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ సినిమాలో కంటే రెట్టింపు కామెడీని నేను చూశాను. దీన్ని ఎందుకు చెప్పద్దు మనం అని అనుకున్నాను. మలయాళం మరియు మరాఠీ సినిమాలు ఎక్కువగా చూస్తాను. చూశాక ఇలాంటిది ఒకటి చేయాలి కదా అంతే కల్ట్ గా మనం ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపించింది.

ఒక మంచి విషయం చెప్పాలి. నాటుగా ట్రై చెయ్యాలి మన కథ అయ్యిండాలి. మన తెలంగాణ గ్రామీణ ప్రాంత సంస్కృతి మీద నాకు అవగాహన ఉంది. పట్టు ఉంది. దీని మీద రాసుకుందాం అని ఫస్ట్ కొన్ని సీన్స్ కామెడీ గా రాసుకున్నాను. అవి కొందరికి చెప్పాను. అదిరిపోయింది మళ్ళీ రాయి అన్నారు. బాగా వర్కౌట్ అయ్యాయి.

మళ్ళీ నాలుగు సీన్స్ రాశాను. అక్కడి నుంచి సీరియస్ నెస్ వచ్చింది. ఇది చేద్దాం అని అనుకున్నాను. రాస్తూ రాస్తూ కామెడీ గా వెళ్లి అలా సీరియస్ నెస్ పెరిగిపోయి ఎమోషనల్ కంటెంట్ బయటికి వచ్చింది.

బలగం సినిమా చూశాక చాలామంది తిథి సినిమాతో కంపేర్ చేశారు. తిథి సినిమా నుచి ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకున్నారా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు వేణు… నా మనసులో కలిగిన ఆవేదన చెప్పాలి అనుకున్న, ఈ కథ అనుకున్నాక నెంబర్ అఫ్ సినిమాస్ చూశాను. తిథి సినిమాను చూశాను. తప్పే లేదు తిథి గొప్ప సినిమా. మేకింగ్ వైజ్ సినిమా ఎలా తీయాలని తిథిని చూసి నేర్చుకున్నాను.

తెలంగాణ నుంచి చాలామంది డైరెక్టర్స్ వచ్చారు. కానీ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఒక రూరల్ రూట్ నుంచి తీసుకున్న కథ ఎవ్వరు సాహసం చేయలేదు. చేసి మరి ప్రశంశలు అందుకున్నారని యాంకర్ ప్రశ్న అడుగుతారు.దానికి సమాధానంగా దర్శకుడు వేణు… మనం డిఫరెంట్ కథ ఎంచుకోవాలి. ఇప్పుడు వస్తున్న రెగ్యులర్ కథలు కాకుండా కొత్తది ఏదైనా ఎంచుకోవాలి.

Venu Yeldandi : బలగం సినిమా తెర వెనుక విశేషాలు.. ఎవ్వరికి తెలియని నిజాలు దర్శకుడు వేణు మాటల్లో..?
Image Source : Twitter / AndhraBoxOffice.Com

అలా ఎంచుకున్న తర్వాత నాకున్న స్ట్రెంగ్త్ కామెడీ అండ్ ఎమోషన్స్ బాగా రాసుకుంటాను. నాకు బాగా పట్టు ఉన్న స్లాంగ్ లో చేస్తే బాగుంటది కదా అనిపించింది. ఈ కథలో జరిగిన ఎమోషన్స్ సీన్స్ అన్ని మా ఊరు మా ఇంట్లో జరిగినవే 20% ఉన్నాయి. అదే గాలిలో అదే మట్టిలో అదే మనుషుల మధ్య తీయాలి. ఏవ్ మాటల్తో తీయాలి. అప్పుడే ప్యూరిటీ వస్తుంది.

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మరియు లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ కు మా ముగ్గురికి సింక్ బాగా కుదిరింది. నేను ఏం చెప్తున్నానో వాళ్లిద్దరూ బాగా అర్థం చేసుకునేవారు. ఈ మధ్య కాలంలో ఇంత క్లారిటీ గా ఎవ్వరు వివరించలేదని భీమ్స్ మరియు శ్యామ్ అన్నారు.

ఒక మనిషి పుట్టినప్పుడు సెలెబ్రేట్ చేసుకుంటాం. అలాగే మనిషి చచ్చిపోయాడు ఇంకా ఏం బాధలు ఉన్నాయి. అది కదా సెలెబ్రేట్ చేసుకోవాలి. అక్కడ కదా హ్యాపీగా పంపించాలి. ఏడ్చటం ఎందుకు చచ్చి సుఖపడటానికి వెళ్తున్నాడు. బాధలన్ని వదిలేసి దాన్ని సెలెబ్రేట్ చేయాలి. అనేది నా ఫీలింగ్.

అసలు ఈ ఐడియాతో ప్రొడ్యూసర్ శివరాం గారిని ఎలా అప్రోచ్ అయ్యారని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు వేణు… కథ మొత్తం ఆరు నెలలు వర్కౌట్ చేశాము. నా ఫ్రెండ్స్ నాగరాజు రమేష్ ఇది ప్రొడ్యూసర్ కి చెపుదాం కథ ఆల్మోస్ట్ గంట కంటెంట్ ఉంది. కథ మొత్తం ఉంది. ట్రీట్మెంట్ రాయాలి. డైలాగ్ వెర్షన్ రాయాలి. కథ నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ గా లేదు. మళ్ళీ అరుణ్ అనే పర్సన్ తో ఇంకో ఆరు నెలలు కూర్చొని కథ రెడీ చేశాము.

ఎవ్వరికి చెప్పాలి అనే తర్జన భర్జన లో ఉన్నాం. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి నా ఫ్రెండ్, ఒక కథ ఉంది వింటావా అని అడిగాను విందాం లే అన్నాడు. అలా ఒకరోజు కలిసి రెండు గంటలు కథ చెప్పాను. చెప్పాక ప్రదీప్ సైలెంట్ గా ఉన్నాడు. కథ నచ్చలేదేమో అనుకున్నాను. ప్రదీప్ లేచి కౌగిలించుకొని ఏందీ అన్న ఈ కథ వేల్యూ నీకు తెలుసా అన్నాడు. ఈ కథ నీకెందుకు రెండే రోజుల్లో నీకు ప్రొడ్యూసర్ ని సెట్ చేస్తా అని ప్రదీప్ అన్నాడు.

రెండు రోజుల తర్వాత ప్రొడ్యూసర్ శివరాం గారిని కలిసి కథ చెప్పడం జరిగింది. బాగుంది సర్ ఏం కావాలి మీకు ఇప్పుడు అని శివరాం గారు అన్నారు. ప్రొపెర్ ట్రీట్మెంట్ డైలాగ్ వెర్షన్ రాసుకోవాలి అన్నాను. శివరాం గారు ఆఫీస్ ఇచ్చారు. మూడు నెలలు కూర్చొని కథ మొత్తం ప్రొపెర్ గ రాసుకున్నా, రాసుకున్నాక మళ్ళీ ఫుల్ నరేషన్ ఇచ్చాను. కథ స్వరూపం మారిపోయింది. కథ చాలా బాగా వచ్చింది.

బలగం సినిమాలో నేను హీరోగా చేయాలి అనుకున్నా

ప్రొడ్యూసర్ శివరాం గారు నువ్వు డైరెక్షన్ కి వెళ్ళిపో అన్నారు. అదేంటి సర్ నేను రెండు సంవత్సరాలు నాకోసం రాసుకున్న సర్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, నేను హీరోగా చేయాలి అనుకుంటున్నా సర్, డైరెక్షన్ ఏంటి సర్ అని అన్నాను. చిన్న కథ కాదు ఇది పెద్ద హీరోతో వెళ్దాం అని శివరాం గారు అన్నారు. అలా ఆయన కన్విన్స్ చేశారు.

ఇలాంటి కథలు తీసుకెళ్లాలంటే టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఉండాలి. దిల్ రాజు గారు కరెక్ట్. దిల్ రాజు కి నేను చెప్తాను అని ప్రొడ్యూసర్ శివరాం గారు అన్నారు. ఒకరోజు దిల్ రాజు గారిని కలిసి కథ చెప్పాను. సింగల్ సిట్టింగ్ లోనే దిల్ రాజు గారికి చాలా బాగా నచ్చింది. దిల్ రాజు గారి చేతికి వెళ్ళిన తర్వాత ఆయన అనుభవంతో ఇంత రా గా వెళ్లొద్దు. చివరికి ఆర్ట్ సినిమా అయిపోతుంది అని చెప్పారు.

మనం థియేటర్ లో వెళ్తున్నాం కాబట్టి కమర్షియల్ గా కూడా ఉండాలి. స్క్రిప్ట్ దశలోనే చేశాము. దిల్ రాజు గారు వచ్చాక కలర్ ఫుల్ గా అయ్యింది. అంతకు ముందు రా గా ఉండింది. బలగం సినిమాకు హీరో దిల్ రాజు గారే ఒక విధంగా, ఆయన భుజాన వేసుకొని ఈ సినిమా డబ్బుల కోసం కాదు, ప్రతి కుటుంబానికి మనుషులకి వెళ్ళాలి.

కాస్టింగ్ కోసం 6 నెలలు టైం తీసుకున్నాము. దర్శికి కథ చెప్తుంటే దొర్లి దొర్లి నవ్వాడు.కావ్య తెల్లగా ఉంటుంది. ఆ అమ్మాయిని డార్క్ చేశాను. కావ్య ఒకరోజు పింపుల్ వచ్చింది అని ఇబ్బంది పడుతుంది. ఆ పింపుల్ మైంటైన్ చేయ్ అదే నాకు కావాలి అని దర్శకుడు వేణు అన్నారు.

Venu Yeldandi : బలగం సినిమా తెర వెనుక విశేషాలు.. ఎవ్వరికి తెలియని నిజాలు దర్శకుడు వేణు మాటల్లో..?
Image Source : Twitter / AndhraBoxOffice.Com

క్లైమాక్స్.. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్

క్లైమాక్స్ విషయానికి వస్తే నా రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనల ఆధారంగా రాసుకున్నాను తీశాను. మా పెదనాన్న వయసు 96 చనిపోయారు. అప్పుడు నేను షూటింగ్ లో ఉన్న మళ్ళీ పది రోజుల తర్వాత మా పెద్దమ్మ చనిపోయింది. అప్పుడు నేను ఫారిన్ లో షూటింగ్ లో ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత ఊరికి వెళ్ళి మా అన్నయ్యను కలిశాను. మా అన్నయ్య ఒక మాట అన్నాడు.

అమ్మ నాన్నల దోస్తీ 82 ఏళ్లు రా అమ్మ తన దోస్త్ ను కోల్పోయింది. అమ్మ కూడా తట్టుకోలేక చనిపోయింది. అప్పుడు బుడగ జంగం అతను ఒకడు వచ్చాడు. మా అన్నయ్య అతనికి డబ్బులు ఇచ్చి పెద్దమ్మ పెదనాన్న పేర్లు చెప్పాడు. వాళ్ళ పేర్లతో బుర్ర కథలా పాడటం మొదలు పెట్టారు. అలా ఇంట్లో ఉన్న వాళ్లంతా ఒక్కొక్కరు గా పేర్లు చెప్పారు. వాళ్ళ పేర్లతో కూడా పాడాడు. ఆ ఐడియా నాకు బాగా నచ్చింది ఇదే నా క్లైమాక్స్ అని ఫిక్స్ అయ్యినట్లు దర్శకుడు వేణు అన్నారు.

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ తన గురించి ఎవ్వరికి తెలియని ఆసక్తికర విషయాలు.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..!

Hello Friends, My Name is Surya, I Am The Writer And Founder Of This Blog And Share All The Information Related To Entertainment Through This Website.

Sharing Is Caring:

Leave a Comment