Varun Tej : మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో ప్రభాస్ డైలాగ్ తో అదరగొట్టిన వరుణ్ తేజ్..?

Varun Tej : మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో ప్రభాస్ డైలాగ్ తో అదరగొట్టిన వరుణ్ తేజ్..? : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన మట్కా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను వైజాగ్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ప్రభాస్ డైలాగ్ తో అందరిని ఆశ్చర్యపరిచిన వరుణ్ తేజ్. ఆ విశేషాలు ఏంటో వరుణ్ తేజ్ మాటల్లోనే తెలుసుకుందాం.

Varun Tej : మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో ప్రభాస్ డైలాగ్ తో అదరగొట్టిన వరుణ్ తేజ్..?
Image Source : Twitter / Varun Tej Konidela

Varun Tej : మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో ప్రభాస్ డైలాగ్ తో అదరగొట్టిన వరుణ్ తేజ్..?

మట్కా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కి యాంకర్ గా సుమ గారు వ్యవహరించారు. వరుణ్ తేజ్ భార్య హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా మట్కా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి హాజరయ్యారు. యాంకర్ సుమ గారు వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలను అడిగారు. ఫన్నీ క్వశ్చన్స్ అడిగిన సుమ గారు, వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ఫన్నీ గానే స్పందించడం జరిగింది.

యాంకర్ సుమ గారు ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ అడుగుతారు. అందులో సుమ గారు అడిగిన మొదటి ప్రశ్న వరుణ్ తేజ్ మీరు వంట చేస్తున్నప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరిగిస్తారు. దానికి సమాధానంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ… అవును నిజమే అని అంటారు. లావణ్య త్రిపాఠి చేతిలో నుంచి మైక్ లాక్కొని వరుణ్ తేజ్ ఇలా అంటాడు. ఇందాక నుంచి మీ చెవిలో అందరు మీకు పూలు పెడుతున్నారు. అని వరుణ్ తేజ్ ఫన్నీగా కామెంట్స్ చేస్తాడు. రెండవ ప్రశ్న లావణ్య త్రిపాఠి సాంబార్ బాగా వండుతుంది. దానికి సమాధానంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ అవును నిజంగానే బాగా పెడుతుంది.

మీరు లావణ్యను పెళ్లి చేసుకునేటప్పుడు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఏదోకటి పబ్లిక్ లో చెప్పగలిగేది ఉంటే చెప్పండి అని యాంకర్ సుమ గారు అడుగుతారు. దానికి సమాధానంగా వరుణ్ తేజ్… పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేశాను నిలబెట్టుకున్నాను. రెండు సంవత్సరాలు ముందు ఇంట్లో చెప్తాను అని చెప్పాను. ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాను. లావణ్య మీరు ఇచ్చినటువంటి ప్రామిస్ చెప్పండి అని యాంకర్ సుమ గారు అడుగుతారు. దానికి సమాధానంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ… నేను ప్రామిస్ లు చేయను. అప్పుడు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి చేతిలో నుంచి మైక్ లాక్కొని తను ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పదు అని వరుణ్ తేజ్ అంటాడు.

ఆ డైలాగ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఛత్రపతి. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ తన తల్లితో అన్న డైలాగ్ అది. వరుణ్ తేజ్ ఆ డైలాగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. ప్రభాస్ అంటే వరుణ్ తేజ్ కి చాలా ఇష్టం. వరుణ్ తేజ్ లోఫర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ప్రభాస్ గెస్ట్ గా రావడం జరిగింది. ఆ ఫంక్షన్ లో ప్రభాస్ గురుంచి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వరుణ్ తేజ్. నేను ప్రభాస్ గారు నటించిన ఈశ్వర్ సినిమా మొదటి రోజే థియేటర్ లో చూశాను. ఈశ్వర్ సినిమా నుంచే ప్రభాస్ గారి ఫ్యాన్ అని వరుణ్ తేజ్ అన్నారు.

మట్కా సినిమా విడుదల తేది నవంబర్ 14 2024

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం మట్కా. మట్కా సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో నోరా ఫతేహి కీలక పాత్రలో నటిస్తుంది. మట్కా సినిమాకు కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కలిసి సంయుక్తంగా నిర్మిష్ఠిన్నారు. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. మట్కా సినిమాను ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14 2024 వ తేదిన విడుదల కానుంది.

Rakesh Varre : తెలుగు సెలబ్రిటీస్ పిలిస్తే ఎవ్వరు రారు.. చిన్న సినిమాలను సపోర్ట్ చేయరు అని ఆవేదన వ్యక్తం చేసిన రాకేష్..?

Hello Friends, My Name is Surya, I Am The Writer And Founder Of This Blog And Share All The Information Related To Entertainment Through This Website.

Sharing Is Caring:

Leave a Comment