Uday Kiran : దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు… : దర్శకుడు తేజ ఒక ప్రముఖ మీడియా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ఉదయ్ కిరణ్ గురించి అడుగుతారు. ఉదయ్ కిరణ్ ను ఉద్దేశిస్తూ దర్శకుడు తేజ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
Uday Kiran : దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు…
అహింస సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ప్రముఖ మీడియా యూట్యూబ్ ఛానల్ కి దర్శకుడు తేజ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో దర్శకుడు తేజను యాంకర్ ఒక ప్రశ్న అడుగుతారు. ఎక్కువగా మీ ఇంటర్వ్యూ లలో అడిగే ప్రశ్న ఉదయ్ కిరణ్ గురించి టైం వచ్చినప్పుడు చెప్తా అన్నారు ఆ టైం ఎప్పుడు వస్తుంది అని యాంకర్ అడుగుతారు.
Uday Kiran : దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు… దానికి సమాధానంగా దర్శకుడు తేజ… నేను పోయే లోపు వస్తుంది. నిజం చెప్పనా మీరందరు చాలా ఫెంటాస్టిక్ గా యాక్టింగ్ చేస్తున్నారు. మొత్తం ప్రజలు ఫ్యాన్స్ అందరూ యాక్టింగ్ చేస్తున్నారు. మీరందరికి తెలుసు అసలు కథ నాతో చెప్పించటానికి ట్రై చేస్తున్నారు. వాస్తవం అయితే అందరికి తెలుసు దేని వల్ల ఎవరి వల్ల ఎందుకు ఎప్పుడు ఎట్లా అని…
Uday Kiran : దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు… నా ద్వారా చెప్తే ఒక అండర్లైన్ వచ్చి నిజం అవుతుంది. అందుకని సరైన సమయం చూసి చెప్తాను. ఎందుకంటే చెప్పేటప్పుడు ఒక సరైన స్టేజీ మీద అపాత్ర దానం చేయకూడదు. సరైన స్టేజీ సెట్ చేస్తాను సెట్ చేశాక చెప్తాను.
ఉదయ్ కిరణ్ కి అభిమానులు రావటానికి కారణం నేనే కదా సింపతీ రావటానికి కారణం నేనే కదా ఉదయ్ కిరణ్ పైకి రావటానికి కూడా కారణం నేనే కదా నిజం చెప్పేస్తాను నేనేం దాచుకోను. దర్శకుడు తేజ కామెంట్స్ తాజాగా యూట్యూబ్ లో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఉదయ్ కిరణ్ సినీ ప్రస్థానం
ఉదయ్ కిరణ్ కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ చేసేవాడు. సినీ ప్రేక్షకులు మరియు అభిమానులు అందరూ అనుకుంటారు ఉదయ్ కిరణ్ మొదటి సినిమా చిత్రం అని, కానీ చాలా మందికి తెలీదు ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మొదటి సినిమా Mysterious Girl. ఈ సినిమా అనివార్య కారణాల వల్ల విడుదల ఆలస్యం అయ్యింది. అలా మొదటి సినిమా చిత్రం తో ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయం అయ్యాడు.
ఉదయ్ కిరణ్ – తేజ మూవీస్
తేజ దర్శకుడు కాకముందు సినిమాటోగ్రాఫర్ గా పని చేసేవారు. తెలుగులో ఒక ఐదు సినిమాలు మరియు హిందీలో దాదాపు ముప్ఫైకు పైగా సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
చిత్రం సినిమాతో తేజ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ముందుగా చిత్రం సినిమాకు ఉదయ్ కిరణ్ హీరో కాదట వేరే హీరోను అనుకున్నారంట ఆ హీరో రెమ్యూనరేషన్ ఎక్కువ అడగటంతో ఉదయ్ కిరణ్ హీరోగా పెట్టి సినిమా తీశాను అని దర్శకుడు తేజ అన్నారు.
అలా ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయం అయ్యాడు. చిత్రం సినిమా రీమా సేన్ హీరోయిన్ గా మొదటి సినిమా కావడం విశేషం. అంతే కాకుండా చిత్రం సినిమాలో నటించిన నటీనటులు అందరూ కొత్తవారే కావడం విశేషం. ఈ సినిమాతోనే శీను కాస్త చిత్రం శ్రీను మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు.
చిత్రం సినిమాను ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీ రావు నిర్మించారు. చిత్రం సినిమాకు RP పట్నాయక్ మ్యూజిక్ ని అందించారు. RP పట్నాయక్ కి చిత్రం మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు కులశేఖర్ పాటలు రాశారు. ఆయనకు కూడా మొదటి సినిమా కావడం విశేషం.
చిత్రం సినిమా రొమాంటిక్ కామెడీ ఫిలిం గా తెరకెక్కింది. చిత్రం సినిమా జూన్ 16 2000 న విడుదల అయ్యింది. చిత్రం సినిమా 42 లక్షల బడ్జెట్ తో తెరకెక్కించారు. చిత్రం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా చిత్రం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 9 కోట్లను కలెక్ట్ చేసింది. చిత్రం సినిమా 2000 సంవత్సరానికి గాను Sensational హిట్ గా నిలిచింది.
దర్శకుడు తేజ మరియు ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా నువ్వు నేను. ఈ సినిమాలో హీరోయిన్ గా అనిత నటించింది. అనితకి హీరోయిన్ గా మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమాను ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో కిరణ్ నిర్మించారు.
నువ్వు నేను సినిమా రొమాంటిక్ డ్రామా ఫిలిం గా తెరకెక్కించారు. ఈ సినిమాకు RP పట్నాయక్ మ్యూజిక్ ని అందించారు. ఈ సినిమా మ్యూజిక్ మరియు పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. నువ్వు నేను సినిమా ఆగష్టు 10 2001 న విడుదల అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గ నిలిచింది.
నువ్వు నేను సినిమాకు నాలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ మరియు ఐదు నంది అవార్డ్స్ వచ్చాయి. ఉదయ్ కిరణ్ కి హీరోగా మొదటి ఫిలింఫేర్ అవార్డ్ కావడం విశేషం. అంతే కాకుండా తేజ, RP పట్నాయక్ మరియు సినిమాకు కూడా ఫిలింఫేర్ అవార్డ్స్ లభించాయి.
దర్శకుడు తేజ, యాక్టర్ తనికెళ్ళ భరణి, కమెడియన్ సునీల్, రసూల్ మరియు RP పట్నాయక్ కు నంది అవార్డ్స్ లభించాయి.
దర్శకుడు తేజ మరియు ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం ఔనన్న కాదన్నా. ఈ సినిమాలో సదా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు RP పట్నాయక్ మ్యూజిక్ ని అందించారు. ఔనన్న కాదన్నా సినిమాను లక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ లో అట్లూరి పూర్ణ చంద్రరావు నిర్మించారు.
ఔనన్న కాదన్నా సినిమా పాటలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది.
ఉదయ్ కిరణ్ పర్సనల్ లైఫ్
మెగాస్టార్ చిరంజీవి మొదటి కుమార్తె సుస్మిత తో ఉదయ్ కిరణ్ కి నిశ్చితార్థం 2003 లో జరిగింది. కానీ తర్వాత నిశ్చితార్థం రద్దు చేయబడింది. ఉదయ్ కిరణ్ అక్టోబర్ 24 2012 న విషితను పెళ్లి చేసుకున్నాడు.
ఉదయ్ కిరణ్ కెరీర్ మొదట్లో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఉదయ్ కిరణ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా నిలిచాడు. తర్వాత సినిమాలు ప్లాప్ కావడం మరియు అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఉదయ్ కిరణ్ జనవరి 5 2014 న సూసైడ్ చేసుకున్నాడు.