Sukumar : రంగస్థలం సినిమా తెర వెనుక మీకు తెలియని నిజాలు… దర్శకుడు సుకుమార్ మాటల్లో..? : దర్శకుడు సుకుమార్ రంగస్థలం సినిమా తెర వెనుక విశేషాలు మరియు రామ్ చరణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.
రామ్ చరణ్ కి ఆ ఒక్క సీన్ చెప్పడానికి చాలా భయపడ్డాను… దర్శకుడు సుకుమార్
దర్శకుడు సుకుమార్ రంగస్థలం సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. రామ్ చరణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్న దర్శకుడు సుకుమార్.
రంగస్థలం సినిమా స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు రామ్ చరణ్ దృష్టిలో పెట్టుకొని ఏమైనా స్క్రిప్ట్ లో కొన్ని సీన్స్ రామ్ చరణ్ కి చెప్పడానికి ఏమైనా ఇబ్బంది పడిన సందర్బాలు ఉన్నాయా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు సుకుమార్… మెయిన్ సీన్ ప్రకాష్ రాజ్ బెడ్ మీద ఉన్నప్పుడు యూరిన్ బ్యాగ్ తీసే సీన్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అంతే కాకుండా చాలా భయమేసింది.
రామ్ చరణ్ యూరిన్ బ్యాగ్ తీయాలని, సో అది సినిమానే నటనే కానీ చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాను. కానీ రామ్ చరణ్ మాత్రం చాలా నార్మల్ గా సింపుల్ గా తీసుకోని ఓకే చేద్దాం అన్నాడు. రామ్ చరణ్ తన ఒక్కడి క్యారెక్టర్ ఏ ఉండాలి మిగతా క్యారెక్టర్లు ఉండకూడదు. హీరోయిజం ఉండాలి లేకపోతే ఇలాగే ఉండాలి అని ఎప్పుడు అనుకోలేదు. డెఫినిట్ గా అది రామ్ చరణ్ గొప్పతనం అనే చెప్పుకోవాలి.
Sukumar : రంగస్థలం సినిమా తెర వెనుక మీకు తెలియని నిజాలు… దర్శకుడు సుకుమార్ మాటల్లో..?
రంగస్థలం సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ థాట్ ఎలా వచ్చింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు సుకుమార్… నాన్నకు ప్రేమతో మరియు 1 నేనొక్కడినే సినిమాలు ఫారిన్ లో షూట్ చేశాము. తర్వాత ఏం సినిమా చేద్దాం అన్నప్పుడు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఎలాంటి కథైనా ఏ కథైనా కానీ సరే రా గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే చేద్దాం అని ముందే ఫిక్స్ అయ్యాను.
రంగస్థలం సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యి సుకుమార్ సక్సెస్ కొట్టాలని సోషల్ మీడియాలో చాలా మంది కోరుకున్నారు. అని యాంకర్ ప్రశ్న అడిగారు. దానికి సమాధానంగా దర్శకుడు సుకుమార్… చాలామంది నా సక్సెస్ ని కోరుకున్నారు. కొన్ని సార్లు పాజిటివ్ వైబ్స్ అన్ని కొడుతూ ఉంటాయి. ఈ సినిమా పట్ల అందరూ పాజిటివ్ ఫీల్ అయ్యారు. అందరూ స్పందించారు. చాలా పెద్ద హిట్ కావాలని కోరుకున్నారు.
చాలామంది డైరెక్టర్స్ అందరూ నా ఫ్రెండ్స్ ఏ, వాళ్ళు కూడా నువ్వు గట్టిగా కొట్టాలి చాలా పెద్ద హిట్ కావాలి నీకు వస్తే బాగుంటుంది అని అందరు ఫీల్ అయ్యారు. నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కావాలని అందరు అనుకున్నారు. చివరకు ఈరోజు అదే సక్సెస్ అయ్యింది.
మీరు ఊహించారా రంగస్థలం సినిమా స్టార్ట్ అయేటప్పుడు ఇంత సక్సెస్ అవుతుంది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు సుకుమార్… ప్రొడ్యూసర్స్ రవి, నవీన్ మరియు మోహన్ గారు చాలా బలంగా నమ్మేవాళ్ళు, కథ చెప్పినప్పుడు ఈ కథ చాలా ఎమోషనల్ గా ఉంది. క్లైమాక్స్ వచ్చేసరికి రవి గారు వచ్చి హాగ్ చేసుకున్నారు. పెద్ద హిట్ అవుద్ది సినిమా అని రవి గారు అన్నారు. నేను మాత్రం డెఫినిట్ గా ఈసారి సినిమా తప్పు చేయదు అనుకున్నాను. ఇంత పెద్ద హిట్ అవుతుంది అని అస్సలు ఊహించలేదు.
రంగస్థలం సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్, మీరు కూడా విలేజ్ నుంచి వచ్చారు. మీకు సంబందించిన సంఘటనలు జత చేర్చడం జరిగిందా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు సుకుమార్… డెఫినిట్ గా అండి నా చైల్డ్ హుడ్ మెమోరీస్ కానీ మా విలేజ్ కానీ బాగా ఇంఫ్లుయెన్స్ చేస్తాయి నన్ను, నేను చూసిన క్యారెక్టర్లు కానీ దేన్నీ డైరెక్ట్ గా తీసుకోలేదు కానీ ఎక్కడో ఒకచోట ఇంఫ్లుయెన్స్ అనేది ఉంటాది. నా చిన్నప్పుడు క్యారెక్టర్లు ఇంఫ్లుయెన్స్ ఉంటాది.
మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు సుకుమార్… మా అన్నయ్య ఎక్స్పీరియన్సెస్ బాగా షేర్ చేసుకున్నాడు. ఇందులో బ్యాక్ డ్రాప్ కి కానీ లేకపోతే కాస్ట్యూమ్స్ కానీ దేని సంబందించి అయినా అప్పటి పరిస్థితులు ఇలా ఉండేది అని నాతో మరియు నా రైటింగ్ టీంతో అన్నయ్య షేర్ చేసుకున్నారు. ఆ విధంగా అన్నయ్య హెల్ప్ ని మరిచిపోలేను.
రంగస్థలం సినిమా టెక్నీషియన్స్ మరియు యాక్టర్స్ అందరికి పేరు వచ్చింది. అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు సుకుమార్… చాలా బాగుంది అన్ని కుదరడం. అందరూ టెక్నీషియన్స్ ఎక్స్పర్ట్స్ సినిమాటోగ్రఫీ రత్నవేలు గారు సూపర్ అసలు, దేవి శ్రీ ప్రసాద్ అంటే మ్యూజిక్, మ్యూజిక్ అంటే దేవి శ్రీ ప్రసాద్ పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ గా చేశాడు.
అంటే ప్రొడ్యూసర్స్ ఏ టైపు అంటే ఒకరోజు 1500 మంది భోజనం చేస్తున్నారు. ఇంత అదృష్టం ఇంత మందికి భోజనం పెడుతున్నామా అని నాతో అన్నారు. ఎంత మందిని అయినా పిలిపించండి. మనుషులకు భోజనం పెడితే చాలా ఆనందంగా ఉంటుంది. ఎంత జనాభా అయినా మీరు పిలిపించండి మనకు కూడా పుణ్యం ఉంటుంది. ఏ టైపు ప్రొడ్యూసర్స్ అంటే అలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటె అదృష్టం ఎక్కడ రెస్ట్రిక్షన్ అనేది లేదు.
సినిమా బడ్జెట్ ఎక్కువ పెరిగే కొద్దీ భయం టెన్షన్ ఉంటాది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు సుకుమార్… చాలా టెన్షన్ ఉంటాది బడ్జెట్ పెరుగుతున్నప్పుడు కానీ బడ్జెట్ పెరుగుతున్న విషయం ప్రొడ్యూసర్స్ నాకు ఎప్పుడు చెప్పలేదు. అందుకే నాకు టెన్షన్ లేదు.
ఆది పినిశెట్టి క్యారెక్టర్ సినిమాలో కీ రోల్ తనని ఎలా తీసుకున్నారు అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు సుకుమార్… కొన్నిసార్లు కాస్టింగ్ అలా కుదిరిపోతుంది. కథలో కావచ్చు లేకపోతే పెర్ఫార్మన్స్ లో కావచ్చు ప్రతి విషయంలో తను హెల్ప్ చేశాడు. ఆదికి ఈ క్యారెక్టర్ దొరకడం అదృష్టం.
అనసూయ రంగమ్మ అత్తగా చేయను నాకు ఇష్టం లేదు అని అనిందా యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు సుకుమార్… తను చేస్తా అంది ముందు కానీ క్యారెక్టర్ వచ్చిన తర్వాత వయసు ఎక్కువ అనేసరికి భయపడింది. ఒక్కసారి క్యారెక్టర్ పెర్ఫర్మ్ చేయడం వలన తనకు ప్రతిరోజూ ప్రాబ్లెమ్ ఉండేది. సర్ మళ్ళీ వయసు ఎక్కువ చేస్తున్న అని డైలమాలో ఉండేది. లేదు ఈ క్యారెక్టర్ నీకు మంచి పేరు వస్తుంది.
సమంతకు పెళ్ళి అయితే ఏంటి యాక్ట్ చేయకూడదా… దర్శకుడు సుకుమార్
రంగస్థలం సినిమాలో ముఖ్యంగా సమంత గురించి చెప్పాలి. సినిమా కరెక్ట్ గా ఉంటె ఆ అమ్మాయికి పెళ్లి అయ్యిందా అని ఆడియన్స్ చూడరు. ఒక అపోహ ఉండిపోయింది అందరికి ఒక హీరోయిన్ కి మ్యారేజ్ అయితే సినిమాకు పనికిరాదు సినిమా చేస్తే ఆడియన్స్ చూడరు అని, సమంతతో చేస్తే ఇంత పెద్ద సూపర్ హిట్ అయ్యింది. ఆ రూల్ బ్రేక్ అయ్యింది. సమంత ఎక్స్ట్రార్డినరీ గ చేసింది అని సుకుమార్ అన్నారు.
Maruthi : భలే భలే మగాడివోయ్ సినిమా తెర వెనుక మీకు తెలియని నిజాలు… దర్శకుడు మారుతి మాటల్లో…