Sudheer Varma : స్వామి రారా సినిమా తెర వెనుక విశేషాలు.. డైరెక్టర్ సుధీర్ వర్మ మాటల్లో..?

Sudheer Varma : స్వామి రారా సినిమా తెర వెనుక విశేషాలు.. డైరెక్టర్ సుధీర్ వర్మ మాటల్లో..? : దర్శకుడు సుధీర్ వర్మ స్వామి రారా సినిమా తెర వెనుక విశేషాలు మరియు సినిమాకు సంబంధించిన ఎవ్వరికి తెలియని నిజాల్ని పంచుకోవడం జరిగింది.

Sudheer Varma : స్వామి రారా సినిమా తెర వెనుక విశేషాలు.. డైరెక్టర్ సుధీర్ వర్మ మాటల్లో..?

Sudheer Varma : స్వామి రారా సినిమా తెర వెనుక విశేషాలు.. డైరెక్టర్ సుధీర్ వర్మ మాటల్లో..?

దర్శకుడు సుధీర్ వర్మ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో స్వామి రారా సినిమా తెర వెనుక విశేషాలు మరియు పలు ఆసక్తికర విషయాల్ని పంచుకోవడం జరిగింది. డెబ్యూట్ డైరెక్టర్ గా ఫస్ట్ ఫిలిం ఛాలెంజింగ్ గా ఉంటుంది. లైక్ స్క్రిప్ట్ చెప్పడం కానీ మీ ఫస్ట్ సినిమాకు ఆ స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు సుధీర్ వర్మ…

నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడానికి కష్టపడ్డానేమో కానీ డైరెక్టర్ అవ్వటానికి అంతా కష్టపడలేదు. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్స్ ఎవర్తెతో ఉన్నారో వాళ్ళ ప్రీవియస్ ఫిల్మ్ కూడా నిఖిల్ తోనే చేశారు. ఆ సినిమాకు నేను చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండేవాడిని. ఆ సినిమా పేరు వీడు తేడా. వీడు తేడా సినిమా కొంచెం ప్రొడక్షన్ సైడ్ కూడా హెల్ప్ చేశాను. ప్రొడ్యూసర్స్ కి వీడు తేడా మొదటి సినిమా కావడం విశేషం.

వీడు తేడా సినిమా బిజినెస్ మీద అంత గ్రిప్ లేకపోవటం వలన సినిమా కొంచెం డబ్బులు ప్రొడ్యూసర్స్ నష్టపోవడం జరిగింది. సో దాని వల్ల ప్రొడ్యూసర్స్ మళ్ళీ నిఖిల్ తోనే సినిమా చేద్దాం నువ్వు డైరెక్ట్ చెయ్యి అన్నారు. నాకు ఆఫీస్ ఇచ్చి నిఖిల్ హీరోగా తెలుసు ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు. అప్పుడు కథ రాయడం మొదలుపెట్టాను. కథ పూర్తీ అయ్యిన తర్వాత హీరోను అప్రోచ్ అయ్యి ప్రొడ్యూసర్ ని అప్రోచ్ అయ్యే స్ట్రగుల్స్ ఏం లేవు. ఎందుకంటే నిఖిల్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. తను చేయడానికి రెడీగా ఉన్నాడు. ప్రొడ్యూసర్స్ కూడా రెడీగా ఉన్నారు.

అనంత పద్మనాభ స్వామి గుడి ఒక విగ్రహం దొంగతనం దీని మీద అల్లిన కథ ఇది. ఈ స్ట్రక్చర్ ఎలా ఫార్మ్ అయ్యింది. ఈ ఐడియా ఎలా పుట్టింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు సుధీర్ వర్మ… ఆ టైంలో అనంత పద్మనాభస్వామి గుడి ఆ నేలమాలికలు ఆ ట్రెజర్ అప్పుడు ఆ టైంకి ఎక్సయిటింగ్ న్యూస్ గా ఉండింది. అప్పుడు కొంచెం అందరూ న్యూస్ ఛానల్ లో ఒక్కో రూమ్ ఓపెన్ చేస్తే ఎంత ట్రెజర్ ఉంటుందని అనుకునేవారు. ఆ పాసనేషన్ తో అక్కడి నుంచి ఏదైనా ఒక విగ్రహం పెట్టి అప్పుడు నేను ఆ టైపు లో క్రైమ్ కామెడీ చేద్దాం అనుకున్నాం.

ఈ కథలో ఏదైనా సెంటర్ పాయింట్ దేని మీద కైనా వెళ్లాలని అలా ఈ పాయింట్ మీద ఫిక్స్ అయ్యాం. ఏంటంటే ఒక నాలుగు స్టోరీస్ ఒక ఇన్సిడెంట్ గురించి అన్ని కలవాలి ఒక దగ్గర అన్నది ముందు ఫిక్స్ అయ్యాం. సో దాని ప్రకారం నిఖిల్ కి సెపరేట్ స్టోరీ స్వాతికి సెపరేట్ స్టోరీ రవి బాబుకి సెపరేట్ స్టోరీ జీవా గారికి సెపరేట్ స్టోరీ అలా రాసుకున్నాం. సో ఈ నాలుగు స్టోరీస్ విగ్రహం అనే ఒక సెంటర్ పాయింట్ మీదే కలుస్తాయి. స్వాతికి నిఖిల్ కి పరిచయం ఉన్న బట్ మెయిన్ గా విగ్రహం గురించి వాళ్ళ స్టోరి అంత నడుస్తుంది.

స్వాతి రెడ్డి హీరోయిన్ గా పర్ఫెక్ట్ యాప్ట్ అని నిఖిల్ సజెస్ట్ చేశారు

ఈ సినిమాలో హీరోయిన్ గా స్వాతి రెడ్డి ఎలా వచ్చింది. మీరు ఎలా అప్రోచ్ అయ్యారని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు సుధీర్ వర్మ… ఈ సినిమా తక్కువ బడ్జెట్ లోనే చేద్దాం అని ముందు నుంచే ఫిక్స్ అయ్యాం. సో ఆ టైంలో ఏమైనా చిన్న హీరోయిన్ పెట్టుకుందాం లేకపోతే కొత్త హీరోయిన్ పెట్టుకుందాం అనే ఆలోచిస్తున్నాం. హీరోయిన్ గా ఎవరు ఏంటి అన్నది.

అలా ఆలోచిస్తుంటే ఒకరోజు నిఖిల్ వచ్చి భయ్యా స్వాతి రెడ్డిని పెట్టుకుందాం అన్నాడు. మనం చిన్న హీరోయిన్ అనుకుంటున్నాం కదా అని నేను చెప్పాను. స్వాతి రెడ్డి అంటే కొంచెం ఎక్కువ అవుతుంది ఏమో చూడు అని నేను అన్నాను. లేదు భయ్యా స్వాతి రెడ్డి సినిమాకు బాగా వర్కౌట్ అవుతాది అని నిఖిల్ చెప్పాడు. స్వాతి రెడ్డి డెఫినిట్ గా ప్లస్ అవుతుంది. అప్పుడు స్వాతి రెడ్డిని అప్రోచ్ అయ్యి కథ చెప్పడం ఆమెకు నచ్చడం ఇమ్మీడియేట్ గా నేను చేస్తున్న అని స్వాతి రెడ్డి చెప్పారు.

స్వామి రారా సినిమాలో ముఖ్యంగా టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకోవాలి అందులో కామెరామెన్ రిచర్డ్ ప్రసాద్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ ఎమ్మార్ అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు సుధీర్ వర్మ… ఫస్ట్ ఏంటంటే రిచర్డ్ ప్రసాద్ ఆ టైంలో వెన్నెల 1.5 మూవీ చేస్తున్నాడు. ఆ సినిమాకు డైరెక్టర్ వెన్నెల కిషోర్. ఆ సినిమా నిర్మాతది భీమవరం మా ఊరే ఆయన నాకు బాగా క్లోజ్ అన్నమాట. ఆ సినిమా మొత్తం బ్యాంకాక్ లో షూట్ చేశారు. ఆ సినిమా కెమెరామెన్ కి అసిస్టెంట్ గా రిచర్డ్ ప్రసాద్ చేసేవాడు. నా ఫ్రెండ్ కృష్ణ చైతన్య ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. మా తమ్ముడు ఆ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతున్నప్పుడు వెళ్ళాడు. అక్కడ రిచర్డ్ ప్రసాద్ వర్క్ చూసి మా తమ్ముడు వచ్చి రిచర్డ్ మన కెమెరామెన్ అని చెప్పాడు. అలా రిచర్డ్ ప్రసాద్ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు.

అనిల్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవారు. ఇప్పుడు ఆయన లేరు ఆక్సిడెంట్ లో చనిపోయారు. లేకపోతె ఆయన్నే తీసుకునేవాళ్ళం. సన్నీ అనిల్ సాంగ్స్ అన్ని ముంబైలో మిక్స్ చేసేవాడు. అప్పుడు సన్నీ కి చెపితే ఒక 10 ట్రాక్స్ పంపించాడు. ఒక మూడు ట్రాక్స్ వినగానే సన్నీనే పెట్టుకుందాం అనిపించింది. ఫస్ట్ దొంగతనం సిట్యుయేషన్ చెప్పా. ఆ సిట్యుయేషన్ కి తగ్గట్టు ఆ ట్యూన్లో స్వామి రారా అని పాడి పంపించాడు. అప్పుడు భలే ఉందే సౌండింగ్ అని ఈ టైటిల్ మన సినిమాకు కరెక్ట్ అనిపించింది. అప్పుడే ఆ టైటిల్ ని రిజిస్టర్ చేసి పెట్టాం.

మీరు సినిమాలో ఎక్కువగా అచ్చ తెలుగు పదాలు వాడారని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు సుధీర్ వర్మ… అంటే యాక్టువల్లీ సినిమా ఓపెనింగ్ జోగి బ్రదర్స్ మీద జరుగుతుంది. అది మాములుగా సినిమా హాఫ్ లో వచ్చే సీన్. ఆ సీన్ హాలీవుడ్ సినిమా నుంచి రిఫరెన్స్ తీసుకున్న. ఆ సీన్ ఏంటంటే ఓపెనింగ్ ఒక రెస్టారెంట్ రాబరీ సీన్ తో స్టార్ట్ చేసి మళ్ళీ సినిమా ఎండింగ్ అక్కడికే వస్తారు. ఆ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. సో అలా జోగి బ్రదర్స్ సీన్ ఫస్ట్ తీసుకున్నాను.

నాకు ఎందుకో నిఖిల్ స్వాతి సీన్ మీద వచ్చినప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తున్నాం ముందు ఏం జరిగింది అని తెలియదు. నాకు ఎందుకో ఇన్ని రోజుల క్రితం లేకపోతే ఒక సంవత్సరం క్రితం అని వేయడం ఇష్టం లేదు. ఎందుకంటే అది రెగ్యులర్ అయిపోతుంది. సో మనకు ఋతువులు ఉన్నాయి కదా ఫస్ట్ జోగి బ్రదర్స్ వచ్చినప్పుడు ఒక ఋతువు వస్తుంది. బ్యాక్ కి వెళ్లినట్టు చాలా తక్కువ మందికి అర్థం అవుతుంది.

సో నాకు ఏం అనిపించింది అంటే తక్కువ మందికి అర్థం అవ్వాలి. ఎందుకు అంటే ఇప్పుడు నేను బేసిక్ గా థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తే ఏ ఋతువు ముందు వెనుక అని నాకు తెలీదు. ఇది ఏదో కొత్తగా వేశారు అనుకుంటారు కానీ, లాజికల్ గా బ్యాక్ వెళ్ళాం అన్నమాట. సో ఏది ఆడియన్స్ కి క్లియర్ గా ఇన్ని రోజులు బ్యాక్ అన్నది చెప్పకుండా ఇది సింపుల్ గా వేషం అన్నమాట.

సత్య అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కమెడియన్ సత్యగా మారాడు

కమెడియన్ సత్య ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చాడు అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు సుధీర్ వర్మ… సత్య ఎప్పటి నుంచో నాకు పరిచయం ఉంది. తను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్. నిఖిల్ కళావర్ కింగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. సో ఒక తెలిసిన ఆర్టిస్ట్ ని పెట్టుకుంటే వాళ్ళ డేట్స్ అన్ని చూసుకుంటూ ఉండాలి. 40 డేస్ షూట్ కొత్త వాళ్ళు వెళ్దాం అని ఫిక్స్ అయ్యాం. సత్య తను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. సత్య చేస్తావా అని అడిగాను. ఇమ్మీడియేట్ గా సత్య చేస్తా అన్నాడు. సత్య ఫన్ కానీ కామెడీ టైమింగ్ హిలేరియస్ వర్కౌట్ అయ్యింది.

Ravi Krishna : 7G బృందావన్ కాలనీ తెర వెనుక విశేషాలు… యాక్టర్ సూర్య గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరో రవి కృష్ణ..?

Hello Friends, My Name is Surya, I Am The Writer And Founder Of This Blog And Share All The Information Related To Entertainment Through This Website.

Sharing Is Caring:

Leave a Comment