Srinu Vaitla : వెంకీ సినిమా తెర వెనుక విశేషాలు.. పలు ఆసక్తికర విషయాలు దర్శకుడు శ్రీను వైట్ల మాటల్లో..? : దర్శకుడు శ్రీను వైట్ల వెంకీ సినిమా తెర వెనుక విశేషాలు మరియు సినిమాకు సంబందించిన పలు ఆసక్తికర విషయాల్ని పంచుకోవడం జరిగింది. ఆ విశేషాలు ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం…
Srinu Vaitla : వెంకీ సినిమా తెర వెనుక విశేషాలు.. పలు ఆసక్తికర విషయాలు దర్శకుడు శ్రీను వైట్ల మాటల్లో..?
దర్శకుడు శ్రీను వైట్ల ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో వెంకీ సినిమా తెర వెనుక విశేషాలు మరియు పలు ఆసక్తికర విషయాల్ని పంచుకోవడం జరిగింది. వెంకీ సినిమా ఐడియా ఎలా స్టార్ట్ అయ్యింది. ప్రొడ్యూసర్ పూర్ణ చంద్రరావు గారిని ఎలా అప్రోచ్ అయ్యారు. రవితేజ గారు ఎలా వచ్చారు అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు శ్రీను వైట్ల…
యాక్టువల్ గా నేను రవితేజ సినిమా చేద్దాం అనుకున్నాం. ఎలాంటి కథ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక కథ రవితేజకి చెప్పాను. ఆరంభం అనే కథ రవితేజకు బాగా నచ్చింది. రవితేజ పక్కవాళ్ళు ఎవరో తనకు ఈ కథ కరెక్ట్ కాదని చెప్పారు. నేను మాత్రం బాగుంటుంది అన్నాను. హిలేరియస్ గా ఉండే ఫిల్మ్ చేద్దాం మన కాంబినేషన్ లో మన ఫస్ట్ సినిమా నీకోసంలో నువ్వు కామెడీ పెట్టలేదు. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ స్క్రిప్ట్ చెప్పు అని రవితేజ అన్నారు.
అలా ఒక లైన్ చెప్పాను రవితేజకు, రవితేజ అదిరిపోయింది అబ్బాయి మనం చేద్దాం అని అన్నారు. ప్రొడ్యూసర్ ఎవరు అని అనుకుంటున్నప్పుడు అట్లూరి పూర్ణ చంద్రరావు గారు ఊటీలో ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయ్యారు. ఊటీ నుంచి హైదరాబాద్ వచ్చారు. సినిమా చేయాలని ఆయన రవితేజను అప్రోచ్ అయ్యారు. రవితేజకు అమితాబ్ బచ్చన్ గారంటే చాలా ఇష్టం కదా. పూర్ణ చంద్రరావు గారు అమితాబ్ బచ్చన్ తో సినిమా చేశారు. ఇంకా రవితేజ చేసేద్దాం అబ్బాయి అన్నారు. అలా ప్రొడ్యూసర్ కూడా సెట్ అయ్యారు.
నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి తీసుకున్నదే ట్రైన్ ఎపిసోడ్
వెంకీ సినిమా నవంబర్ ఫస్ట్ వైజాగ్ లో టెంపుల్ లో స్టార్ట్ చేశాం. ఒక ఐడియా ఫార్మ్ అయ్యింది వన్ హవర్ నరేషన్ ఇచ్చారు. ఆ వన్ హవర్లోనే ట్రైన్ ఎపిసోడ్ కూడా ఫార్మ్ అయ్యిందా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు శ్రీను వైట్ల… ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ట్రైన్ ఎపిసోడ్ అనేది ఉంది. యాక్టువల్లీ ట్రైన్ ఎపిసోడ్ కి పెద్ద స్టోరీ ఉంది. నాకు ట్రైన్ తో కనెక్షన్ ఎక్కువ. ఎందుకంటే ట్రైన్లో ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు చెన్నై నుంచి కాకినాడ ట్రైన్ లో వెళ్ళేవాడిని.
ట్రైన్ లో వెళ్తున్నప్పుడు రకరకాల ఎక్స్పీరియన్స్ లు రిజర్వేషన్ భోగిలో టికెట్ లేకుండా ఎక్కటం టీసీని రిక్వెస్ట్ చేస్తాం ఆయన ఎక్కడో ఒక చోట కూర్చోమంటారు. ఇట్లాంటి చాలా ఎక్స్పీరియన్సెస్ నాకు ఉన్నాయి. పర్టికులర్ గా చెన్నై నుంచి నేను కొంతమంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ వస్తున్నప్పుడు ఒక చిన్న అల్లరి జరిగింది. ఒక చిన్న గొడవ కూడా జరిగింది. అది నా మైండ్ లో ఉండిపోయింది. అందుకనే ఆ ట్రైన్ ఎపిసోడ్ రియల్ గా నేచురల్ గా ఉండటానికి కారణం నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్.
ముందుగా అసిన్ అనుకున్నాం ఆమె డేట్స్ కుదరలేదు తర్వాత స్నేహను తీసుకున్నాం
ఈ సినిమాకు స్నేహ కంటే ముందు అసిన్ గారిని అనుకున్నారంటా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు శ్రీను వైట్ల… అసిన్ గారిని డేట్స్ అవి కుదరలేదు అలా స్నేహాను తీసుకున్నాం. అంతకుముందు స్నేహ ప్రియమైన నీకు సినిమా చేశారు. ఆ సినిమాలో సాఫ్ట్ రోల్ చేశారు. మన సినిమాలో కూడా సాఫ్ట్ రోల్ కానీ మాస్ సాంగ్స్ చేయించాం అంతే.
ఈ సినిమాలో కాస్టింగ్ ఎలా సెలెక్ట్ చేశారు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఏ వేరే ఎవ్వరిని ఊహించుకోలేం. అందరూ పర్ఫెక్ట్ గా యాప్ట్ అనిపించారు అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు శ్రీను వైట్ల… అశుతోష్ రానా క్యారెక్టర్ నా ఛాయిస్ ఏ ప్రొడ్యూసర్ పూర్ణ చంద్రరావు గారు వేరే యాక్టర్ ని చెప్పారు. అప్పటికి అశుతోష్ రానా పీక్ లో ఉన్న యాక్టర్. ఆయన దుష్మన్ అనే సినిమా నేను చూశాను. అప్పటి నుంచి ఆయనతో సినిమా చేయాలి అని అనుకున్నాను. అలా అశుతోష్ రానాను తీసుకోవటం జరిగింది.
ఈ సినిమాలోని క్యారెక్టర్స్ కి పేర్లు ఎలా పెట్టారని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు శ్రీను వైట్ల… స్కిప్ట్ సిట్టింగ్స్ లో కూర్చున్నప్పుడు ఈ క్యారెక్టర్ కి ఒక టిపికల్ నేమ్ ఉండాలి. అలా సిట్టింగ్స్ లో కూర్చున్నపుడు రైటర్ ఒక పేరు చెప్తాడు నేను ఒక పేరు చెప్తాను. అలా ఏది బాగుంటే అది తీసేసుకొని పెట్టేస్తాం. అందరి పేర్లు విచిత్రంగా ఉండాలి అనే అనుకున్నాం. నాకు డైరెక్టర్ పెద్ద వంశీ గారంటే ఇష్టం. ఆయన సినిమాల్లో కూడా పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి. ఆయనే నాకు ఇన్స్పిరేషన్. అలా పాత్రలకు పేర్లు పెట్టడం జరిగింది.
వెంకీ సినిమా రైటర్స్ గోపిమోహన్ కోన వెంకట్ మీ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు శ్రీను వైట్ల… కథ చెప్పేసిన తర్వాత తక్కువ టైం ఉంది. ఇమ్మీడియేట్ గా సినిమా స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు గోపిమోహన్ నన్ను ఎప్పటి నుంచో కలుస్తూ ఉన్నాడు. అంతకుముందు నేను గోపిమోహన్ ఒక స్క్రిప్ట్ అనుకున్నాం. అలా గోపిమోహన్ వచ్చాడు. కోన వెంకట్ ని రవితేజ గారే రెఫర్ చేశారు. కోన వెంకట్ కి కథ చెప్తే బాగా నచ్చింది. అలా కోన వెంకట్ వచ్చాడు. ముగ్గురిది మంచి ట్రావెల్ మాది. మా ముగ్గురికి సింక్ కూడా బాగా కుదిరింది.
రవితేజ గారి విషయానికి వస్తే, వెంకీ సినిమా రవితేజ గారికి మాస్టర్ పీస్ ఆయన క్యారక్టరేజషన్ కానీ ఎనర్జీ కానీ పర్ఫెక్ట్ వాడుకున్న సినిమా వెంకీ అనే క్యారక్టరేజషన్ ఎలా ఫార్మ్ అయ్యింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు శ్రీను వైట్ల… రవితేజ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. రవితేజ ఇన్ అండ్ అవుట్ నాకు తెలుసు తను ఎలా బిహేవ్ చేస్తాడు అందరిని ఎలా ఇమ్మిటెట్ చేస్తాడు. ఆయన్ని నాకు బాగా తెలుసు కాబట్టి మా ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉంది.
దేవి శ్రీ ప్రసాద్ లో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే సింగల్ టోన్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడం ఒక పద్దతి. మన సినిమాలో కొంచెం వేరియేషన్ రిథమ్ ఉంటుంది. దాన్ని రీ-రికార్డింగ్ చేయడం చాలా కష్టం. దేవి శ్రీ ప్రసాద్ ఫెంటాస్టిక్ గా చేసేవాడు. భయ్యా మీ సినిమాకు స్క్రీన్ ప్లే ఎలా అయితే ఉంటుందో మ్యూజిక్ ప్లే కూడా ఉండాలి అని దేవి శ్రీ ప్రసాద్ అనేవాడు. దేవి శ్రీ ప్రసాద్ నేను అప్పటికే ఆనందం సొంతం సినిమాలు చేశాం. ఈ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ సాంగ్స్ చేయాలి అనుకున్నాం. అన్ని పాటలు కూడా సాహితి గారే రాశారు. అని దర్శకుడు శ్రీను వైట్ల తెలిపారు.
ట్రైన్ ఎపిసోడ్ మీరు డిజైన్ చేసినప్పుడు ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తారని మీరు ఊహించారా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు శ్రీను వైట్ల… నిజంగా చెప్పాలంటే ఎవ్వరు ఊహించలేదు. ఇన్ని సంవత్సరాలు గుర్తు ఉంటుంది అని తెలీదు. కాకపోతే చాలామంది వ్యతిరేకించారు. ఈవెన్ ప్రొడ్యూసర్ గారు కూడా ట్రైన్ లో అంత సేపు ఏంటి అండి అని చాలామందికి ఆ డౌట్ ఉంది. కానీ నేను బలంగా నమ్మాను. ఆ ట్రైన్ ఎపిసోడ్ అంతా ఛాలెంజింగ్ గా తీసుకోని చేశాం. థియేటర్ లో అప్పట్లోనే ప్రేక్షకులు పగలపడి నవ్వటం చూశాం.