Srikanth : పెళ్లి సందడి సినిమా తెర వెనుక విశేషాలు.. ఎవ్వరికి తెలియని నిజాలు.. హీరో శ్రీకాంత్ మాటల్లో..? : హీరో శ్రీకాంత్ పెళ్లి సందడి సినిమా తెర వెనుక విశేషాలు మరియు ఆ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకోవడం జరిగింది.
Srikanth : పెళ్లి సందడి సినిమా తెర వెనుక విశేషాలు.. ఎవ్వరికి తెలియని నిజాలు.. హీరో శ్రీకాంత్ మాటల్లో..?
హీరో శ్రీకాంత్ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో పెళ్లి సందడి సినిమా తెర వెనుక విశేషాలు మరియు పలు ఆసక్తికర విషయాల్ని పంచుకోవడం జరిగింది. రాఘవేంద్ర రావు గారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఆయన అప్పటికే పెద్ద పెద్ద సినిమాలు చేసి ఉన్నారు. మీరు ఇంకా అప్పటికి చిన్న హీరోనే అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా శ్రీకాంత్…
యాక్టువల్ గా దానికంటే ముందు ఆమె తాజ్ మహల్ ఫిలిమ్స్ చేయడం. రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి. కరెక్ట్ గా తాజ్ మహల్ చేసే టైంలోనే రాఘవేంద్ర రావు గారు రామా నాయుడు గారిని అడగటం. రామా నాయుడు గారు శ్రీకాంత్ మంచి కుర్రాడు బాగా చేస్తున్నాడు అని చెప్పడం. అప్పటికి ఇంకా తాజ్ మహల్ సినిమా విడుదల కాలేదు. తాజ్ మహల్ రిలీజ్ కాకముందే నన్ను పిలిపించి ఇలా పెళ్లి సందడి అనే ఒక సినిమా చేస్తున్నాం అందులో నిన్ను హీరోగా అనుకుంటున్నాం అని రాఘవేంద్ర రావు గారు అన్నారు. నేను చాలా హ్యాపీ.
ఎందుకంటే ఆయన రాఘవేంద్ర రావు గారు నేను జస్ట్ అప్ కమింగ్ హీరోని కొన్ని సినిమాలు చేశాను. అప్పుడే హీరోగా అప్ కమింగ్ నేను. ఆ టైంలో నాకు మంచి పెళ్లి సందడి లాంటి అవకాశం రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఏ హీరో అయిన సరే తన కెరీర్ బిగినింగ్ లో పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర పని చేయాలి అనుకుంటారు. మంచి మంచి సినిమాలు చేయాలని కోరిక ఉంటాది. రాఘవేంద్ర రావు గారు ఒక లెజెండ్. అప్పటికే ఆయన పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. ఈ సినిమా అవకాశం నాకు తెలియకుండానే జరిగిపోయింది. నేను వెళ్లి అడిగింది కాదు వాళ్ళ అంతకు వాళ్లే వచ్చి అడిగారు.
రాఘవేంద్ర రావు గారు స్వప్న సుందరి కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా శ్రీకాంత్… ఫస్ట్ ఈ సబ్జెక్టు అసలు ఇలా ఉంటుంది ఒక ఐడియా చెప్పారు అంతే. పర్టికులర్ గా నాకు డీటైల్డ్ గా ఏం చెప్పలేదు. ఆయన నాకు ఒక పాయింట్ లాగే చెప్పారు. నాకు ఆ టైంలో అవన్నీ ఎక్కలేదు. ఎందుకంటే రాఘవేంద్ర రావు గారి దగ్గర చేయాలి అంతే ఉండేది. అలాగే చేసేశాను. ప్రొడ్యూసర్స్ గా అశ్విని దత్త్ గారు అల్లు అరవింద్ గారు జగదీష్ ప్రసాద్ గారు మరియు రాఘవేంద్ర రావు గారు కొత్త బ్యానర్ నాతోనే స్టార్ట్ అయ్యింది.
అలా సినిమా మొదలు అయ్యింది. ఒక కలలో కనిపించే తెలియని అమ్మాయి. అది కూడా గుర్తుగా నడుముకి తాళాలు గుత్తి మరియు పుట్టు మచ్చ. ఒకటే తెలుసు కలలో కనిపించింది అని, బట్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నాకు తెలీదు. ఎందుకంటే నాకు బిగినింగ్ డేస్ కాబట్టి అంతగా ఆలోచించలేదు. ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోయావాడిని. ఆడియన్స్ కి అది మంచి థ్రిల్లింగ్ పాయింట్ లా అనిపించింది. అప్పుడు పెళ్లి సందడి సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. ఒక కమర్షియల్ మూవీస్ వచ్చే టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఒక ప్లస్. ఈ టైపు అఫ్ ఫ్యామిలీ ఫిల్మ్ ఒక ట్రెండ్ సెట్టర్ లాగా నా కెరీర్ లో నిలిచిపోయింది.
కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పగానే అంతే కాకుండా ఈ సినిమాలో 9 పాటలు ఉన్నాయి అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సర్ అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా శ్రీకాంత్… సినిమాలో తొమ్మిది పాటలు పెట్టాలంటే చాలా డేర్ కావాలి. ఎందుకంటే పెళ్లి సందడి సినిమాలో అలా కుదిరింది అని చెప్పుకోవాలి. సిట్యుయేషన్స్ తగ్గట్టు పాటలు ఉంటాయి. అలాగే కీరవాణి గారు మరియు చంద్ర బోస్ గారు ఇలాంటి సెటప్ మళ్ళీ మళ్ళీ రావడం కష్టం.
పెళ్లి సందడి సినిమాకు కొరియోగ్రాఫర్ గా రాఘవేంద్ర రావు
పెళ్లి సందడి సినిమాకు కొరియోగ్రాఫర్ ఏ లేడు. అన్ని పాటలకి రాఘవేంద్ర రావు గారే కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాకు కీరవాణి గారు చంద్ర బోస్ గారు ఎంత ప్లస్ ఓ రాఘవేంద్ర రావు గారు అంత ప్లస్. ఆయనకు కొరియోగ్రాఫర్ గా నంది అవార్డు కూడా వచ్చింది. నేను మొదట్లో బాగా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే డాన్స్ మాస్టర్ లేకుండా డాన్స్ చేయటం అనేది చాలా కష్టం. ఆయన ఎలా చెప్తే అలా చేసుకుంటూ వెళ్ళాం. రాఘవేంద్ర రావు గారి సినిమాల్లో పాటలు అంటేనే స్పెషల్ గా ఉంటాయి. ఆయన స్టైల్ ఏ వేరు. ఆయన్ని చూసి ఇలా చేయాలి అని యంగ్ డైరెక్టర్స్ కూడా ఆయనతో పోటీ పడుతుంటారు. ఆయన్ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు.
హీరోలు అందరికి రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్ లో సినిమా చేయాలి అని అనుకుంటారు. చెమ్మ చెక్క పాటలో మంచి మ్యూజిక్ ఉంటుంది. డాన్స్ ఎలా చేయాలి అనిపించింది. అప్పుడు రాఘవేంద్ర రావు గారు నన్ను దీప్తి భట్నాగర్ ని పిలిచి ఈ మ్యూజిక్ కి మీరిద్దరూ డాన్స్ ఎలా చేస్తారు అని అడిగారు. ఆ మ్యూజిక్ తగ్గట్టు రెండు మూడు వెరైటీలు చేసి చూపించేవాళ్ళం. అవి ఆయన చూసి ఇది పెట్టేస్తే బాగుంటుంది అనేవారు.
అలా నాకు టెన్షన్ ఎందుకు అంటే మూమెంట్స్ మేమే చేయాలి అప్పుడు కొంచెం టెన్షన్ గానే ఉండేది. అలా ఆ పాట ఊటీలో షూట్ చేశాం. డాన్సర్స్ ని బెంగుళూరు నుంచి తెప్పించారు. కొంతమంది లోకల్ వాళ్ళని తెప్పించారు. బట్ అన్నిటిని మేనేజ్ చేసి ఆయన అక్కడే కూర్చొని కంపోజ్ చేసేవారు. అలాంటి పాటని వితౌట్ డాన్స్ మాస్టర్ చేయటం చాలా కష్టం. అటువంటిది ఆయన హేండిల్ చేశారు. అందుకే రాఘవేంద్ర రావు గారికి నంది అవార్డు దక్కింది.
ఈ సినిమా ఓపెనింగ్ కి నాగార్జున గారు అమీర్ ఖాన్ గారు అజయ్ దేవగన్ గారు జుహీ చావ్లా గారు అలా చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా శ్రీకాంత్… పెళ్లి సందడి సినిమా ఓపెనింగ్ వేడుక రామానాయుడు స్టూడియోలో జరిగింది. అశ్విని దత్త్ గారు అల్లు అరవింద్ గారు రాఘవేంద్ర రావు గారు కలిసి ఒక చక్కటి చిన్న బ్యానర్ పెట్టారు. లాభాలు వస్తాయో లేదో తెలీదు. ఒక డేర్ చేసి సినిమా చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అయ్యి కూర్చుంది. సినిమా ఓపెనింగ్ కి సెలబ్రిటీస్ అందరు రావడం. అప్పుడే వస్తున్న అప్ కమింగ్ హీరోని నేను చాలా బూస్టప్ వచ్చింది.
పెళ్లి సందడి సినిమా మొత్తం ఫన్ ఏ, సినిమా షూటింగ్ అంత సరదా సరదాగా గోల గోలగా గడిచిపోయింది. రాఘవేంద్ర రావు గారు మమ్మల్ని అందరిని కుప్ప అనేవారు. ఏ కుప్ప మీరందరు రండి అనేవారు. అంటే ఎవరెవరు అంటే బ్రహ్మానందం గారు, తనికెళ్ళ భరణి గారు మరియు శివాజీ రాజా వీళ్లంతా ఒక గ్యాంగ్ లాగ సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం అంతే. ఊటీలో కొన్ని పాటలు మరియు దీప్తి భట్నాగర్ కొన్ని సీన్స్ ని షూట్ చేశాం. తణుకులో షూట్ చేశాం. బెంగళూర్ లో కొంత భాగం షూట్ చేశాం. అప్పుడు ఫ్లైట్స్ కూడా లేవు. ఎక్కడికి వెళ్ళాలి అన్న ట్రైన్ లో వెళ్ళేవాళ్ళం. ట్రైన్ లో భోగి మొత్తం మేమే ఉండేవాళ్ళం. సినిమా షూటింగ్ మొత్తం పిక్నిక్ లా ఉండేది.
పెళ్లి సందడి సినిమా ఇండస్ట్రీలో నన్ను హీరోగా నిలబెట్టింది
పెళ్లి సందడి సినిమా శ్రీకాంత్ కెరీర్ లో ఒక మైలురాయి అని చెప్పుకోవాలి. బట్ ఆ సినిమా ఏంటి అంటే ఒక ఫ్యామిలీ సినిమా. ఆ సినిమా నా కెరీర్ కి భయంకరమైన ప్లస్ అయ్యింది. దాని తర్వాత నేను సినిమా ఇండస్ట్రీలో నిలబడిపోయాను. సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలబడిపోవడానికి పెళ్లి సందడి సినిమానే కారణం అని చెప్పుకోవాలి. ఆ సినిమా ప్రాసెస్ అంతా చాలా ఎంజాయ్ చేస్తూ నేను చేశాను.
Sudheer Varma : స్వామి రారా సినిమా తెర వెనుక విశేషాలు.. డైరెక్టర్ సుధీర్ వర్మ మాటల్లో..?