Ram Charan : రామ్ చరణ్ చేసే డాన్స్ స్టైల్ నాకు రాదు అంటున్న స్టార్ హీరో ఎవరు..? : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డాన్స్ అద్భుతంగా చేస్తాడు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ రామ్ చరణ్ లాగా డాన్స్ చేయలేను. ప్లస్ రామ్ చరణ్ డాన్స్ లో స్టైల్ ఉంటుంది. అలా డాన్స్ చేయటం నాకు రాదు అంటున్న స్టార్ హీరో. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అయ్యింటారు. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.
Ram Charan : రామ్ చరణ్ చేసే డాన్స్ స్టైల్ నాకు రాదు అంటున్న స్టార్ హీరో ఎవరు..?
రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఎవడు. ఎవడు సినిమా సంక్రాతి కానుకగా జనవరి 12 2014 న విడుదల అయ్యింది. ఎవడు సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటించాడు. అతనెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఎవడు సినిమా టైంలో అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ ఇంటరాక్షన్ ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకోవడం జరిగింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ… అందరూ డాన్స్ కంపేర్ చేస్తారు. చిరంజీవి గారు చేస్తారు. నేను చేస్తాను. డాన్స్ రామ్ చరణ్ చేస్తాడా అంటే ఇదివరకు ఎప్పుడు రామ్ చరణ్ డాన్స్ చేయలేదు. ఒకరోజు మా కజిన్ సంగీత్ జరిగింది. రామ్ చరణ్ డాన్స్ చేయాలి. నాకేమో మిలియన్ డాలర్ క్వశ్చన్ చేస్తాడా లేదా అని, రామ్ చరణ్ డాన్స్ చింపేశాడు. నేను మా నాన్న చరణ్ పాస్ అయిపోయాడు అనుకున్నాం. నాయక్ సినిమాలో లైలా ఓ లైలా సాంగ్ చూసినప్పుడు చిరంజీవి గారి అబ్బాయి ఓకే అని అనుకున్నాను.
డాన్స్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. రామ్ చరణ్ గారిని అడిగితే బన్నీ బాగా చేస్తాడు అని చెప్తారు. బన్నీని అడిగితే రామ్ చరణ్ బాగా చేస్తాడు అని చెప్తారు. అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ… నేను నిజం చెప్తాను. ఎవరికీ వాళ్ళకి యూనిక్యూ స్టైల్ ఉన్నాయి. నాకు పర్టికులర్ గా చరణ్ చేసే స్టైల్ నాకు రాదు. నేను ఇవాళ పొద్దున కొరియోగ్రాఫర్ కి చెప్పాను. మూమెంట్స్ షార్ప్ గా కట్ చేయాలి మాస్టర్, చరణ్ చాలా బాగా చేస్తాడు. రామ్ చరణ్ డాన్స్ చేసేటప్పుడు పేస్ అందంగా పెడతాడు. నాకు అది రాదు ఖంగారుగా మూమెంట్ చేసేస్తాను. చరణ్ దగ్గర అది నేర్చుకోవాలి మాస్టర్ అని చెప్తున్నాను.
రామ్ చరణ్ అప్ కమింగ్ చిత్రం గేమ్ ఛేంజర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన అప్ కమింగ్ చిత్రం గేమ్ ఛేంజర్. గేమ్ ఛేంజర్ సినిమాలో కథానాయికగా కియారా అద్వానీ నటిస్తుంది. తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా శంకర్ కు తెలుగు డెబ్యూ ఫిల్మ్ కావడం విశేషం. అంతేకాకుండా ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడక్షన్ లో 50 వ సినిమా స్పెషల్ ఫిలిం. ఈ సినిమాను యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ ఫిలిం గా తెరకెక్కించారు. ఈ సినిమా చాలా కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఒకానొక టైంలో ఈ సినిమా విడుదల అవుతుందా అనే సందేహాలు కూడా వచ్చాయి. ఎట్టకేలకు సినిమా విడుదల తేదిని ప్రకటించారు. గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 2025 కు విడుదల కానుంది. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ చాలా రోజులు నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ డేట్ అధికారిక ప్రకటన వచ్చేసరికి ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్.