Ram Charan : మగధీర తర్వాత రామ్ చరణ్ లవ్ స్టోరీనే కావాలని అడిగారని దర్శకుడు భాస్కర్ అన్నారు..!

Ram Charan : మగధీర తర్వాత రామ్ చరణ్ లవ్ స్టోరీనే కావాలని అడిగారని దర్శకుడు భాస్కర్ అన్నారు..! : రామ్ చరణ్ లవ్ స్టోరీనే కావాలని అడిగారని అందుకే ఆరెంజ్ సినిమా కథను తయారు చేసి వినిపించాను అని దర్శకుడు భాస్కర్ తెలిపారు.

Ram Charan : మగధీర తర్వాత రామ్ చరణ్ లవ్ స్టోరీనే కావాలని అడిగారని దర్శకుడు భాస్కర్ అన్నారు..!

Ram Charan : మగధీర తర్వాత రామ్ చరణ్ లవ్ స్టోరీనే కావాలని అడిగారని దర్శకుడు భాస్కర్ అన్నారు..!

ఆరెంజ్ సినిమా రీ-రీలీజ్ తర్వాత దర్శకుడు భాస్కర్ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఆరెంజ్ సినిమా గురించి దర్శకుడు భాస్కర్ ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.

ఆ ఇంటర్వ్యూలో ఆరెంజ్ సినిమా మేకింగ్ విశేషాల్ని యాంకర్ దర్శకుడు భాస్కర్ ని అడుగుతారు. మొదటగా యాంకర్ అడిగిన ప్రశ్న ఆరెంజ్ సినిమా ఎలా మొదలు అయ్యింది అని అడుగుతారు.

దానికి సమాధానంగా దర్శకుడు భాస్కర్… మగధీర తర్వాత రామ్ చరణ్ లవ్ స్టోరీనే చేయాలి అనుకుంటున్నానని చెప్పారని, అంతే కాకుండా లవ్ స్టోరీ చేద్దాం అనుకుంటున్నాం అబ్రాడ్ లోనే తీయాలి అనుకుంటున్నాం అనే రిక్విర్మెంట్ రామ్ చరణ్ ముందే చెప్పారని దర్శకుడు భాస్కర్ తెలిపారు.

ముందుగా నా దగ్గర ఎటువంటి కథ లేదు. కథ రాసేందుకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. ఒక మంచి విషయం చెప్పాలి అలాగే ఎంటర్టైనింగ్ చెప్పాలి అనుకున్నాను. ఏ ఐడియా లేకుండా లవ్ స్టోరీనే రాద్దామని కూర్చొని రాసిన కథే ఆరెంజ్ సినిమా. అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ కలర్ ఫుల్ గ ఉండాలని చెప్పారు.

ఆరెంజ్ సినిమా లో రామ్ చరణ్ క్యారెక్టర్ ని దర్శకుడు భాస్కర్ అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ సినిమా లో రామ్ చరణ్ పాత్ర ప్రేమించే కాలం ఎక్కువ అయ్యే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది అనే రియాలిటీ లో బ్రతుకుతుంటాడు. ఎందుకంటే రామ్ పాత్ర గతంలో జరిగిన అనుభవాలు వల్ల అతని పాత్ర నిజాయితీగా ఉండాలి అనుకుంటాడు.

ఆరెంజ్ సినిమా లో జెనీలియా పాత్ర సింపుల్ థాట్ ప్రాసెస్ ఉన్న అమ్మాయి. ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా అని ముందుగానే అనుకున్నాం అని దర్శకుడు భాస్కర్ తెలిపారు. ప్రకాష్ రాజ్ కి ఎప్పుడు ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇవ్వాలి అనుకుంటాను. కానీ ఈ సినిమాలో ఆయనకు తగ్గ క్యారెక్టర్ లేదని చెప్పాను ఆయన వినలేదు ఒక్క సీన్ అయిన నీ సినిమాలో నేను చేయాలి అని ప్రకాష్ రాజ్ చెప్పడంతో అయన క్యారెక్టర్ ని డిజైన్ చేశాను అని భాస్కర్ అన్నారు.

ఆరెంజ్ సినిమాలో అవసరాల శ్రీనివాస్ మరియు సిద్దు జొన్నలగడ్డ మరియు ఇతర క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను ఆడిషన్ చేసి తీసుకున్నాం అని భాస్కర్ తెలిపారు. ఈ సినిమాలో మరి ముఖ్యంగా బ్రహ్మానందం క్యారెక్టర్ అనే చెప్పాలి. ఎందుకంటే బ్రహ్మానందం క్యారెక్టర్ మన క్యారెక్టర్ లాగా మన అంటే ఆడియన్స్ లాగా ప్రేమ కథలు అంటే చాలా ఇష్టం మరియు చాలా ఎక్సైట్ అయ్యే పాత్ర బ్రహ్మానందం క్యారెక్టర్ అని దర్శకుడు భాస్కర్ అన్నారు.

అబ్రాడ్ లో ఒక లవ్ స్టోరీ చేయాలి అనుకుంటున్నాం అని రామ్ చరణ్ అప్రోచ్ అయ్యారని అంతే కాకుండా ఈ సినిమాను అంజన ప్రొడక్షన్స్ బ్యానర్ లో నాగబాబు నిర్మిస్తున్నారని ముందుగానే డిసైడ్ అయ్యారని భాస్కర్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవికి కూడా కథ వినిపించడం జరిగింది. కథ చాలా ఫ్రెష్ గా ఉంది నాకు ఈ కథ మీద నమ్మకం ఉంది అని చిరంజీవి అన్నారని భాస్కర్ తెలిపారు.

Ram Charan : మగధీర తర్వాత రామ్ చరణ్ లవ్ స్టోరీనే కావాలని అడిగారని దర్శకుడు భాస్కర్ అన్నారు..!
Image Source : Twitter / Aesthetics of Telugu Cinema

ఆరెంజ్ సినిమాను ముందుగా న్యూయార్క్ లో షూట్ చేయాలి అనుకున్నాం కానీ అప్పుడు అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది తీయడానికి కష్టం అవుతుంది అని ఆస్ట్రేలియాలోని సిడ్నీ మరియు మెల్బోర్న్ సిటీల్లో సినిమా షూటింగ్ చేశాం అని దర్శకుడు భాస్కర్ అన్నారు.

ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గ్రాఫిటీ. గ్రాఫిటీ అంటే ఒక స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెస్ చేయడం అది ఎలా అంటే పెయింటింగ్ రూపంలో తెలియచేస్తారు.

ఆరెంజ్ టైటిల్ ఎలా వచ్చింది అని యాంకర్ ఒక ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు భాస్కర్… లవ్ అనేది మొదట్లో బాగానే ఉంటుంది ఒక స్టేజి వచ్చేసరికి ప్రాక్టికల్ గా తగ్గిపోతుంది. Sunrise అండ్ Sunset రెండింట్లో ఉన్న ఒక కలర్ ఆరెంజ్. డే అండ్ నైట్ మనం పేస్ చేయాల్సి వస్తుంది. సింగల్ వర్డ్ లో ఉన్న టైటిల్ పర్ఫెక్ట్ టైటిల్ అని అనుకున్నాం అని భాస్కర్ అన్నారు.

ఆరెంజ్ సినిమా బిగ్గెస్ట్ మ్యూజిక్ ఆల్బం. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ మ్యూజిక్ డైరెక్టర్ అని ముందుగానే డిసైడ్ అయ్యాం. ఎందుకంటే ఆరెంజ్ సినిమా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, లవ్ స్టోరీలో ముఖ్యంగా పాటలు మరియు నేపధ్య సంగీతం మెయిన్ అంతే కాకుండా హారిస్ జయరాజ్ కథ విన్నాక ఈ సినిమాలో ఐదు పాటలు బ్లాక్ బస్టర్ అని ముందే చెప్పారని భాస్కర్ అన్నారు.

ఆరెంజ్ సినిమాలో పాటలను రామజోగయ్య శాస్త్రి, వనమాలి మరియు సురేందర్ కృష్ణ రాశారు. ఈ సినిమాలో రాజు సుందరం, శోభి మరియు బోస్కో మాస్టర్లు కోరియోగ్రఫీ చేశారు.

ఆరెంజ్ సినిమా 26 నవంబర్ 2010 న విడుదల అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల్ని నిరాశ పరిచింది అంతే కాకుండా క్రిటిక్స్ నుంచి నెగటివ్ రివ్యూస్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ప్లాప్ టాక్ గా నిలిచింది.

ఆరెంజ్ సినిమా రీ-రిలీజ్…

ఆరెంజ్ సినిమా రీ-రిలీజ్ మార్చ్ 25 2023 లో విడుదల చేశారు. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. రీ-రిలీజ్ కి మంచి రెస్పాన్స్ అందుకుంది. అంతేకాకుండా ప్రేక్షకులు సినిమాను చాలా బాగా ఎంజాయ్ చేశారు.

మగధీర తర్వాత వచ్చిన సినిమా ఆరెంజ్ అందుకే ప్లాప్ అయ్యింది. ఎందుకంటే మగధీర లాంటి పెద్ద మాస్ సినిమా తర్వాత ఆరెంజ్ సినిమాను ప్రేక్షకులు తీసుకోలేకపోయారు. ఇందులో మా తప్పే ఉంది ముందే ఆడియన్స్ కి చెప్పాల్సింది. మా సినిమా ఫ్రెష్ లవ్ స్టోరీ, ఫ్రెష్ విజువల్స్ ఫ్రెష్ మ్యూజిక్ అని చెప్పి ఉండాల్సింది. చెప్పటానికి టైం సరిపోలేదు ముమ్మాటికి మాదే తప్పు ఆడియన్స్ ది కాదు అని డైరెక్టర్ భాస్కర్ తెలిపారు.

Ram Charan : మగధీర తర్వాత రామ్ చరణ్ లవ్ స్టోరీనే కావాలని అడిగారని దర్శకుడు భాస్కర్ అన్నారు..!
Image Source : Twitter / Aesthetics of Telugu Cinema

ఆరెంజ్ సినిమాలో కష్టమైన ఛాలెంజ్ రైటింగ్ మరియు డైరెక్షన్ అనే ప్రశ్న యాంకర్ అడుగుతారు. దానికి సమాధానంగా డైరెక్టర్ భాస్కర్… ఆరెంజ్ మొత్తం స్క్రిప్ట్ రాయటానికి కష్టమైనా టాస్క్ అని చెప్పాలి. షూటింగ్ ఎక్కడ కష్టం అనిపించలేదు.

ఆరెంజ్ సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే రియాలిటీలో చూసుకుంటే లైఫ్ హార్డ్ గానే ఉంటుంది. అందుకే అదే సరైన ఎండింగ్ సినిమాకు అని ఫీల్ అయ్యాం ఎందుకంటే నిజమైన విషయాన్నీ చెప్తున్నప్పుడు ద్రోహం చేయకూడదు. అనుకున్నది అనుకున్నట్టుగా నిజాయితీగా చెప్పాలి అనుకున్నాను అని దర్శకుడు భాస్కర్ తెలిపారు.

ఆరెంజ్ 2 ఎక్స్పెక్ట్ చేయచ్చా…

ఆరెంజ్ 2 మీ నుంచి Expect చేయచ్చా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా డైరెక్టర్ భాస్కర్… అలాంటి ఉద్దేశం అసలు లేదని, బలవంతంగా ఏదో తీయాలని తీయకూడదు కథ సహజంగా రావాలి అప్పుడే బాగుంటుంది. ఆరెంజ్ 2 అనే ఆలోచన అస్సలు లేదని దర్శకుడు భాస్కర్ తెలిపారు.

Uday Kiran : దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు…

Hello Friends, My Name is Surya, I Am The Writer And Founder Of This Blog And Share All The Information Related To Entertainment Through This Website.

Sharing Is Caring:

Leave a Comment