తెలుగు సెలబ్రిటీస్ పిలిస్తే ఎవ్వరు రారు.. చిన్న సినిమాలను సపోర్ట్ చేయరు అని ఆవేదన వ్యక్తం చేసిన రాకేష్..? : జితేందర్ రెడ్డి సినిమా మీడియా ప్రెస్ మీట్ నవంబర్ 6 2024 వ తేదీన బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో హీరో రాకేష్, డైరెక్టర్ విరించి వర్మ మరియు ప్రొడ్యూసర్స్ పాల్గొనడం జరిగింది.
తెలుగు సెలబ్రిటీస్ పిలిస్తే ఎవ్వరు రారు.. చిన్న సినిమాలను సపోర్ట్ చేయరు అని ఆవేదన వ్యక్తం చేసిన రాకేష్..?
జితేందర్ రెడ్డి సినిమా నవంబర్ 8 2024 వ తేదీన శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం మీడియా ప్రెస్ మీట్ మరియు క్యూ అండ్ ఏ ఇంటరాక్షన్ మీడియా వారితో నవంబర్ 6 వ తేదీన నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో హీరో రాకేష్, డైరెక్టర్ విరించి వర్మ మరియు ప్రొడ్యూసర్స్ పాల్గొనడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో హీరో రాకేష్ స్పీచ్ హైలైట్ అని చెప్పుకోవాలి. అది ఏంటో రాకేష్ మాటల్లోనే తెలుసుకుందాం.
హీరో రాకేష్ మాట్లాడుతూ… యాక్టర్ గా నేను నాలుగునర్ర సంవత్సరాల తర్వాత వస్తున్నా మీ ముందుకు అసలు ఏం షేర్ చేసుకోవాలి మీతో పాటు రాంగ్ లేకపోతే రైట్ అని మార్నింగ్ నుంచి ఆలోచిస్తున్న, నాకేం అనిపించింది అంటే మూవీ గురించి ఎలానో షేర్ చేసుకుంటాను. కానీ ఈ నాలుగునర్ర సంవత్సరాలలో నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ మీతో పాటు షేర్ చేసుకొని ట్రూత్ మాట్లాడుతాను చూద్దాం ఎటు సైడ్ వెళ్తుందో ఆ ట్రూత్ అది మాట్లాడితే బెటర్ అనిపించింది.
త్రి మిలియన్ డాలర్ క్వశ్చన్స్ ఏంటంటే ఒకటి నాలుగునర్ర సంవత్సరాల తర్వాత నేను ఎందుకు వస్తున్నాను. సెకండ్ మా సినిమాకు సెలెబ్రిటీల ఎవరెవరి సపోర్ట్ ఉంది ఎవరెవరు వస్తున్నారు. థర్డ్ ఏంటంటే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన జితేందర్ రెడ్డి సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి మే నుంచి జులై తర్వాత ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి. సో మూడింటి గురించి మాట్లాడితే బాగుంటుంది అని నాకు అనిపించింది.
నాలుగునర్ర సంవత్సరాల తర్వాత నేను ఎందుకు వస్తున్నాను. ఇంత టైం ఎందుకు పట్టింది. యాక్టువల్ గా ఫ్రాంక్ గా చెప్పాలంటే కాన్స్టాంట్ గా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. ఇంటికి కూడా మార్నింగ్ బయటికి వెళ్తే మళ్ళీ రాత్రికే ఇంటికి వెళ్ళేవాడిని. కావాలంటే మా అమ్మ కూడా ఇక్కడే ఉంది. ఆవిడే చెప్తారు. నాలుగునర్ర సంవత్సరాల గ్యాప్ లో నా రియలైజెషన్ ఏంటంటే ఒకటి ఎవ్వరికీ చెప్పొద్దు సినిమా తర్వాత ఏదో చిన్న కంటెంట్ చేయకూడదు. సాలిడ్ స్టాండర్డ్ కంటెంట్ చేయాలని అనిపించింది. అది ఎంత టైం అయినా పర్లేదు. ఎందుకంటే ఎవ్వరికీ చెప్పొద్దు మూవీకి నేనే ప్రొడ్యూసర్ ని, అందుకే ప్రొడ్యూసర్ అంటే ఏంటో నాకు బాగా తెలుసు. సినిమా కోసం ఎవరో ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు నష్టపోకూడదు అని నేను భావించాను. స్ట్రాంగ్ స్టాండర్డ్ ఆడే కంటెంట్ సినిమా చేయాలనీ నేను ఫిక్స్ అయ్యాను.
నేనేం బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాను. ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పట్టింది. నాలాంటోళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా అని కొత్తవాళ్లను ఎంకరేజ్ చేద్దామని అలా చేసిన ప్రాజెక్ట్ పేకమేడలు. పేకమేడలు ప్రాజెక్ట్ చేసిన తర్వాత నాకు ఏం అర్థం అయ్యింది అంటే ఆ ప్రాజెక్ట్ నేను చేయకుండా ఉండాల్సింది. అది నేను చేసిన రాంగ్ స్టెప్. నేను ఏం అనుకున్నాను అంటే ఎవ్వరికీ చెప్పొద్దు సినిమా తర్వాత నాకు ఒక సక్సెస్ వచ్చింది. నాకు ఒక ఫార్ములా తెలుసు నేను సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోవచ్చు అనిపించింది. కానీ నాకు అప్పుడు అర్థం అయ్యింది ఏంటంటే మార్కెట్ ఇంపార్టెంట్. మార్కెట్ బ్రాండ్ లేకపోతే ఏ హీరోను పట్టించుకోరు.
పేకమేడలు సినిమా మూడు సంవత్సరాలు పట్టింది. మూడు సంవత్సరాలు సినిమా చేస్తూనే ఉన్నాం. అదే ఇంకెవరైనా ప్రొడ్యూసర్ లేకపోతే బ్రాండ్ ఉండింటే ఒక సంవత్సరంలో సినిమా బయటికి వచ్చేది. నా రిగ్రెట్ ఏంటంటే నేను ఒక రాకేష్ వర్రే బ్రాండ్ అయినా తర్వాతే కొత్త వాళ్ళతో చేస్తా. తప్పకుండ చేస్తాను ఎందుకంటే నేను కొత్తవాడినే కాబట్టి బాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను కాబట్టి ఎంకరేజ్ చేస్తాను. కానీ ఇప్పుడు నేను చేయను. ఎందుకంటే పేకమేడలు సినిమా నాకు ఒక లెసన్. నాకు ఆ సినిమా వల్ల ఒకటినర్ర సంవత్సరం టైం వేస్ట్ అయ్యింది. నాకే కాదు నా టీం మొత్తానికి కూడా టైం వేస్ట్ అయ్యింది. నేను నిలబడిన తర్వాత వేరే వాళ్ళను నిలబెడతాను.
చిన్న సినిమాలను సపోర్ట్ చేయటానికి ఏ సెలబ్రిటీ రారు
ఇండస్ట్రీలో కింద మీద పడుతూ వచ్చిన నాలాంటోళ్ళకి, సెలబ్రిటీస్ ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎందుకు వస్తారు. సెలబ్రిటీస్ ఆబ్లిగేషన్స్ మీద వస్తారు. లేకపోతే ఏదైనా ఫ్రెండ్షిప్ మీద వస్తారు. మైండ్ సెట్ ఎలా అయిపొయింది అంటే ఒక సెలబ్రిటీ ఉంటేనే ఈవెంట్ అవుద్ది. ఒక సెలబ్రిటీ ఉంటేనే జనాల్లోకి వెళ్తాది. ఎవ్వరికీ చెప్పొద్దు కి స్టేజి అంతసెలబ్రిటీస్ అందరు ఉండేవారు. కానీ నా రియలైజెషన్ ఏంటంటే సెలబ్రిటీస్ ఓన్లీ సపోర్ట్ చేస్తారు. సినిమాను ఏమి జనాల వరకు తీసుకెళ్లరు. మార్కెట్ మీద కూర్చోండి. మీ ఫిల్మ్ ని ఎలా మార్కెట్ చేసుకోవాలో చూసుకోండి.
నిజంగా ఒక సెలబ్రిటీ తేవాలంటే ఒక సినిమా చేసేయచ్చు. సెలబ్రిటీస్ పిలిస్తే ఏం రారు. వాళ్లకి ఇష్టమైతేనే సినిమాను ప్రమోట్ చేయటానికి వస్తారు. సెలెబ్రిటీస్ ఎందుకు తీసుకురాలేదని మీరు అడుగుతూనే ఉన్నారు. నేను ట్రై చేస్తూనే ఉన్నాను. పొద్దున్న నుంచి నేను మెస్సేజ్ లు చేస్తూనే ఉన్నాను. ఈ ఈవెంట్ తర్వాత కూడా మళ్ళీ చేస్తాను. నేను పనిచేసిన ప్రతి ఒక్కరికి అందరికి చేస్తాను. వచ్చి మా సినిమాను సపోర్ట్ చేయమని హానెస్టీ గా చేశాను. ప్రొబబ్లీ హానెస్టీ గా చేయటం తప్పు అని నాకు అప్పుడు అనిపించింది. ఎవ్వరికీ చెప్పొద్దు సినిమా తర్వాత టకటక సినిమాలు చేయాల్సింది. ఆడియన్స్ కి ఏదైనా మనం ఇంట్రెస్టింగ్ చేద్దాం ఒక గొప్ప సినిమా వాళ్లకు ఇద్దాం అనిపిస్తుంది. బట్ నేను చేస్తే స్టాండర్డ్ గానే చేస్తా లేకపోతే నేను చేయను.
హీరో రాకేష్ వర్రే మాట్లాడుతూ జితేందర్ రెడ్డి సినిమా ఎందుకు పోస్టుపోన్డ్ అవుతా వచ్చింది. అసలు సినిమా రిలీజ్ అవుద్దా లేదా అని, జితేందర్ రెడ్డి సినిమా నేను ఎందుకు చేశాను అంటే ఒక మంచి కథ. చాలామంది అంటున్నారు జితేందర్ రెడ్డి గారు పెద్ద ఫ్రీడమ్ ఫైటర్. ప్రజల కోసం పేదల కోసం ఫైట్ చేశారు. ఈ సినిమా చేయటానికి నాకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి చనిపోయిన వాళ్ళ అన్నయ్య గురించి ఒక తమ్ముడు చేయాలి అనుకుంటున్న స్టోరీ. రెండవది ఇది కేవలం నేను కమర్షియల్ యాక్షన్ డ్రామాగానే చూశాను.