Parasuram : సోలో సినిమా తెర వెనుక విశేషాలు.. మీకు తెలియని నిజాలు దర్శకుడు పరశురామ్ మాటల్లో..! : దర్శకుడు పరశురామ్ సోలో సినిమా తెర వెనుక విశేషాలు మరియు పలు ఆసక్తికర విషయాల్ని పంచుకోవడం జరిగింది.
నా లైఫ్ లో జరిగిన యదార్థ సంఘటనలను తీసుకోని సోలో సినిమాను తెరకెక్కించా
దర్శకుడు పరశురామ్ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో సోలో సినిమా తెర వెనుక విశేషాలు పంచుకోవడం జరిగింది. హీరో క్యారక్టరేజేషన్ రాసేటప్పుడు అనాధ అని రాశారు. మీరు అప్పుడు అనాధ శరణాలయం కు ఏమైనా వెళ్ళారా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు పరశురామ్…
సోలో సినిమాలో 50% టు 60% పెయిన్ నా రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని కొన్ని సన్నివేశాలు తీసుకోవడం జరిగింది. నాకు 19 ఇయర్స్ అప్పుడు మా అమ్మ గారు చనిపోయారు. ఇప్పటికి నాకు అమ్మ లేని లోటు ఉంటూనే ఉంటుంది. నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన 10 ఏళ్లు బీభత్సమైన పెయిన్ లో ఉండేవాడిని. తెలిసో తెలియక కొన్ని సన్నివేశాల్లో రిఫ్లెక్ట్ అయ్యి ఉంటాది.
ఆ పెయిన్ డెప్త్ వల్ల హానెస్టీగా చెప్పాలనుకున్నాను. బేసిక్ గా నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. నా భార్య వాళ్ళది పెద్ద ఫ్యామిలీ. చాలా పెద్ద ఫ్యామిలీ. కొంచెం నా రియల్ లైఫ్ జరిగినవన్నీ ఎక్కడో అక్కడ పెట్టే ఉంటాను. రోహిత్ ని కలిసి ఇది ఐడియా ఇలా ఉంది నా దగ్గర కథ అని చెప్పాను. మీకు ఇష్టమైన చేస్తారా అని అడిగితే చేస్తాను సర్ అని నారా రోహిత్ అన్నారు. తర్వాత ఎప్పుడు కథ అడగలేదు. నేను ఏం చెప్పలేదు.
Parasuram : సోలో సినిమా తెర వెనుక విశేషాలు.. మీకు తెలియని నిజాలు దర్శకుడు పరశురామ్ మాటల్లో..!
దర్శకుడు పరశురామ్ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో సోలో సినిమా తెర వెనుక విశేషాలు మరియు కొన్ని పలు ఆసక్తికర విషయాల్ని పంచుకోవడం జరిగింది. సోలో సినిమా ఐడియా ఎలా స్టార్ట్ అయ్యింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు పరశురామ్… నేను ఎన్ని సినిమాలు చేసిన సోలో సినిమా డెఫినిట్ గా నా హార్ట్ లో ఎప్పుడు దానికి స్పెషల్ ప్లేస్ ఉంటాది.
ఇలా ఎందుకు అంటున్న అంటే ఫ్యూచర్ లో గొప్ప గొప్ప సినిమాలు నేను చేయచ్చు. కానీ ఆ సినిమా స్థానం ఎప్పుడు నా హృదయంలో పదిలంగా ఉంటుంది. హానెస్టీ గా ఒక లవ్ స్టోరీ చేద్దాం అనే ఐడియాతో మొదలైంది. అప్పటికి కొన్ని సినిమాలు బాగా ట్రెండ్ లో ఉన్నాయి. ఒక లవ్ చేసిన అమ్మాయి ఇంటికి వెళ్లి వాళ్ళను ఏమార్చి లేకపోతే చివర్లో మళ్ళీ చిన్న డ్రామా ప్లే చేసి, సో ఈ కైండ్ అఫ్ స్క్రీన్ ప్లే లతో సినిమాలు పెద్ద హిట్ లు అవుతున్న టైం అది. అప్పటికి ఆ ట్రెండ్ నడుస్తుంది.
సో అప్పుడు నాకు అనిపించింది. జెన్యూన్ గా హానెస్టీగా ఒక కుర్రాడు ఒక పేషన్స్ తో వెయిట్ చేస్తే ఎలా ఉంటాది. అంటే వచ్చి మళ్ళీ అక్కడ అబద్దాలు చెప్పి లేకపోతే ఏమార్చి డెఫినిట్ గా అది కూడా వెరీ గుడ్ స్క్రీన్ ప్లే అలా రాయడం కూడా అంతా ఇది కాదు. నేను ఏంటంటే జెన్యూన్ గా ఒకడు అసలు తనకి ఏం కావాలి అనే డిటెర్మినేషన్ తో తను వెయిట్ చేస్తే చివరికి సాధించగలడా లేదా అనే ఒక థాట్ నుంచి మొదలు అయ్యింది.
సోలో సినిమా బేస్ ఐడియా ఏంటి అంటే హీరో ఒక అనాధ. స్క్రీన్ ప్లే కథ రాసుకుంటూ అలా ఒక అరగంట ఐడియా వచ్చిన తర్వాత బలంగా ఐడియాను నేను నమ్మాను. ఈ సినిమా డెఫినిట్ గా ఆడియన్స్ ఆదరిస్తారు అనే దానికంటే డెఫినిట్ గా చరిత్రలో ఇది ఒక మంచి సినిమాగా నిలబడుతుంది. అనే ఒక నమ్మకం వచ్చింది. నేను అంతకుముందు యువత మరియు ఆంజనేయులు సినిమాలు చేశాను. రెండు సినిమాలు మంచి సినిమాలే కానీ ఒక రైటర్ గా నాకు ఛాలెంజ్ విసిరిన ఫిల్మ్ సోలో.
ఈ సినిమా కథ ఎక్కడ డీవియేట్ కాకుండా సింగల్ ఎజెండాతో వెళ్ళాలి అనుకున్నాం. ఫ్రమ్ ది టైటిల్స్ నుంచి ఎండ్ వరకు సో ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తూ రాసుకున్న కథ ఇది. అలా అరగంట కథ రెడీ అయ్యిన తర్వాత ఎవరికీ చెప్దాం అనే ఆలోచిస్తున్న టైంలో మా ఫ్రెండ్ దంతులూరి చైతన్య బాణం అనే సినిమా చేశాడు. ఆ సినిమాలో రోహిత్ బాగా చేశాడు. రోహిత్ లో ఆ ఇన్నోసెన్స్ ఆ హానెస్టీ పేస్ లో అదంతా కనబడుతుంది.
అప్పుడు సోలో సినిమా కథకు పర్ఫెక్ట్ యాప్ట్ రోహిత్ అని అనుకున్నాను. అంత పెయిన్ అంత హానెస్టీగా ఉన్న పేస్ కావాలి అనిపించింది. ఆ క్వాలిటీస్ అన్ని రోహిత్ లో పుష్కలంగా ఉన్నాయి. ఆంటే ఆడు అనాధ అంటే ఆడిటోరియం మొత్తం నమ్మాలి. చూసి అయ్యో పాపం అనుకోవాలి. ఇవన్నీ నాకు రోహిత్ లో కనిపించాయి. సో అప్పుడు రోహిత్ కి వెళ్లి కథ చెప్పాను. సింగల్ సిట్టింగ్ లోనే కథ బాగుంది సర్ చేద్దాం అని రోహిత్ అన్నాడు. అలా అక్కడి నుంచి ఒక్కొకటి మెటీరియలైజ్ అయ్యింది.
ఏమైంది ఈ వేళ సినిమా చూసి నిషా అగర్వాల్ ని తీసుకున్నాం
ఈ సినిమాలోకి నిషా అగర్వాల్ ఎలా వచ్చారు. మీరు ఆమెను ఎలా అప్రోచ్ అయ్యారని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు పరశురామ్… నేను రోహిత్ ను హీరోగా అనుకున్నప్పుడు తన పక్కన ఒక ఎస్టాబ్లిషుడ్ అయినా హీరోయిన్ ఉండాలి అనుకున్నాను. ఎందుకంటే ప్రకాష్ రాజు కూతురు కదా మాములు యాక్ట్రెస్ ఎందుకు అన్ని అప్పుడు ఇద్దరు ముగ్గురిని అనుకున్న కానీ అప్రోచ్ అవ్వలేదు.
ప్రకాష్ రాజ్ గారికి కథ చెప్పాను. ఓకే మనం చేస్తున్నాం అన్నారు. మణిశర్మ గారు సాంగ్స్ అవి కంపోస్ అయిపోతున్నాయి. సినిమా కూడా ఓపెన్ అయ్యింది. కానీ హీరోయిన్ ఇంకా సెట్ అవ్వలేదు. అప్పుడు నేను ఇంట్లో కూర్చొని టివి చూస్తుండగా ఏమైంది ఈ వేళ సినిమాలో సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ చూసి అమ్మాయి బాగుంది అనిపించింది. అప్పుడు రోహిత్ కి వెంటనే ఫోన్ చేసి ఇలా ఒక సాంగ్ చూశాను. కాజల్ వాళ్ళ చెల్లెలు బాగుంది అమ్మాయి. మన క్యారెక్టర్ కి కరెక్ట్ గా సరిపోతుంది. అప్పుడు ఈవెనింగ్ షో వేసుకొని నేను రోహిత్ ఏమైంది ఈ వేళ సినిమా చూశాను. అలా నిషాను అప్రోచ్ అయ్యాము. ఆమె కథ విని వెంటనే ఓకే చేసింది.
మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు మీ యువత సినిమా చేశారు. అదేవిధంగా నారా రోహిత్ బాణం సినిమా కూడా ఆయనే చేశారు. ఇద్దరు అనుకోని ఏమైనా పెట్టారా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు పరశురామ్… అంటే నా ఫస్ట్ ఫిలిం యువత కి మణిశర్మ గారు మంచి ఆల్బం ఇచ్చారు. మణిశర్మ గారు పెద్ద సినిమాలు చేస్తున్నారు. కథ నచ్చితే మాత్రం ఇలాంటివి మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ ఉంటారు. సోలో కథ విని బాగుంది రా మ్యూజిక్ కి మంచి స్కోప్ ఉంటాది. మంచి పాటలు వస్తాయి నువ్వు రిలాక్స్ అవ్వు అని మణిశర్మ గారు అన్నారు.
ఈ సినిమాలో డైలాగ్స్ కి పెద్ద పీట వేశారు. అంటే ఆడియన్స్ కూడా ప్రతి సన్నివేశానికి కనెక్ట్ అవ్వడానికి స్ట్రాంగ్ రీజన్ డైలాగ్స్ అనే చెప్పుకోవాలని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు పరశురామ్… ఆ స్క్రిప్ట్ లో అలా మాట్లాడే స్కోప్ ఉంది. మనం కూర్చొని ఏదో డైలాగ్ రాయాలి ఇప్పుడు మంచి డైలాగ్ రాసి ఈ సీన్ నిలబెట్టాలి. అలాంటిది ఏం ఉండదు. కథే డైలాగ్స్ కోరుకుంటుంది. సోలో సినిమాకు ఏంటంటే ఒక అనాధ మంచి భావాలతో ఉన్న పాత్ర కాబట్టి మంచి మంచి మాటలు వచ్చాయి.