Maruthi : భలే భలే మగాడివోయ్ సినిమా తెర వెనుక మీకు తెలియని నిజాలు… దర్శకుడు మారుతి మాటల్లో…

Maruthi : భలే భలే మగాడివోయ్ సినిమా తెర వెనుక మీకు తెలియని నిజాలు… దర్శకుడు మారుతి మాటల్లో… : భలే భలే మగాడివోయ్ సినిమా తెర వెనుక విశేషాలు మరియు ఆసక్తికర విషయాల్ని దర్శకుడు మారుతి పంచుకోవడం జరిగింది.

Maruthi : భలే భలే మగాడివోయ్ సినిమా తెర వెనుక మీకు తెలియని నిజాలు… దర్శకుడు మారుతి మాటల్లో…

భలే భలే మగాడివోయ్ ఫస్ట్ స్టోరీ చెప్పింది నానికి కాదు… ఎవరికి అంటే..?

భలే భలే మగాడివోయ్ లైన్ అనుకున్నాక ఎమ్మెస్ రాజుకి చెప్పాను. ఒపీనియన్ కోసం ఆయన చాలా బాగుంది. సునీల్ కి చెప్పు అన్నారు. సునీల్ కి లైన్ చెప్పాను. సునీల్ లైన్ బాగుంది. డెవలప్ చేయమన్నారు. కథ డెవలప్ చేసే ప్రాసెస్ లో ఇంకా ఏజ్ తక్కువ ఉండి నాని లాంటి కుర్రాడు అయితే బాగుంటుంది. అని నానికి చెప్పడం జరిగింది. అని దర్శకుడు మారుతి తెలిపారు.

Maruthi : భలే భలే మగాడివోయ్ సినిమా తెర వెనుక మీకు తెలియని నిజాలు… దర్శకుడు మారుతి మాటల్లో…

దర్శకుడు మారుతి ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా భలే భలే మగాడివోయ్ సినిమా తెర వెనుక విశేషాలు మరియు సినిమా గురించి ఆసక్తికర విషయాల్ని పంచుకోవడం జరిగింది. అవి ఏంటో తెలుసుకుందాం.

భలే భలే మగాడివోయ్ సినిమా ఐడియా ఎలా వచ్చింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు మారుతి… గీతా ఆర్ట్స్ ఆఫీస్ వెళ్తున్న తెలియకుండా మరిచిపోయి వేరే రూట్ కి వెళ్లడం అలా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఎదురు అయ్యింది. అక్కడ భీజం పడింది.

అలా ఆరోజు రాత్రి కూర్చొని ఆలోచిస్తున్న ఒకడు మర్చిపోతే ఎలా ఉంటాది అనే ఐడియా స్ట్రైక్ అయ్యింది. అలా కొన్ని సీన్స్ అలా అనుకున్నాను. ఈ లైన్ మీద కథ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఈరోజుల్లో మరియు బస్ స్టాప్ టైంలోనే ఈ థాట్ వచ్చింది.

అలా చాలామంది డైరెక్టర్స్ కి పాయింట్ చెప్పేవాన్ని, ఏదైనా కథ రాయండి లవ్ స్టోరీ కానీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ కానీ డైరెక్టర్స్ అందరు ట్రై చేసే వాళ్ళు ఎక్కడో స్టక్ అయిపోయేవారు. ప్రేమకథ చిత్రం, కొత్త జంట తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే డైలమాలో ఉన్నప్పుడు ఈ కథ చేయాలని డిసైడ్ అయ్యాను.

Maruthi : భలే భలే మగాడివోయ్ సినిమా తెర వెనుక మీకు తెలియని నిజాలు… దర్శకుడు మారుతి మాటల్లో…
Image Source : Twitter / Mediacorp Vasantham

యూవీ క్రియేషన్స్ వంశీకి లైన్ చెప్పాను. వంశీకి నచ్చింది. నానితో మాట్లాడాడు. నాని కలిసి ఐడియా చెప్పాను. ఐడియా భలే ఉంది అండి అన్నారు. ఐడియా చెప్పిన తర్వాత చిన్నగా ఇలా చేస్తే బాగుంటుంది కదా అని నాని యాక్ట్ చేసి చూపించారు. మనం రన్నింగ్ లో ఎంజాయ్ చేస్తూ చేద్దాం అన్నాను.

కారక్టరేజేషన్ పట్టుకొని స్టోరీ రాయడం మీకు టప్ గా అనిపించలేదా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు మారుతి… నాకు ఎప్పుడు టప్ కాదు నేను ఏదైనా ఎంజాయ్ చేస్తూ చేస్తాను. నాకు ఎప్పుడు కూడా సెట్ అయితే బాగా సెట్ అవుతాది.

నా స్ట్రెంగ్త్ ఒక చిన్న పాయింట్ ని యూనిక్యూ గా 2 గంటలు ఎలా చెప్పడం అనేదే నా స్ట్రెంగ్త్. నేను పెద్దగా స్ట్రెయిన్ అయిపోలేదు. యూవీ వంశీకి కథ బాగా నచ్చింది. బన్నీ వాసు అదేంటి మనం సినిమా చేద్దాం అనుకున్నాం కదా అని అన్నాడు. అలా రెండు బ్యానర్స్ కలిసి సినిమాను నిర్మించారు.

కొత్త జంట విడుదల అయిన సినిమా ఒక నెల తర్వాత ఈ ఐడియా చెప్పాను. 6 నెలలు స్క్రిప్ట్ మీద వర్క్ చేశాను. కొంచెం టైం తీసుకోని మరి చేసిన కథ. ఈ సినిమా టైటిల్ తోనే స్టార్ట్ చేశాము. రవితేజ గారు ఒకసారి కలిసినప్పుడు టైటిల్ చెప్తే భలే టైటిల్ పెట్టావు అన్నారు. అలా టైటిల్ ఫిక్స్ అయిపోయాను.

మారుతి ఈ లైన్ ఎక్కడ అయినా inspire అయ్యారా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు మారుతి… inspire అవ్వడానికి అంతకు ముందు ఈ లైన్ మీద ఏ సినిమా లేదు కదా ఎందుకంటే మర్చిపోవడం మీద ఉంటుంది కానీ మైండ్ డైవర్ట్ అవ్వటం మీద లేదు. మతిమరుపుకి ఎక్స్టెన్షన్ మైండ్ డైవర్ట్ అయ్యి వేరే పని మీద ఉన్నాడు.

మళ్ళీ గుర్తుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాడు అనే పాయింట్ ఎక్కడ లేదు. అది ఆర్గానిక్ గా వచ్చింది. కొత్త థాట్ అయితే ఆరోజుకి ఆడియన్స్ కి అంత డ్రాస్టిక్ గా ఎక్కుతుంది. ఇప్పటికి చాలామంది ఆడియన్స్ భలే భలే మగాడివోయ్ లాంటి సినిమా చేయమని అడుగుతుంటారు.

Maruthi : భలే భలే మగాడివోయ్ సినిమా తెర వెనుక మీకు తెలియని నిజాలు… దర్శకుడు మారుతి మాటల్లో…
Image Source : Twitter / Naniicons

నానికి ఈ ఐడియా ఎప్పుడు చెప్పారు ఆయన విన్న వెంటనే ఎలా ఎక్సైట్ అయ్యారని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు మారుతి… ఒకరోజు నానిని వెళ్ళి కలిశాను. ఒక గంట నరేషన్ ఇచ్చాను. భలే ఉంది అండి చేద్దాం అని నాని అన్నాడు. అష్టా చమ్మా పిల్ల జమీందార్ తర్వాత ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేయలేదు. ఈ సినిమాలో ఆ స్కోప్ ఉంది అని నాని ఫిక్స్ అయ్యారు.

ఈ సినిమాలోకి లావణ్య త్రిపాఠి ఎలా వచ్చింది ఆవిడ కన్న ముందు వేరే హీరోయిన్ అనుకున్నారా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు మారుతి… అందాల రాక్షసి చూసినప్పుడు చాలా బాగా పెర్ఫార్మ్ చేసిందే అని అనిపించింది. తిను అయితే బాగుంటుంది. అని తనకు చెప్పాను.

లావణ్య త్రిపాఠి ఒకరోజు గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వచ్చింది. కథ వినింది. ఆమెకు విపరీతంగా నచ్చింది. వెంటనే చేస్తాను అని చెప్పింది. కథ చెప్తున్నప్పుడు నవ్వుతూనే ఉంది ఫుల్ ఎంజాయ్ చేసింది. చాలా బాగుంది కథ అని ఫుల్ ఎక్సైట్ అయ్యింది.

చిరంజీవికి బాగా నచ్చిన మారుతి చిత్రం ఏది అయ్యింటుంది…

ప్రేమకథా చిత్రం విడుదలైన చాలా రోజులు తర్వాత చిరంజీవి గారు చూశారు. అలా ఒకరోజు చిరంజీవి గారు ఫోన్ చేసి చాలా బాగా తీశావ్ మారుతి అన్నారు. ఫుల్ గా నవ్వుకున్నాం ఇంట్లో అందరం రేపు రా ఇంటికి అన్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నావ్ అని అడిగారు.

భలే భలే మగాడివోయ్ కథ చెప్పాను. చిరంజీవి గారు చాలా బాగుంది అన్నారు. కథ విన్నాక ఇలా చేస్తే బాగుంటుందా అని ఒక సీన్ యాక్ట్ చేసి చూపించారు. నేను షాక్ అయ్యాను. ఎవరిని అనుకుంటున్నావు అని అడిగారు నానితో సర్ అన్నాను.

ఈ సినిమాలోకి గోపిసుందర్ ఎలా వచ్చారు అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు మారుతి… కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కి వెళ్ళాలి రెగ్యులర్ సౌండింగ్ ఉండకూడదు ఫ్రెష్ మ్యూజిక్ ఉండాలి. నాకు ఉస్తాద్ హోటల్ పాటలు అంటే చాలా ఇష్టం. గోపిసుందర్ ని కలిసి అడిగితే ఓకే చేద్దాం అన్నాడు.

గోపిసుందర్ అప్పటికే తెలుగులో మొదటి సినిమా చేస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఒకరోజు వెళ్తే అదే రోజు 3 పాటలు ఇచ్చేశాడు. గోపిసుందర్ పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశాడు.

Anil Ravipudi : పటాస్ సినిమా గురించి మీకు తెలియని నిజాలు దర్శకుడు అనిల్ రావిపూడి మాటల్లో…

Hello Friends, My Name is Surya, I Am The Writer And Founder Of This Blog And Share All The Information Related To Entertainment Through This Website.

Sharing Is Caring:

Leave a Comment