Mahesh Babu : దూకుడు సినిమా తెర వెనుక విశేషాల్ని పంచుకున్న దర్శకుడు శ్రీను వైట్ల..! : దర్శకుడు శ్రీను వైట్ల దూకుడు సినిమా తెర వెనుక విశేషాల్ని మరియు మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన విషయాల్ని పంచుకోవడం జరిగింది.
Mahesh Babu : దూకుడు సినిమా తెర వెనుక విశేషాల్ని పంచుకున్న దర్శకుడు శ్రీను వైట్ల..!
దర్శకుడు శ్రీను వైట్ల ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో దూకుడు సినిమా తెర వెనుక విశేషాల్ని కాకుండా కొన్ని ఆసక్తికర విషయాల్ని కూడా పంచుకున్నారు.
దూకుడు సినిమాకు మహేష్ బాబుని ఎలా అప్రోచ్ అయ్యారు మరియు దూకుడు సినిమా బీజం ఎక్కడ పడింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు శ్రీను వైట్ల… కింగ్ సినిమా టైంలోనే మహేష్ బాబు అక్క మంజుల సినిమా చేయమని అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది.
నమో వేంకటేశ సినిమా చేస్తున్నప్పుడు మంజుల ఒకరోజు ఫోన్ చేశారు. తర్వాత మంజుల ఆఫీస్ కి వెళ్ళాను. మంజుల ని కలిశాక ఎవరితో సినిమా చేద్దాం అనే డిస్కషన్ లో ఉన్నప్పుడు ఎవరితోనో ఎందుకు మహేష్ బాబు తోనే చేద్దాం అని నేను చెప్పాను. అప్పుడు ఆమె మహేష్ తో మాట్లాడటం జరిగింది.
మహేష్ బాబుకి నా సినిమాలు రెడీ, ఢీ, ఆనందం మరియు కింగ్ సినిమా అంటే విపరీతమైన ఇష్టం అని చెప్పారు. మహేష్ బాబుకి నా సినిమాలంటే చాలా ఇష్టం అంతే కాకుండా నాతో సినిమా చేయాలని ఆయన కూడా ఉంది. అప్పుడు మంజుల మహేష్ బాబుతో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. అలా మా ఇద్దరి ప్రయాణం మొదలు అయ్యింది.
మహేష్ బాబుని కలిశాక ఏదైనా లైన్ ఉంటే చెప్పండి అన్నారు. నమో వేంకటేశ సినిమా షూటింగ్ ఎండింగ్ లో ఉండగా రైటర్ గోపిమోహన్ కు చెప్పను. నెక్స్ట్ సినిమా మనం మహేష్ బాబు తో చేస్తున్నాం ఏదైనా లైన్ ఉంటే చెప్పు అన్నాను. గోపిమోహన్ మహేష్ బాబుతో సినిమా అంటే ఫుల్ ఎక్సైట్ అయ్యాడు. అప్పుడు గోపిమోహన్ ఒక ఐడియా చెప్పాడు. బాగుంది నాకు కూడా చాలా నచ్చింది.
నమో వేంకటేశ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఒకరోజు మహేష్ బాబుని కలిసి 40 మినిట్స్ కథను నరేషన్ ఇచ్చాను. మహేష్ బాబుకి నచ్చింది బాగుంది అంది మీ స్టైల్ లోనే ఉంది అని అన్నారు. నేను ఫుల్ స్టోరీ తో మీ ముందుకు వస్తాను అని మహేష్ బాబు కు చెప్పాను.
నేను రైటర్ గోపిమోహన్ ఇద్దరం కలిసి మహాబళేశ్వర్ కి వెళ్లి స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టాము. 80% స్క్రిప్ట్ రెడీ అయ్యింది. మిగతా 20% స్క్రిప్ట్ క్రాక్ అవ్వట్లేదు, స్క్రిప్ట్ సరిగ్గా రావట్లేదు ఎక్కడో సాటిస్ఫాక్షన్ గా కథ అనిపించడం లేదు. ఇంకా మహాబళేశ్వర్ నుంచి హైదరాబాద్ కు వచ్చాము.
మహేష్ బాబు డేట్స్ ఇచ్చేశాడు. కానీ కథ మాత్రం సాటిస్ఫాక్షన్ గా అనిపించట్లేదు. మహేష్ బాబుతో ఎక్స్ట్రా ఆర్డినరీ ఫిలిం తీయాలి అనుకున్నాను. ఈ కథ అస్సలు చేయొద్దు అని అనుకున్న, ఒకరోజు నేను నా అసిస్టెంట్ డైరెక్టర్ కేబీర్ పార్క్ వాకింగ్ వెళ్ళాము. ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్న, అప్పుడు మహేష్ బాబుని ఇంతవరకు చూపించని ఏంటి అని ఆలోచించాను. అప్పుడు ఒక ఐడియా వచ్చింది.
మహేష్ బాబు వైట్ అండ్ వైట్ వేసుకొని ఎప్పుడు చేయలేదు…
ఇంతవరకు మహేష్ బాబు వైట్ అండ్ వైట్ వేసుకొని యాక్ట్ చేయలేదు, మహేష్ బాబుని అలా చూపిస్తే ఎలా ఉంటది అనే థాట్ వచ్చింది. అలా నెక్స్ట్ డే ఐడియాను డెవలప్ చేసి రివెంజ్ ఫార్మాట్ లో లైన్ సెట్ చేశాను. మరుసటి రోజు మహేష్ బాబుని కలిసి ఆ కథ వద్దు అని చెప్పాను. అప్పుడు మహేష్ బాబు అది ఎలా చెప్పాలో నాకు ఉంది అండి మైండ్ లో అని చెప్పారు. ఆ కథ వెంకీ స్టైల్ రెగ్యులర్ ఫార్మట్ లో ఉంటుంది అని మహేష్ బాబు చెప్పారు.
అప్పుడు నాకు వచ్చిన ఐడియాను చిన్న లైన్ గా మహేష్ బాబుకి చెప్పాను. సూపర్ అండి బాగుంది అని మహేష్ బాబు అన్నారు. అదే రోజు ఈవెనింగ్ రైటర్ గోపిమోహన్ మా ఇంటికి రమ్మన్నాను. మహేష్ బాబుకి ఒక లైన్ చెప్పాను బాగా ఎక్సైట్ అయ్యాడు. లైన్ మహేష్ బాబుకి విపరీతంగా నచ్చింది. అప్పుడు గోపిమోహన్ కి కూడా లైన్ వినిపించాను. గోపిమోహన్ ఇమ్మీడియేట్ గా అన్న మాట ఇది కొంచెం రివెంజ్ ఫార్మట్ లో ఉంది. ఆడియన్స్ మీ నుంచి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు అని చెప్పాడు.
ఆరోజు రాత్రి అంత కూర్చొనే ఉన్నాం ఉదయం 5:30 వరకు మాట్లాడుకున్నాం, అలా ఒక నెల ఊటీకి వెళ్లి స్క్రిప్ట్ రాశాము. ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యింది. మహేష్ బాబుకి వెళ్లి ఫుల్ స్టోరీ నరేషన్ ఇచ్చాను. అప్పుడు మహేష్ బాబు ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అన్ బిలివబుల్ అన్నారు. అదే డైలాగ్ ని సినిమాలో కూడా పెట్టడం జరిగింది.
మంజుల గారు ప్రొడ్యూస్ చేయాల్సిన సినిమా 14 రీల్స్ వాళ్ళు ఎలా వచ్చారు అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు శ్రీను వైట్ల… 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ నాకు మంచి ఫ్రెండ్స్, కలిసి నమో వేంకటేశ సినిమా చేశాము. 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్ అప్పుడు రిక్వెస్ట్ చేశారు మనం కలిసి సినిమా చేద్దాం అని, ఇమ్మీడియేట్ గా మంజుల గారికి చెప్పాను. ఆమె అభ్యంతరం చెప్పలేదు. అలా దూకుడు సినిమా 14 రీల్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు.
దూకుడు సినిమాలో మహేష్ బాబు మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తారు అది మీరు కింగ్ సినిమా రిఫరెన్స్ గా తీసుకున్నారా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు శ్రీను వైట్ల… అవును కింగ్ సినిమా నుంచే రిఫరెన్స్ తీసుకున్నాం ఆ ఐడియా చాలా బాగా వర్కౌట్ అయ్యింది.
దూకుడు సినిమా కాస్టింగ్ గురించి చెప్పండి అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు శ్రీను వైట్ల… నాజర్ గారు తమిళ్ లో కామెడీ చేశారు కానీ మొదటిసారిగా తెలుగులో కామెడీ చేయడం. చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం బ్రహ్మానందం కామెడీ ట్రాక్ మరియు ఎమ్మెస్ నారాయణ కామెడీ ట్రాక్ హిలేరియస్ గా వర్కౌట్ అయ్యింది. ప్రకాష్ రాజ్ ఆ పాత్రకు 100% న్యాయం చేశారు. విలన్ గా సోనూసూద్ ప్లస్ అయ్యాడు.
ఏ మాయ చేశావే సినిమా చూసి సమంతను తీసుకున్నాం…
ఈ సినిమాలోకి సమంతను ఎలా తీసుకున్నారని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు శ్రీను వైట్ల… ఈ సినిమాలోకి సమంత ఎలా వచ్చింది అంటే, ఏ మాయ చేసావే సినిమా మూవీ మాక్స్ లో చూశాను.
సమంత నా పక్కనే కూర్చొని సినిమా చూసింది. సమంత బ్యూటిఫుల్ గా ఉంది. బాగా చేసింది అని ఫీల్ అయ్యాను. మంజులకు చెప్పాను, మంజుల మహేష్ బాబుకి చెప్పింది అయన ఓకే చేశారు. మహేష్ బాబు పక్కన హీరోయిన్ అంటే సమంత ఫుల్ ఎక్సైట్ అయ్యింది.
థమన్ కంటే ముందు వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని అనుకున్నారంట నిజమేనా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు శ్రీను వైట్ల… థమన్ తరచుగా నాతో అప్రోచ్ అవుతూనే ఉన్నాడు. నేను కాకినాడలో ఉన్న థమన్ కి ఫోన్ చేసి దూకుడు టైటిల్ సాంగ్ మరియు గురువారం మార్చ్ ఒకటి సాంగ్ సిట్యుయేషన్స్ చెప్పాను.
రెండు రోజుల తర్వాత కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చాను. రెండు ట్యూన్స్ థమన్ పంపించాడు. నాకు విపరీతంగా నచ్చాయి. ఇమ్మీడియేట్ గా మహేష్ బాబుకి వినిపించాను. మహేష్ బాబుకి కూడా బాగా నచ్చాయి. ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. థమన్ అని చెప్పాను. సూపర్బ్ ఓకే అని మహేష్ బాబు అన్నారు.
దూకుడు సినిమా చాలా లొకేషన్స్ లో సినిమా షూట్ చేశారని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దర్శకుడు శ్రీను వైట్ల… షూట్ కి వెళ్లే ముందు ప్రతి సీన్ మహేష్ బాబుకు వినిపించాను. మహేష్ బాబు బాగా ఎక్సైట్ అయ్యాడు. ఇస్తాంబుల్ లో మొదటి షెడ్యూల్ షూట్ చేశాము. గుజరాత్, ముంబై లో కూడా షూట్ చేశాము. సెకండ్ హాఫ్ మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో ఒక ముస్లిం హౌస్ లో షూట్ చేశాము. ఢీ సినిమా కూడా అదే హౌస్ లో షూట్ చేశాము.
దూకుడు సినిమాలో మహేష్ బాబు సమంత లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దర్శకుడు శ్రీను వైట్ల… మహేష్ బాబు మరియు సమంత కెమిస్ట్రీ బాగా కుదిరింది. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ చాలా ఫన్నీ గా ఉంటాయి. అంతే కాకుండా హిలేరియస్ గా వర్కౌట్ అయ్యింది.
Nagarjuna : నిన్నే పెళ్లాడతా సినిమా గురించి మీకు తెలియని నిజాలు డైరెక్టర్ కృష్ణ వంశీ మాటల్లో…