Kiran Abbavaram : 2025 లో హీరో అవుతా అని అనుకోని, సినిమా ఇండస్ట్రీకి వచ్చా : కిరణ్ అబ్బవరం : కిరణ్ అబ్బవరం తన సినిమా ప్రస్థానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా తను షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ సినిమాల్లోకి ఎలా ఎంటర్ అయ్యాడని చెప్పడం జరిగింది. ఆ విశేషాల్ని కిరణ్ అబ్బవరం మాటల్లోనే తెలుసుకుందాం.
Kiran Abbavaram : 2025 లో హీరో అవుతా అని అనుకోని, సినిమా ఇండస్ట్రీకి వచ్చా : కిరణ్ అబ్బవరం
కిరణ్ అబ్బవరం ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో తన సినిమా జర్నీ గురించి ఆసక్తికర విషయాల్ని పంచుకోవడం జరిగింది. మీరు షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి ఎలా ఎంటర్ అయ్యారని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ…
2016 లో నేను గచ్చిబౌలి అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అప్పటికి నాకు అంత నమ్మకం లేదు నేను హీరో అవుతా అని, సినిమాల్లోకి వద్దామా అని అనుకునేవాడిని. గిరీష్ అనే ఒక ఫ్రెండ్ వల్ల గచ్చిబౌలి అనే షార్ట్ ఫిల్మ్ జరిగింది. అప్పుడు నేను బెంగళూర్ లో జాబ్ చేసేవాడిని. జాబ్ చేసుకుంటూ పార్లేల్ గా షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని. నేను సాఫ్టువేర్ లో నెట్వర్క్ కన్సల్టింగ్ లో జాబ్ చేసేవాడిని. మనకు సాఫ్టువేర్ ఇదంతా సెట్ కాదు అని అనిపించేది. సినిమాల్లోకి అయినా వద్దాం అనుకున్న లేకపోతే ఏదైనా బిసినెస్ చేద్దాం. ఈ జాబ్ మనతో ఇంకా అవ్వదు లే అని ఫిక్స్ అయ్యాను. గచ్చిబౌలి అనే షార్ట్ ఫిల్మ్ ప్రసాద్ లాబ్స్ స్క్రీన్ మీద మొదటిసారిగా చూడటం ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందే అని అనిపించింది. వారంలో ఐదు రోజులు జాబ్ చేయాలంటే మూడు రోజుల్లోనే రెండు షిఫ్ట్ లుగా పని చేసి మిగతా నాలుగు రోజుల్లో షార్ట్ ఫిలిమ్స్ షూటింగ్ చేసేవాళ్ళం.
షార్ట్ ఫిలిమ్స్ ఎలా తీస్తారో కూడా తెలీదు. కెమెరా అంటే ఏంటో కూడా తెలీదు. టెక్నికల్ గా అసలు నాలెడ్జ్ కూడా లేదు. థియేటర్ లో సినిమా చూడటం తప్ప సినిమా గురించి ఏ ఐడియా లేదు. బెంగళూర్ నుంచి హైదరాబాద్ కి వచ్చి షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ మళ్ళీ జాబ్ కూడా చేసేవాడిని. అలా ఒక ఆరు షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అలా షార్ట్ ఫిలిమ్స్ చేసిన తర్వాత ఇంకా మనం సినిమాల్లో ట్రై చేయచ్చు అని అనిపించింది. 2017 లో జాబ్ మానేశాను.అప్పుడు గూగుల్ చేస్తే ఎన్ని రోజుల్లో యాక్టర్ అవుతామని చేసేవాడిని. హీరో అనే ఐడియా కూడా లేదు. ఎందుకు అంటే అంత నాలెడ్జ్ కూడా లేదు. గూగుల్ యాక్టర్ గా సర్వైవ్ అవ్వాలంటే ఐదు సంవత్సరాలు చూపించేది.
ఇప్పుడు మనం 2017 లో జాబ్ మానేస్తున్నాం. ఐదు సంవత్సరాలు కాదు ఇంకో రెండు సంవత్సరాలు వేసుకున్న 2025 కు కల్లా హీరో అవుతా అనే ఇండస్ట్రీకి వచ్చాను. కృష్ణ నగర్ లో ఎక్కడో మనం టీ కి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటాం అనే మెంటల్ గా ముందుగానే ఫిక్స్ అయ్యాను. ఇంట్లో వాళ్లు కానీ మన బంధువులు కానీ ఎవ్వరు ఏమన్నా ప్రపంచానికి సంబంధం లేకుండా ఉందాం అని ఫిక్స్ అయ్యాను. ఒక ఏడూ సంవత్సరాలు మన కెరీర్ కోసం కష్టపడాలి అని డిసైడ్ అయ్యాను. జాబ్ మానేసి వచ్చిన ఆరు నెలలకే రాజా వారు రాణి గారు సినిమా హీరోగా అవకాశం వచ్చింది.
శ్రీకారం సినిమా చేస్తున్నారనే సంగతి కూడా నాకు తెలీదు : కిరణ్ అబ్బవరం
శ్రీకారం అనే ఇండిపెండెంట్ ఫిలిం కి మంచిగా ప్రశంశలు అందుకుంది. ప్రీమియర్స్ మరియు ప్రివ్యూస్ వేశారు. యూట్యూబ్ లో కూడా బాగా రీచ్ వెళ్ళింది. అప్పుడు అందరు మీ యాక్టింగ్ గురించి మాట్లాడుకున్నారు. కట్ చేస్తే అదే డైరెక్టర్ పెద్ద ప్రొడక్షన్ తో సినిమా స్టార్ట్ చేశారు. ఆ సినిమా మిస్ అయ్యారని ఏమైనా ఫీల్ అయ్యారా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు.
దానికి సమాధానంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ… శ్రీకారం అనే ఫిల్మ్ బాగా ఇష్టపడి చేసిన సినిమా. అప్పటికి నేను రెండు షార్ట్ ఫిలిమ్స్ చేశాను. శ్రీకారం అనేది మూడవ షార్ట్ ఫిల్మ్. మూడో షార్ట్ ఫిలిం కే మనల్ని గుర్తిస్తున్నారు. ఈ సినిమాతో మనం ఇంకా బయటపడిపోవచ్చు అనే ఫీలింగ్ ఉండేది. ఆ సినిమా తీస్తున్నట్లు గా కూడా నాకు తెలీదు. నాకు తెలియకుండానే ఆ సినిమా చేసేశారు. షార్ట్ ఫిలిం హీరో ఎవరు చూస్తారు అనే ఫీలింగ్ వాళ్లకు ఉండేది. తర్వాత శర్వానంద్ హీరోగా ఆ సినిమా చేయటం జరిగింది. మనం హీరో అవుదాం సినిమాల్లో చేద్దాం షార్ట్ ఫిలిమ్స్ వద్దు అని ఆ టైంలో డిసైడ్ అయ్యాను.
కిరణ్ అబ్బవరం లేటెస్ట్ ఫిల్మ్ క
కిరణ్ అబ్బవరం తాజాగా నటించిన చిత్రం క. క సినిమా దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31 2024 వ తేదీన గ్రాండ్ గా విడుదల అయ్యింది. క సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. క సినిమా నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. క సినిమా డెబ్యూటేన్ట్ డైరెక్టర్స్ సుజీత్ మరియు సందీప్ కలిసి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. క సినిమాను సినీ ఇండస్ట్రీ నుంచి హీరోలు ప్రొడ్యూసర్స్ మరియు మరికొంతమంది డైరెక్టర్స్ అభినందించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు తన ఇంటికి పిలిపించుకుని క టీం అందరిని అభినందించారు.
Varun Tej : మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో ప్రభాస్ డైలాగ్ తో అదరగొట్టిన వరుణ్ తేజ్..?