Kanguva First Review : కంగువా సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో రివ్యూ, సినిమా చూసి ఖంగు తిన్న ఫ్యాన్స్..?

Kanguva First Review : కంగువా సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో రివ్యూ, సినిమా చూసి ఖంగు తిన్న ఫ్యాన్స్..? : తమిళ్ యాక్షన్ స్టార్ సూర్య కథానాయకుడిగా నటించిన కంగువా సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14 2024 గురువారం విడుదల అయ్యింది. కంగువా సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేశారు. ఇంతకీ కంగువా సినిమా ఫ్యాన్స్ మరియు సినీ ప్రేక్షకుల్ని ఎంత మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.

Kanguva First Review : కంగువా సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో రివ్యూ, సినిమా చూసి ఖంగు తిన్న ఫ్యాన్స్..?

Kanguva First Review : కంగువా సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో రివ్యూ, సినిమా చూసి ఖంగు తిన్న ఫ్యాన్స్..?

కంగువా సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫ్రాన్సిస్ ఒక షాడో కాప్ అంటే పోలీసులు చేయలేనివి చేస్తూ వాళ్లకు హెల్ప్ చేసే మనిషి అంత టెన్సన్స్ లో కూడా చిల్ గా ఉండే ఫ్రాన్సిస్ కి ఒక కుర్రాడు పరిచయం అవుతాడు. ఆ కుర్రాడు ఎవరు, ఆ కుర్రాడు వచ్చాక తన లైఫ్ ఎలా మారిపోతుంది. కంగువా ఈ కథలో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది మిగతా కథ. ఫస్ట్ 20 మినిట్స్ సూర్య ఇలా కూడా యాక్ట్ చేస్తాడా అనిపించేలా చూపించారు. ఆ ఫస్ట్ 20 మినిట్స్ కి దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్లేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే పీరియడ్ లుక్, కాస్ట్యూమ్స్ మరియు అంబియాన్స్ కానీ వాళ్ళు క్రియేట్ చేసిన ఆర్ట్ వర్క్ చూడటానికి బాగానే ఉంటుంది. కానీ ఇంట్రడక్షన్ సీన్స్ పర్లేదు అనిపించింది.

ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా లౌడ్ గా ఉంది అని అనిపిస్తుంది. కొన్ని డైలాగులు అయితే నార్మల్ గా చెప్పేవి కూడా చాలా లౌడ్ గా చెప్పడంతో డైలాగ్స్ సరిగ్గా అర్థం కావు. ఆ డైలాగ్స్ ముందు వస్తున్నాయా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముందు వస్తుందా అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పర్లేదు కానీ అంత ఇంపాక్ట్ ఏం చూపించలేదు. ఇంటర్వెల్ బ్లాక్ విషయానికి వస్తే కొంచెం పర్లేదు అని చెప్పుకోవాలి.

సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొన్ని యాక్షన్ సీన్స్ బాగానే డిజైన్ చేశారు. ఆ ఫైట్ సీన్స్ కూడా తొందరగా అయిపోయినట్టు ఎక్కడో క్లారిటీ మిస్ అయినా ఫీలింగ్ ఆడియన్స్ అందరు ఫీల్ అవుతారు. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ కి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు. అలాగే ఒక సెంటిమెంటల్ యాంగిల్ ఒకటి ట్రై చేశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. మిగతా సీన్స్ విషయానికి వస్తే అంత లౌడ్ గా చెప్పాలి అని ఫిక్స్ అయినట్టు అనిపిస్తుంది. కంగువా సినిమా పార్ట్ 1 ఎండ్ అయ్యేసరికి పార్ట్ 2 కి లీడ్ ఇస్తారు. పార్ట్ 1 ఇంత లౌడ్ గా చెప్పారు అంటే పార్ట్ 2 ఇంకా ఎంత లౌడ్ గా చెప్తారో అర్థం చేసుకోవాలి. సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే యాక్షన్ ఎపిసోడ్స్ కొంతవరకు ఆకట్టుకున్నాయి.

నటీనటుల విషయానికి వస్తే

కంగువా క్యారెక్టర్ ని సూర్య అద్భుతంగా నటించాడు. సూర్య పెర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగా చేశాడు. కంగువా క్యారెక్టర్ ని సూర్య బాగా లిఫ్ట్ చేశాడు. కంగువా క్యారెక్టర్ లో సూర్య చూడ్డానికి చాలా బాగా ఉన్నాడు. ఫ్రాన్సిస్ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ ఏం చూపించలేదు. కంగువా క్యారెక్టర్ ని మాత్రం సూర్య చితకొట్టేశాడు అని చెప్పుకోవాలి. బాబీ డియోల్ క్యారెక్టర్ అంతగా ఏం ఇంపాక్ట్ చూపించలేదు. కానీ బాబీ డియోల్ వరల్డ్ ని రూత్ లెస్ గా చూపించారు. అదేదో బాబీ డియోల్ పాత్రను రూత్ లెస్ గా డిజైన్ చేసింటే బాగుండు అనిపించింది. హీరోయిన్ విషయానికి వస్తే దిశా పటాని పాత్ర అంతగా ఏం లేదు అని చెప్పుకోవాలి. మిగతా క్యారెక్టర్స్ ఎదో అలా వచ్చి వెళ్ళిపోతారు. సినిమా చివర్లో ఒక సస్పెన్స్ ఉంటుంది. అదే కార్తీ ఎంట్రీ, అస్సలు ఎవ్వరు ఊహించి ఉండరు. కార్తీ ఎంట్రీ కంగువా సినిమాకు మెయిన్ హైలైట్ అని చెప్పుకోవాలి.

పాజిటివ్స్

సినిమా ప్రొడక్షన్ వాల్యూస్, యాక్షన్ సీన్స్ మరియు విఎఫ్ఎక్స్ అద్భుతంగా తెరకెక్కించారు.
సినిమాటోగ్రఫీ
సూర్య గారు వన్ మాన్ షో అని చెప్పుకోవాలి.
సినిమా ఎండ్ లో కార్తీ ఎంట్రీ ఇస్తారు. కార్తీ ఎంట్రీ సీన్ అద్భుతంగా తెరకెక్కించారు.
దేవి శ్రీ ప్రసాద్ పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశాడు.

నెగటివ్స్

ఎడిటింగ్
స్టోరి
స్క్రీన్ ప్లే
డబ్బింగ్
డైరెక్షన్

కంగువా సినిమా ఓవర్ అల్ గా సినీ ప్రేక్షకుల్ని మరియు ఫ్యాన్స్ ని డిస్సపాయింట్ చేశారని చెప్పుకోవాలి.

Kanguva : మీడియా రిపోర్టర్ కి అందరిముందు క్షమాపణ చెప్పిన హీరో సూర్య.. అసలు ఏం జరిగింది..?

Hello Friends, My Name is Surya, I Am The Writer And Founder Of This Blog And Share All The Information Related To Entertainment Through This Website.

Sharing Is Caring:

Leave a Comment