K. Vijaya Bhaskar : నువ్వు నాకు నచ్చావ్ సినిమా తెర వెనుక విశేషాలు.. పలు ఆసక్తికర విషయాలు.. డైరెక్టర్ విజయ భాస్కర్ మాటల్లో..?

K. Vijaya Bhaskar : నువ్వు నాకు నచ్చావ్ సినిమా తెర వెనుక విశేషాలు.. పలు ఆసక్తికర విషయాలు.. డైరెక్టర్ విజయ భాస్కర్ మాటల్లో..? : దర్శకుడు విజయ భాస్కర్ నువ్వు నాకు నచ్చావ్ సినిమా తెర వెనుక విశేషాలు మరియు ఎవ్వరికి తెలియని నిజాలు పంచుకోవడం జరిగింది. ఆ విశేషాలు ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

K. Vijaya Bhaskar : నువ్వు నాకు నచ్చావ్ సినిమా తెర వెనుక విశేషాలు.. పలు ఆసక్తికర విషయాలు.. డైరెక్టర్ విజయ భాస్కర్ మాటల్లో..?

K. Vijaya Bhaskar : నువ్వు నాకు నచ్చావ్ సినిమా తెర వెనుక విశేషాలు.. పలు ఆసక్తికర విషయాలు.. డైరెక్టర్ విజయ భాస్కర్ మాటల్లో..?

దర్శకుడు విజయ భాస్కర్ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో నువ్వు నాకు నచ్చావ్ సినిమా తెర వెనుక విశేషాలు మరియు సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాల్ని పంచుకోవడం జరిగింది.

ఈ సినిమా ఎలా స్టార్ట్ అయ్యింది నువ్వే కావాలి తర్వాత మీరు మళ్ళీ మీ కాంబినేషన్ ఎలా కుదిరిందని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు విజయ్ భాస్కర్… నువ్వే కావాలి ఫైనల్ మిక్స్ జరుగుతున్నప్పుడు ప్రొడ్యూసర్ స్రవంతి రవి కిషోర్ గారు చెప్పారు. ఏదైనా పెద్ద హీరోకి సబ్జెక్ట్ గాని ఉంటే చెప్పండి. ఇలా వెంకటేష్ గారిని అప్రోచ్ అయ్యాం. వెంకటేష్ గారు ఓకే అన్నారు. సబ్జెక్ట్ వాళ్లకు నచ్చితే మనం ఓకే చేయచ్చు అని రవి కిషోర్ గారు అన్నారు. అప్పటికి కథ ఏం లేదు. అప్పటికే నేను స్వయంవరం మరియు నువ్వే కావాలి సినిమాలు చేశాను. పెద్ద హీరో అనగానే నేను ఎక్సైట్ అయిపోయాను. వెంకటేష్ గారు అంటే అప్పటికే పెద్ద హీరో ఎస్టాబ్లిషుడ్ హీరో. కథ చేసి చెప్దాం సర్ ఇన్స్టంట్ గా ఏదో చెప్పడం ఎందుకు అని రవి కిషోర్ గారితో అన్నాను. అప్పుడు కంటిన్యూ గా వెంకటేష్ గారి సినిమాలు అన్ని నేను త్రివిక్రమ్ చూశాం.

నాకు బాగా గుర్తు ఏంటంటే అప్పట్లో వెంకటేష్ గారి ప్రేమతో రా సినిమా థియేటర్లో ఆడుతుంది. ప్రేమతో రా సినిమా థియేటర్ కి వెళ్ళి చూశాం. అన్ని సినిమాల్లో ఆయన ఏం చేస్తారో అన్ని చూసి ఈయన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అని అనుకున్నాం. బేసిక్ గా నువ్వు నాకు నచ్చావ్ సినిమా కథ వెంకటేష్ గారి చుట్టూ అల్లిన కథ. ఆయన కోసమే తయారు చేసుకున్న కథ. ఇంకా అందులో ఫ్యామిలీని ఎమోషన్స్ ని తీసుకు వచ్చి ప్రొపెర్ గా ఫినిష్ చేశాం. బేసిక్ గా ఓన్లీ వెంకటేష్ గారి కోసమే రాసుకున్న కథ. ఎందుకంటే ఆయన్ని తప్ప వెంకీ క్యారెక్టర్ లో ఎవ్వరిని ఊహించుకోలేం. వెంకటేష్ గారి క్యారక్టరేజేషన్ కానీ ఆయన బిహేవియర్ కానీ చాలా సహజంగా ఉంటుంది. అదే ఆ సినిమాకు స్ట్రెంగ్త్.

K. Vijaya Bhaskar : నువ్వు నాకు నచ్చావ్ సినిమా తెర వెనుక విశేషాలు.. పలు ఆసక్తికర విషయాలు.. డైరెక్టర్ విజయ భాస్కర్ మాటల్లో..?
Image Source : Twitter / Addicted to TFI

నేను ఎప్పుడు నమ్మింది పెద్ద హీరో సినిమా అనగానే హీరోకు ఎలివేషన్ ఉండాలి. కానీ కెమెరాతో కాదు కథతో ఉండాలి. క్యారెక్టర్ పరంగానే ఆయనకు ఎలివేషన్ ఇవ్వాలి అనుకున్నాం. ఆయన చుట్టూ ఆయన కోసం అల్లిన కథ. నేను వెంకటేష్ గారిని తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేను. అంత పర్ఫెక్ట్ గా ఆయనకు మ్యాచ్ అయ్యింది. నేను ఊహించిన దానికంటే ఆయన 200% బాగా మెప్పించారు. ఎమోషనల్ సీన్స్ లో వెంకటేష్ గారు నేను ఊహించిన దానికంటే చాలా బాగా చేశారు. కథ రెడీ అయ్యిన తర్వాత ముందుగా రవి కిషోర్ గారికి చెప్పేవాళ్ళం. తర్వాత వెంకటేష్ గారికి సురేష్ బాబు గారికి చెప్పేవాళ్ళం. వాళ్ళు మాకు చాలా కంఫర్ట్ ఇచ్చేశారు. మీరు ఏం అనుకుంటున్నారో ఒకసారి చేసిన తర్వాత చెప్పండి అనేవారు.

కొన్నిచోట్ల డౌట్స్ వచ్చాయి. ఎందుకంటే హీరోకు ఆ అమ్మాయి మీద ప్రేమ ఉందా లేదా ఆ క్లారిటీ ఇవ్వకపోతే ఆడియన్స్ ని మనం కన్ఫ్యూజ్ చేసినట్టు ఉంటుంది. బట్ మేము నమ్మింది ఏంటంటే అదే మన సినిమా. మనసు నిండా ప్రేమ ఉంటుంది కానీ ఎక్స్ ప్రెస్ చేయరు. ఇదంతా చెప్పాలంటే మనకు బోలెడంత ఫ్రీడమ్ ఉండాలి. ఫ్రీడమ్ అంటే ఎక్కడికి తీసుకు వెళ్తాం ఇలా స్టార్ట్ అయిన క్యారెక్టర్ ని చివరికి ఎలా తీసుకెళ్తాం ఆ ఫ్రీడమ్ మాకు ఇచ్చారు. అందుకనే మేము కొత్త రకం క్యారక్టరేజేషన్ క్రియేట్ చేయగలిగాం. అంటే ఇదివరకు కామెడీ ట్రాక్ లు ఉండేవి. అది తీసేసి కామెడీ ట్రాక్ ఉండదు ఆయనే కామెడీ చేస్తారు. క్యారెక్టర్ లో కామెడీ ఉంటుంది. క్యారెక్టర్ లో కామెడీ ఉంటె మెమొరబుల్ గా ఉంటుంది.

వెంకటేష్ గారికి కథ చెప్తున్నప్పుడే ఆయన క్యారెక్టర్ ని పట్టేసుకున్నాడు. ఎందుకంటే నా సినిమా టైటిల్స్ కానీ క్యాప్షన్స్ కానీ అన్ని నావే. ఈ సినిమాకు నువ్వు నాకు నచ్చావ్ టైటిల్ కూడా నాదే కానీ క్యాప్షన్ మాత్రం వెంకటేష్ గారే ఇచ్చారు. ఆ క్యాప్షన్ ఏంటంటే ది న్యూ లవ్ స్టోరి. కథ అంత ఒక ఇంట్లో జరుగుతుంది. పక్కనే అవుట్ హౌస్ ఉంటుంది. వెంకటేష్ గారు అప్పటికే చాలా సినిమాల్లో ఇవన్నీ చూశారు. ఊటీ అయితే చాలా బాగుంటుంది అని వెంకటేష్ గారు సజెస్ట్ చేశారు. సో అక్కడి నుంచి బయటికెళ్లే సీక్వెన్స్ మొత్తం క్రియేట్ చేసి ఇక క్యారక్టరేజేషన్ లు అన్ని ఆటోమేటిక్ గా వచ్చేశాయి.

ఆర్తి అగర్వాల్ వీడియో క్యాసెట్స్ చూసే హీరోయిన్ గా డిసైడ్ చేశాం

K. Vijaya Bhaskar : నువ్వు నాకు నచ్చావ్ సినిమా తెర వెనుక విశేషాలు.. పలు ఆసక్తికర విషయాలు.. డైరెక్టర్ విజయ భాస్కర్ మాటల్లో..?
Image Source : Twitter / Ultra HD Movies

ఆర్తి అగర్వాల్ ని ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ చేశారు. ఆవిడను ఎలా అప్రోచ్ అయ్యారని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు విజయ భాస్కర్… అప్పుడే నేను నువ్వే కావాలి సినిమా హిందీలో చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఏదో హీరో కోసం వెతుకుతున్నాను. ఆ పనిమీద ముంబై వెళ్ళాను. అక్కడ ఒకాయన పాగల్ పన్ అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో ఆర్తి అగర్వాల్ నటిస్తుంది. ఆ సినిమాలోని ఒక ఫోటో నాకు చూపించారు. ఫోటో చూశాను ఈ అమ్మాయి బాగుంది. ఈ అమ్మాయిలో నాకు నందిని క్యారెక్టర్ కనిపిస్తుంది. కొత్త అమ్మాయి ఫ్రెష్ గా ఉంది చాలా బాగుంది అనిపించింది. నేను కూడా హీరోయిన్ కోసం వెతుకుతున్నాను. ఇంకా ఫైనలైజ్ కాలేదు.

ఆర్తి అగర్వాల్ ఫ్యామిలీ మొత్తం అమెరికాలో ఉంటారు. అక్కడే సెటిల్ అయ్యారు. కేవలం పాగల్ పన్ సినిమా కోసమే ఆర్తి అగర్వాల్ ముంబై వచ్చి వెళ్ళిపోయింది. నేను అప్పుడు పాగల్ పన్ సినిమా డైరెక్టర్ ని అడిగాను సినిమా రషెస్ ఏమైనా చూపించండి అని ఆయన చూపించలేదు. సురేష్ బాబు గారు స్రవంతి రవి కిషోర్ గారు ఆర్తి అగర్వాల్ ఫాదర్ కి ఫోన్ చేసి ఆమెను తీసుకురమ్మన్నారు. అప్పుడు వాళ్ళు ఆర్తి అగరవాల్ వీడియో కాస్సెట్స్ పంపించారు. కాస్సెట్స్ వేసుకొని చూశాం ఆర్తి అగర్వాల్ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. బాగుంది బాగా చేస్తుంది. మిగతాది అంత మన క్యారెక్టర్ లో ఉంది. మనం చేయించచ్చు అనిపించింది. నిజం చెప్పాలంటే ఆ వీడియో కాస్సెట్స్ అన్ని చూసిన తర్వాతే డిసైడ్ చేశాం.

డైనింగ్ టేబుల్ సీన్ ని ఐదు సార్లు ఐదు ముక్కలుగా తీశాం

అందుకే నేను ఆ డైనింగ్ టేబుల్ సీన్ చెప్పింది. ఆ సీన్ ని ఐదు సార్లు ఐదు ముక్కలుగా తీశాం. ఆర్తి అగర్వాల్ అమెరికాకు వెళ్ళకముందు తీశాం. ప్రకాష్ రాజ్ గారు వచ్చిన తర్వాత ఆయన షాట్ తీశాం. ఎమ్మెస్ నారాయణ గారు వచ్చాక ఒక షాట్ తీశాం. డేట్స్ ని బట్టి ఐదు సార్లుగా తీసింది. ఇద్దరు కెమెరామెన్ లతో తీశాం. ప్రకాష్ రాజ్ గారిని దృష్టిలో పెట్టుకొని రాసిన క్యారెక్టర్. ప్రకాష్ రాజ్ గారు చెప్పే కవిత వెటకారంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం క్లాసీగా ఉంటుంది. సునీల్ క్యారెక్టర్ బంతి అనే ముందే అనుకున్నాం. ఎమ్మెస్ నారాయణ గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు. ఆయన ఆ డైలాగ్ చెప్తుంటే చాలు పాత్రలో ఎమ్మెస్ నారాయణ గారు ఒదిగిపోతారు అంతే. ఆయన టైమింగ్ కి మ్యాచ్ అయ్యేట్టు రాశాం. క్యారెక్టర్ ఇలా బెహేవ్ చేయాలి అని చెప్పాను అంతే.

ముఖ్యంగా చెప్పాలంటే మ్యూజిక్ ఏదైనా సరే నాకు ఫీలింగ్స్ అంటే బాగా ఇష్టం. ఫీలింగ్ పండాలంటే మ్యూజిక్ ఉండాలి. మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు బ్యాక్ గ్రౌండ్ స్కోరులో అమృతం పోశారు. కోటి గారు ఆయన మ్యూజిక్ తో ఈ సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. అందుకే ఈ సినిమాలో సంగీతం సాహిత్యం అద్భుతంగా కుదిరింది. అంతే కాకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఉన్నమాట చెప్పలేను పాట ట్యూన్ చెప్పిన వెంటనే లిటరల్ గా నేను కోటి గారి పాదాల మీద పడిపోయాను అని దర్శకుడు విజయ భాస్కర్ తెలిపారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ఒక పాటలో మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత ఆ లైన్ వినగానే ఆయన పాదాలు నమస్కరించుకున్నాను అని డైరెక్టర్ విజయ భాస్కర్ అన్నారు.

Srikanth : పెళ్లి సందడి సినిమా తెర వెనుక విశేషాలు.. ఎవ్వరికి తెలియని నిజాలు.. హీరో శ్రీకాంత్ మాటల్లో..?

Hello Friends, My Name is Surya, I Am The Writer And Founder Of This Blog And Share All The Information Related To Entertainment Through This Website.

Sharing Is Caring:

Leave a Comment