Hanu Raghavapudi : సీతా రామం సినిమా తెర వెనుక విశేషాల్ని పంచుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి… : దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతా రామం సినిమా తెర వెనుక విశేషాల్ని పంచుకున్నాడు.
Hanu Raghavapudi : సీతా రామం సినిమా తెర వెనుక విశేషాల్ని పంచుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి…
సీతా రామం సినిమా విడుదల అయిన కొన్ని రోజుల తర్వాత ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి దర్శకుడు హను రాఘవపూడి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో హను రాఘవపూడి సీతా రామం సినిమా తెర వెనుక విశేషాల్ని పంచుకోవడం జరిగింది.
సీతా రామం సినిమా ఐడియా ఎలా స్టార్ట్ అయ్యింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు హను రాఘవపూడి… నేను ఎప్పుడు కోఠికి వెళ్లి బుక్స్ కొంటాను. బుక్స్ వివిపరీతంగా చదవడం మొదటి నుంచి అలవాటు. అలా 2007 లో ఒక బుక్ చదివాను. ఆ బుక్ లోని ఐడియా విపరీతంగా నచ్చింది. ఆ బుక్ లో ఐడియా ఏంటంటే మదర్ కొడుకు కోసం రాసిన లెటర్ అంతే కథ.
ఆ లెటర్ ఐడియా అనేది నాకు విపరీతంగా నచ్చింది. చాలా రోజులు ఆ కథ నన్ను వెంటాడుతూనే ఉంది. పడి పడి లేచే మనసు సినిమా టైం లో ఒక మూడు నెలలు టైం దొరికింది. అప్పుడు ఒక వెర్షన్ రాశాను. కానీ పూర్తిగా సంతృప్తిగా లేదు. సీతా రామం సినిమా కథ విషయంలో నా అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్ కుమార్ ఐడియాస్ కూడా చాలానే ఉన్నాయి అని దర్శకుడు హను రాఘవపూడి తెలిపారు.
సీతా రామం సినిమా స్క్రీన్ ప్లే రాజ్ కుమార్, జయ్ కృష్ణ, రుతం మరియు హను రాఘవపూడి సంయుక్తంగా రాశారు. ముఖ్యంగా డైలాగ్స్ విషయానికి వస్తే రవీంద్ర పూలే అద్భుతంగా రాశాడు మరియు అంతే కాకుండా లిరిసిస్ట్ కేకే కూడా డైలాగ్స్ అందించారు అని దర్శకుడు హను రాఘవపూడి తెలిపారు.
సీతా రామం సినిమా కథను స్వప్న దత్త్ కి ఎప్పుడు ఎలా వినిపించారని యాంకర్ ప్రశ్న అడిగారు. అందాల రాక్షసి టైం నుంచే స్వప్న సినిమా చేయమని అడుగుతూనే ఉంది. ఫైనల్ గా పడి పడి లేచే మనసు తర్వాత కుదిరింది. కథ స్వప్నకు విపరీతంగా నచ్చింది అని దర్శకుడు హను రాఘవపూడి తెలిపారు.
హీరో కోసం వేట మొదలు అయ్యింది. స్వప్న ఏమో దుల్క్యూర్ సల్మాన్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పడంతో కొచ్చి వెళ్ళి దుల్క్యూర్ సల్మాన్ కి నాలుగు గంటలు నరేషన్ ఇచ్చాను. నరేషన్ మొత్తం తెలుగు లోనే ఇచ్చాను. దుల్క్యూర్ సల్మాన్ కి ఏం అర్థం అయ్యిందో తెలీదు కానీ కథ బాగా నచ్చింది అని చెప్పారు. దుల్క్యూర్ సల్మాన్ స్వప్నకు ఫోన్ చేసి కథ నచ్చింది చేస్తున్న అని చెప్పారు.
సీత పాత్ర పూజ హెగ్దే చేయాల్సింది..?
ముందుగా సీత పాత్ర కోసం పూజ హెగ్దేని అనుకున్నాం. మళ్ళీ ఎక్కడో తెలియని పేస్ అయితే పాత్రకు న్యాయం జరుగుతుంది అని ఫీల్ అయ్యాము. సీత పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ పర్ఫెక్ట్ గ సరిపోతుంది అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పారు. సూపర్ 30 సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేసింది. ముంబైకి వెళ్ళి మృణాల్ ఠాకూర్ కు కథ వినిపించాను ఆమె చేస్తాను అని ఒప్పుకుంది. అలా సీత పాత్ర దొరికేసింది.
అఫ్రీన్ పాత్ర కోసం రష్మిక మందన్న పర్ఫెక్ట్ ఛాయిస్ అని స్వప్న అనడంతో వెళ్ళి రష్మిక మందన్నకు కథ చెప్పాను కానీ ఆమెను చూస్తుంటే సినిమా ఒప్పుకోదు ఏమో అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ డే ఏవో డౌట్స్ ఉన్నాయని రష్మిక మందన్న క్యారెక్టర్ గురించి అడిగింది. డౌట్స్ మొత్తం క్లియర్ చేశాక సినిమా చేస్తున్న అని చెప్పింది. అలా అఫ్రీన్ పాత్ర దొరికేసింది.
సీతా రామం సినిమాలో విష్ణు శర్మ ముఖ్యమైన పాత్ర. ఈ పాత్రను సుమంత్ చేస్తే బాగుంటుంది అని ఫీల్ అయ్యాము. ఆయన నరేషన్ స్క్రిప్ట్ ఉంటె పంపించు చదువుతాను అని చెప్పారు. స్క్రిప్ట్ చదివి నేను సినిమా చేస్తున్న అని చెప్పారు. సుమంత్ ఒక్కరే మొత్తం స్క్రిప్ట్ తెలిసింది మిగతా ఎవ్వరికి తెలీదు. సెకండ్ హాఫ్ మొత్తం మార్చేశాను. దుల్క్యూర్ సల్మాన్ కు చెప్పిన కథ పూర్తిగా వేరు అని హను రాఘవపూడి అన్నారు.
సీతా రామం సినిమాలో గౌతమ్ మీనన్ మేజర్ సెల్వన్ పాత్రను పోషించారు. ప్రకాష్ రాజ్ సీనియర్ ఆఫీసర్ పాత్రను పోషించారు. వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, భూమిక, ప్రియదర్శి మరియు మురళి శర్మ కీలక పాత్రలను పోషించారు.
ఈ సినిమాలో రష్మిక మందన్న పాత్రను ఇండియాను అసహ్యించుకునే పాత్ర అయితే బాగుంటుంది అని ప్రియాంక దత్త్ సజెస్ట్ చేశారు. అంతే కాకుండా ఈ సినిమా ఇంటర్వెల్ విషయానికి వస్తే మిస్సమ్మ సినిమా నుంచి తీసుకున్న ఎలిమెంట్ అని డైరెక్టర్ హను రాఘవపూడి అన్నారు.
సీతా రామం సినిమా మొత్తం క్రెడిట్ స్వప్న. ఎందుకంటే ఫస్ట్ నుంచి సపోర్ట్ చేయడం ఎంకరేజ్ చేయడం మంచి సినిమా చేస్తున్నాం అని, అంతే కాకుండా దర్శకుడిగా నా మీద నాకంటే స్వప్నకే ఎక్కువ నమ్మకం ఉంది హను రాఘవపూడి తెలిపారు.
సీతా రామం సినిమా బిగ్గెస్ట్ మ్యూజిక్ ఆల్బం గా నిలిచింది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు. పాటలే కాకుండా బాక్గ్రౌండ్ స్కోర్ ని అద్భుతంగా అందించారు. ఈ సినిమా పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి మరియు కేకే రాశారు.
సీతా రామం సినిమా షూటింగ్ మొదలు కానున్న సమయంలో కరోనా వచ్చింది. సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. కరోనా టైంలో కథను మళ్ళీ బాగా చెక్కము. కరోనాలో కథ విషయంలో టీం మొత్తం కాన్ఫిడెంట్ గా ఉండటానికి ఉపయోగపడింది.
సెకండ్ వేవ్ తర్వాత తెలుగులో సినిమాలు చాలానే విడుదల అయ్యాయి కానీ ఒక్కటి కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఒక్క సూపర్ హిట్ సినిమా లేదు. అప్పుడు సీతా రామం సినిమా ఆగష్టు 5 2022 న విడుదల అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల్ని అలరించడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులు, అభిమానులు, క్రిటిక్స్ మరియు సినీ హీరోలు సినిమా విజయం పట్ల అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు.
సీతా రామం సినిమా తెలుగు తమిళ్ మరియు మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల అయ్యింది. హిందీలో కొన్ని రోజుల తర్వాత విడుదల చేశారు. సీతా రామం సినిమాను 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద 98 కోట్లను కలెక్ట్ చేసింది.
సీతా రామం సినిమా పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయచ్చా…
సీతా రామం సినిమా పార్ట్ 2 ఏమైనా Expect చేయచ్చా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు హను రాఘవపూడి… పార్ట్ 2 వచ్చే ఛాన్స్ లేదు అని చెప్పేశారు.
క్లైమాక్స్ లో రామ్ పాత్ర చనిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. క్లైమాక్స్ లో రామ్ క్యారెక్టర్ చనిపోవాలి ఆ కథకి ఇంకో ఎండింగ్ లేదు అదే సరైన ఎండింగ్ నేను స్వప్న నే నమ్మాము. ఈ కథ ఆ అమ్మాయి చేతికి లెటర్ రావడం ఆనందకరమైన ఎండింగ్ అని దర్శకుడు హను రాఘవపూడి తెలిపారు.
Ram Charan : మగధీర తర్వాత రామ్ చరణ్ లవ్ స్టోరీనే కావాలని అడిగారని దర్శకుడు భాస్కర్ అన్నారు..!