Eeswar : ఈశ్వర్ సినిమా తెర వెనుక విశేషాలు.. ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న దర్శకుడు జయంత్ సి. పరాన్జీ..!

Eeswar : ఈశ్వర్ సినిమా తెర వెనుక విశేషాలు.. ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న దర్శకుడు జయంత్ సి. పరాన్జీ..! : దర్శకుడు జయంత్ సి. పరాన్జీ ఈశ్వర్ సినిమా తెర వెనుక విశేషాలు మరియు పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాల్ని పంచుకోవడం జరిగింది.

Eeswar : ఈశ్వర్ సినిమా తెర వెనుక విశేషాలు.. ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న దర్శకుడు జయంత్ సి. పరాన్జీ..!

ఈశ్వర్ సినిమాకు క్లాప్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్..!

ఈశ్వర్ సినిమా ఓపెనింగ్ కు జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు. ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ ఎన్టీఆర్ ని పిలిచాడు. అప్పటికే ఎన్టీఆర్ ఆది సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది అని అనిపించింది. అలా ఎన్టీఆర్ వచ్చాడు. సినిమాకు క్లాప్ కొట్టాడు. ఈశ్వర్ సినిమా ఓపెనింగ్ ముహూర్తం పూజ వేడుక రామానాయుడు స్టూడియోలో జరిగింది. అని దర్శకుడు జయంత్ సి. పరాన్జీ తెలిపారు.

Eeswar : ఈశ్వర్ సినిమా తెర వెనుక విశేషాలు.. ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న దర్శకుడు జయంత్ సి. పరాన్జీ..!

దర్శకుడు జయంత్ సి. పరాన్జీ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఈశ్వర్ సినిమా తెర వెనుక విశేషాలు మరియు ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాల్ని పంచుకోవడం జరిగింది.

ఈశ్వర్ సినిమా మీరు అండ్ దీన రాజ్ ఐడియా ఎలా స్టార్ట్ అయ్యింది ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ ని ఎలా అప్రోచ్ అయ్యారు అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు జయంత్ సి. పరాన్జీ… ఈశ్వర్ సినిమాకు ముందు వచ్చిన సినిమా టక్కరి దొంగ. టక్కరి దొంగ షూటింగ్ అప్పుడే ఒక సినిమా చేయమని అశోక్ తో ఒక కమిట్మెంట్ ఉండేది.

ఒక చిన్న సినిమా చేయాలి. బట్ అప్పుడు ఏంటి అంటే చాలామంది అందరు లవ్ స్టోరీస్ చేస్తున్నారు. నాకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టం. టక్కరి దొంగ సినిమా తర్వాత ఒక లవ్ స్టోరీ చేయాలనే ప్లాన్ ఉంది. ప్రొడ్యూసర్ గా అశోక్ కుమార్ కంఫర్మ్. ప్రొడ్యూసర్ ఆఫీస్ లో కథలు వినడం డిస్కస్ చేయడం మొదలు పెట్టాము.

ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దాం. తక్కువ బడ్జెట్ లో చిన్న సినిమా చేయాలనేది మొదటి నుంచి అనుకుంటున్నా ప్లాన్. అప్పటికి ఆల్రెడీ తేజ కొత్త వాళ్ళతో సినిమాలు ట్రెండ్ సెట్ చేశాడు. చిత్రం నువ్వు నేను సినిమాలు సక్సెస్ ఫుల్ గా చేశాడు. తేజ చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు అనుకున్న అని దర్శకుడు జయంత్ సి. పరాన్జీ తెలిపారు.

ఈశ్వర్ సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా ఎలా సెట్ చేశాం అంటే దూల్ పేట్ బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉంటుంది. ఓల్డ్ సిటీ కుర్రాడు. అలాంటి క్యారెక్టర్ అనేసరికి మాస్ ఏ వర్కౌట్ అవుతుంది. ఎవరు ఎవరు అని ఒక 3 నెలలు ఫొటోస్ పట్టుకొని ప్రొడ్యూసర్ ఆఫీస్ కి క్యూ కట్టే వాళ్ళు కుర్రాళ్ళు కానీ ఎక్కడో నచ్చట్లేదు.

ఒకరోజు ప్రొడ్యూసర్ అశోక్ గబా గబా ఆఫీస్ కి వచ్చాడు. ఆఫీస్ కు వచ్చి జయంత్ నీతో మాట్లాడాలి అన్నాడు. నేను చెప్పు అన్నాను. కృష్ణం రాజు తమ్ముడు కొడుకు సత్యానంద్ గారి దగ్గర ట్రైన్ అయ్యి ఇప్పుడే హైదరాబాద్ కు వచ్చాడు. కలుస్తావా అని అశోక్ అడిగాడు. ముందు ఫొటోస్ తెప్పించామన్నా ఫోటోలు వచ్చాయి బాగున్నాడు కుర్రాడు. కుర్రాడు వెరీ ఫొటోజెనిక్ బాయ్ అని అనుకున్న దర్శకుడు జయంత్ సి. పరాన్జీ తెలిపారు.

సత్యానంద్ గారికి ఫోన్ చేశాను. జయంత్ స్పార్క్ ఉంది ఆ కుర్రాడు లో, కలువు నువ్వు ఒకసారి మీది ఏ టైపు అఫ్ కథ నాకు తెలీదు అని సత్యానంద్ అన్నారు. బట్ డెఫినిట్ గా ఫైర్ ఉంది స్పార్క్ ఉంది ఆ కుర్రాడిలో అని సత్యానంద్ అన్నారు. ప్రభాస్ ని కలిసే ముందే సత్యానంద్ గారు చెప్పారు.

ప్రభాస్ పెద్ద స్టార్ అవుతాడని అప్పుడే అనుకున్నా…

ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ ప్రభాస్ తో మీటింగ్ సెట్ అప్ చేశాడు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఉన్న బరిస్టా కఫ షాప్ లో ప్రభాస్ ని కలిశాను. అక్కడికి వెళ్తే ప్రభాస్ అక్కడికి ఆల్రెడీ వచ్చి కూర్చున్నాడు. అప్పుడే అక్కడే ప్రభాస్ ని మొదటిసారిగా కలవడం. చూడగానే ఇమ్మీడియేట్ గ పెద్ద స్టార్ అవుతాడు అనిపించింది. యాక్టింగ్ లో ఎప్పుడు నుంచి ట్రైన్ అవుతున్నావని ప్రభాస్ ని అడిగాను. నేను ఇంకా ట్రైన్ అవ్వలేదు అండి ఇంకా కొంచెం టైం కావాలి అన్నాడు.

ప్రభాస్ నీకు ట్రైనింగ్ అవసరం లేదు అన్నాను. కథ కూడా అడగలేదు ప్రభాస్, ఒక థాట్ చెప్పాను లవ్ స్టోరీ మాస్ ధూల్ పేట్ బ్యాక్ డ్రాప్ అని చెప్పాను. ప్రభాస్ కి పాయింట్ లాగే చెప్పాను. సీన్స్ కానీ డైలాగ్స్ కానీ అడగలేదు. ప్రభాస్ నన్ను గుడ్డిగా నమ్మి దూకాడు అని దర్శకుడు జయంత్ సి. పరాన్జీ తెలిపారు.

ప్రభాస్ ఫాదర్ కానీ కృష్ణం రాజు గారు కానీ వాళ్ళ ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు జయంత్ సి. పరాన్జీ… వాళ్లిద్దరూ ఏమి చెప్పలేదు టోటల్ గా నామీద వదిలేశారు. నామీద నమ్మకం పెట్టుకున్నారు. అశోక్ ఆల్రెడీ ప్రూవ్డ్ ప్రొడ్యూసర్. నాతో ప్రేమంటే ఇదేరా అశోక్ ఏ ప్రొడ్యూస్ చేశారు. వాళ్లకు తెలుసు అశోక్ మంచి ప్రొడ్యూసర్ అని, మా అబ్బాయిని మీ చేతుల్లో పెడుతున్నాం అని ప్రభాస్ ఫాదర్ గారు ఒక మాట చెప్పారు అంతే.

ప్రభాస్ ని కాఫీ షాప్ లో కలిసినప్పుడు తమాషా ఏంటి అంటే ప్రభాస్ ఇంకో కుర్రాడు తో కలిసి వచ్చాడు. ఆ కుర్రాడు పేస్ నాకు అస్సలు గుర్తుకు లేదు. అసలు ఆ టైంలో ప్రభాస్ ని తప్ప ఇంకెవ్వరిని చూడలేదు. ప్రభాస్ నే చూస్తూ ఉండిపోయాను. ప్రభాస్ స్టార్ అవుతాడని నాకు అప్పుడే అర్థం అయ్యింది.

ఇది నీ లాంచ్ ఫిలిం అని అలా అనుకోవద్దు అని ప్రభాస్ కి ముందే చెప్పాను. కథను పట్టుకొని వెళ్ళిపోతున్నాం అని చెప్పా ప్రభాస్ ఓకే సర్ అన్నాడు. ప్రభాస్ కి టక్కరి దొంగ సినిమా బాగా నచ్చింది. నేను నమ్మలేకపోతున్న టక్కరి దొంగ డైరెక్టర్ తో పనిచేస్తున్న అని, ఆ సినిమా ఆడలేదు అన్నాను. ప్రభాస్ ఫెంటాస్టిక్ ఫిలిం సర్ అది అని అనేవాడు. ప్రభాస్ నన్ను గుడ్డిగా నమ్మేశాడు అని దర్శకుడు జయంత్ సి. పరాన్జీ అన్నారు.

Eeswar : ఈశ్వర్ సినిమా తెర వెనుక విశేషాలు.. ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న దర్శకుడు జయంత్ సి. పరాన్జీ..!
Image Source : Twitter / Only Movies News

హీరోయిన్ శ్రీదేవి ఎలా వచ్చారు ఆమె మొదటి తెలుగు సినిమా తమిళ్ లో ఒక సినిమా చేశారు అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు జయంత్ సి. పరాన్జీ… ఫ్రెండ్ సర్కిల్ నుంచి వచ్చింది. అది కాకుండా విజయ్ మంజుల గారి అమ్మాయి, బాగుంది చూడటానికి అనిపించింది. హీరోయిన్ పాత్ర ఎలాంటిది అంటే ఇన్నోసెంట్ పేస్ ప్రపంచం తెలియని అమ్మాయి పాత్ర, పెద్ద కళ్ళు బాపు గారి బొమ్మల ఉండాలి అన్నది మైండ్ లో ఉండింది.

శ్రీదేవి తమిళ్ లో ఒక సినిమా చేసింది అప్పటికి రిలీజ్ కాలేదు. ఆ సినిమాలోని కొన్ని సీన్స్ చూపించారు. చూడగానే ఇమ్మీడియేట్ గా హీరోయిన్ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించింది. ఆ అమ్మాయి పెద్ద కళ్ళు బిగ్ అడ్వాంటేజ్ అని దర్శకుడు జయంత్ సి. పరాన్జీ అన్నారు.

ఒక రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న థియేటర్ లో షూట్ చేశాం. థియేటర్ కి వెళ్లి గోల గోల చేయటం టికెట్స్ చింపడం అలాగే థియేటర్ బయట స్ట్రీట్ లో ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేశాం. ఒక్కరోజే ఉండింది ఆ లొకేషన్, ఎక్సటెరియర్ సీన్ ఇంటీరియర్ సీన్ బయట ఫైట్ సీన్ ఫస్ట్ డే నే ప్రభాస్ టప టప అనే చేసేశాడు. చాలా ఫాస్ట్ గా ప్రభాస్ చేసేవాడు. ఒకటి లేక రెండు టేక్స్ లోనే ప్రభాస్ చేసేవాడు.

Balakrishna : చెన్నకేశవ రెడ్డి సినిమా తెర వెనుక విశేషాలు.. ఎవ్వరికి తెలియని నిజాలు.. దర్శకుడు వివి వినాయక్ మాటల్లో..?

Hello Friends, My Name is Surya, I Am The Writer And Founder Of This Blog And Share All The Information Related To Entertainment Through This Website.

Sharing Is Caring:

Leave a Comment