Dil Raju : పుష్ప 2 తర్వాత సుకుమార్ కేర్ తీసుకోని చేయబోయే సినిమా ఏది, 2025 లో దిల్ రాజు ప్రొడక్షన్ లో రిలీజ్ కానున్న సినిమాలు..?

Dil Raju : పుష్ప 2 తర్వాత సుకుమార్ కేర్ తీసుకోని చేయబోయే సినిమా ఏది, 2025 లో దిల్ రాజు ప్రొడక్షన్ లో రిలీజ్ కానున్న సినిమాలు..? : ప్రొడ్యూసర్ దిల్ రాజు తాజాగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో దిల్ రాజు తన రాబోయే సినిమాల విడుదల తేదీలను మరియు జీనియస్ డైరెక్టర్ సుకుమార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దిల్ రాజు. ఆ విశేషాలు ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

Dil Raju : పుష్ప 2 తర్వాత సుకుమార్ కేర్ తీసుకోని చేయబోయే సినిమా ఏది, 2025 లో దిల్ రాజు ప్రొడక్షన్ లో రిలీజ్ కానున్న సినిమాలు..?

Dil Raju : పుష్ప 2 తర్వాత సుకుమార్ కేర్ తీసుకోని చేయబోయే సినిమా ఏది, 2025 లో దిల్ రాజు ప్రొడక్షన్ లో రిలీజ్ కానున్న సినిమాలు..?

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఆ ప్రెస్ మీట్ లో ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా మరియు సినీ క్రిటిక్స్ పాల్గొన్నారు. ఆ ప్రెస్ మీట్ లో దిల్ రాజు ఆసక్తికర విషయాల్ని పంచుకోవడం జరిగింది.

ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ… ఈ ప్రెస్ మీట్ చాలా స్పెషల్ ఎందుకంటే గేమ్ ఛేంజెర్ టీజర్ రిలీజ్ చేశాం. గేమ్ ఛేంజెర్ సినిమా సంక్రాతి కానుకగా జనవరి 10 2025 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అలాగే మా బ్యానర్ అండర్ ప్రొడక్షన్ లో నాలుగు సినిమాలు ఉన్నాయి. గేమ్ ఛేంజెర్ సినిమాతో ఐదు సినిమాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం. అలాగే నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం తమ్ముడు శివరాత్రి కానుకగా రిలీజ్ చేస్తున్నాం. అన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ లాక్ చేసుకొని ఫుల్ హడావిడిగా ఉన్నాం.

అలాగే దిల్ రాజు ప్రొడక్షన్స్ లో డాన్స్ మాస్టర్ యష్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాం. కొత్త డైరెక్టర్ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేయాలి. వెరీ గుడ్ కంటెంట్ ఫిలిం అది. సినిమా మంచిగా వచ్చేంతవరకు కేర్ తీసుకోని మరి చేస్తున్నాం. రిజల్ట్ ఎలా తీసుకురావాలి ఆ సినిమాకు కుడా అని ఆలోచిస్తున్నాం.

అలాగే ఆశిష్ హీరోగా నటిస్తున్న సెల్ఫిష్ సినిమా 50% షూటింగ్ పూర్తి అయ్యింది. సెల్ఫిష్ సినిమా షూటింగ్ ని ఆపడం జరిగింది. ఎందుకంటే సుకుమార్ గారు పుష్ప 2 అయిపోయేవరకు హోల్డ్ చేయండి అని చెప్పారు. సెల్ఫిష్ సినిమా డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా చేశారు. సుకుమార్ దగ్గర ఉండి స్పెషల్ కేర్ తీసుకోని ఆ సినిమాను పూర్తి చేయాలని అనుకున్నారు. ప్రస్తుతానికి ఈ ఐదు ప్రాజెక్ట్స్ 2025 లో రిలీజ్ కాబోతున్నాయి.

బలగం వేణు డైరెక్షన్ లో హీరో నితిన్ ఎల్లమ్మ సినిమా

ఈ ఐదు ప్రాజెక్ట్స్ పూర్తి అయ్యాక విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాం. ఈ సినిమా 2025 లో మొదలు అయ్యి 2026 లో రిలీజ్ కానుంది. అలాగే నితిన్ హీరోగా బలగం వేణు డైరెక్షన్ లో ఎల్లమ్మ అనే సినిమా చేస్తున్నాం. ఎల్లమ్మ సినిమా ప్రాజెక్ట్ ఫైనల్ చేశాం. ఎల్లమ్మ సినిమా 2025 బిగినింగ్ లో స్టార్ట్ చేసి దసరాకి రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నాం. ఇవి కాకుండా ఇంకా రెండు మూడు ప్రాజెక్ట్స్ స్క్రిప్ట్స్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాం అని ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలిపారు.

The Raja Saab : ఫ్యాన్స్ ని డిస్సపాయింట్ చేసిన రాజాసాబ్ మోషన్ పోస్టర్ వీడియో : టీజీ విశ్వప్రసాద్

Hello Friends, My Name is Surya, I Am The Writer And Founder Of This Blog And Share All The Information Related To Entertainment Through This Website.

Sharing Is Caring:

Leave a Comment