Dasaradh : మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా తెర వెనుక విశేషాలు.. ప్రభాస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు దశరథ్..?

Dasaradh : మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా తెర వెనుక విశేషాలు.. ప్రభాస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు దశరథ్..? : దర్శకుడు దశరథ్ మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా తెర వెనుక విశేషాలు మరియు ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకోవడం జరిగింది.

Dasaradh : మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా తెర వెనుక విశేషాలు.. ప్రభాస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు దశరథ్..?

Dasaradh : మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా తెర వెనుక విశేషాలు.. ప్రభాస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు దశరథ్..?

దర్శకుడు దశరథ్ మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా తెర వెనుక విశేషాలు మరియు ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకోవడం జరిగింది.

దర్శకుడు దశరథ్ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా తెర వెనుక విశేషాలు పంచుకోవడం జరిగింది. మిస్టర్ పర్ ఫెక్ట్ కథ ఎక్కడ స్టార్ట్ అయ్యింది. కథ భీజం ఎక్కడ పడింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు దశరథ్…

పెళ్లిళ్లకు సంబంధించి ఏదైనా సినిమా చేయాలని ఉంది. ఈ జనరేషన్ వాళ్లకి ఏంటి సమస్యలు వాటిని బేస్ చేసి ఏదైనా చేయాలని ఉంది అని దిల్ రాజు గారు అన్నారు. అదే టైంలో నేను కూడా ఒక లైన్ పైన వర్క్ చేస్తున్నాను. అసలు ఒకప్పుడు బాల్య వివాహాలు జరుగుతుండేవి. తర్వాత పేరెంట్స్ డిసైడ్ చేసి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మూడు నిమిషాలు పెళ్లి చూపుల్లో నిర్ణయాలు తీసుకున్నోళ్ళు హ్యాపీగా ఉన్నారు.

ఈ జనరేషన్ లో మేము సినిమా తీస్తున్న టైంలో లివింగ్ టు గెదర్ స్టార్ట్ అయ్యింది. కలిసి తిరుగుతున్నారు. సంవత్సరాల పాటు కలిసి ఉంటున్నారు. పెళ్లి చేసుకోగానే ప్రాబ్లెమ్స్ వస్తున్నాయి. ఏమై ఉంటాది అనే పాయింట్ పైన వర్క్ చేస్తున్నాను. ఈ కాన్వాస్ పట్టుకొని లవ్ స్టోరి చేద్దాం అని అనుకున్నాను. ఇదే పాయింట్ దిల్ రాజు గారు కి చెప్పాను. ఆయనకు పాయింట్ విపరీతంగా నచ్చింది.

ఈ పాయింట్ మీద వర్క్ చేశాం. ఫస్ట్ హాఫ్ మొత్తం రెడీ చేసి దిల్ రాజు గారికి వినిపించాను. ఆయనకు విన్నాక నచ్చింది. ఇమ్మీడియేట్ గా అదే రోజు మధ్యాహ్నం దిల్ రాజు గారు ప్రభాస్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇలా మేము ఇద్దరం కలిసి ఒక చేస్తున్నాం సెకండ్ హాఫ్ అయ్యాక వచ్చి చెప్తాం అని ప్రభాస్ కి దిల్ రాజు చెప్పారు.

సెకండ్ హాఫ్ కూడా పూర్తి అయ్యింది. ప్రభాస్ బిల్లా సినిమా షూటింగ్ జరుగుతుంది. నేను దిల్ రాజు శిరీష్ గారు ముగ్గురం కలిసి మలేసియాకు వెళ్లి ప్రభాస్ కు కథ చెప్పడం జరిగింది. ప్రభాస్ కొంత పార్ట్ నచ్చింది. కొంత పార్ట్ మీద డౌట్స్ ఉన్నాయి. ఇంకా ఇవి బెటర్ కావాలని అడిగారు. ప్రభాస్ చెప్పిన పాయింట్స్ మీద వర్క్ చేశాము. ప్రభాస్ బిల్లా షూట్ ఫినిష్ చేసుకొని 30 డేస్ తర్వాత మలేసియా నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ప్రభాస్ వచ్చిన మూడవ రోజే ఆయన్ని కలిసి కథ చెప్పడం జరిగింది. ఇన్స్టంట్ గా ప్రభాస్ గారు చేస్తాను అన్నారు. అలా మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా మొదలు అయ్యింది.

మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా రైటర్స్ గురించి చెప్పండి అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు దశరథ్… నేను రైటర్ గోపికిషోర్ ఫస్ట్ హాఫ్ కలిసి రాసుకున్నాం. ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యే టైంలో హరి జాయిన్ అయ్యాడు. హరికి మొదటి సినిమా స్క్రీన్ ప్లే రైటర్ గా పేరు పడటం. సాల్మోన్ అనే రైటర్ కూడా ఒక వారం పని చేశారు. డైరెక్టర్ బాబీ ఎంటర్టైన్మెంట్ సైడ్ చాలా హెల్ప్ చేశాడు.

ప్రత్యేకంగా డైలాగ్స్ గురించి చెప్పాలంటే అబ్బూరి రవి గారు అద్భుతంగా రాశారు. అబ్బూరి రవి ఆల్రెడీ దిల్ రాజు గారి బ్యానర్ లో బొమ్మరిల్లు సినిమా చేశాడు. దిల్ రాజు గారి బ్యానర్ లో అబ్బూరి రవి డైలాగ్ రైటర్ గా రెగ్యులర్ గా చేసేవాడు. అంతే కాకుండా ఈ సినిమాలో దిల్ రాజు మరియు ప్రభాస్ ఇన్పుట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి.

నేనే మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ కావాలని అడిగాను. బొమ్మరిల్లు సినిమా తర్వాత దేవి శ్రీ ప్రసాద్ దిల్ రాజు గారి బ్యానర్ లో చేయలేదు. చాలా గ్యాప్ వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ తో వెళ్దాం అని నేను అన్నాను. దిల్ రాజు గారు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. అలా దేవి శ్రీ ప్రసాద్ వచ్చారు.

Dasaradh : మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా తెర వెనుక విశేషాలు.. ప్రభాస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు దశరథ్..?
Image Source : Twitter / MOVIE KOMPANY

కాజల్ ప్లేస్ లో ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ ని అనుకున్నాం

హీరోయిన్ విషయానికి వస్తే కాజల్ ప్లేస్ లో ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ అని అనుకున్నారు. ఒక ఐదు రోజులు కూడా షూట్ చేశారంటా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు దశరథ్… ఎందుకు జరిగిందో రీప్లేస్మెంట్ కారణాలు నాకు తెలీదు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ చాలా మంచి పెర్ఫార్మెర్. స్క్రీన్ మీద చాలా అందంగా ఉంది. డెడికేటెడ్ గా కష్టపడి చేస్తుంది. అంతా బాగుంది.

రకుల్ ప్రీత్ సింగ్ తో నాలుగు రోజులు షూట్ చేశాము. తర్వాత షూటింగ్ కి ఒక పది రోజులు బ్రేక్ వచ్చింది. ఈ గ్యాప్ లో కొంతమంది బయటి వాళ్ళకి దిల్ రాజు గారు రషెస్ చూపించారు. రషెస్ చూపించక బయటి వాళ్ళు ఏం అన్నారో తెలీదు. సడన్ గా కొత్త వాళ్ళు వద్దు మనం రెగ్యులర్ వాళ్ళతో వెళ్దాం అనే సెన్స్ లో దిల్ రాజు గారు మాట్లాడారు. తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఆమె డెబ్యూట్ సినిమా ఆడియో ఫంక్షన్ కి నేను ప్రభాస్ వెళ్ళాము అని దర్శకుడు దశరథ్ అన్నారు.

Dasaradh : మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా తెర వెనుక విశేషాలు.. ప్రభాస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు దశరథ్..?
Image Source : Twitter / Sri Venkateswara Creations

తాప్సీ ని చూడగానే ఫిక్స్ అయ్యాం

హీరోయిన్ తాప్సీ అప్పటికే రాఘవేంద్ర రావు గారి సినిమా ఝుమ్మంది నాదం సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. తాప్సీ రెండు మూడు ఫోటోలు బయటికి వచ్చాయి. అప్పుడు ఆ అమ్మాయి యంగ్ గా మోడర్న్ గా బాగుంది అనుకున్నప్పుడు మన సినిమాలోని పాత్రకు కూడా బాగుంటుంది అని వెళ్లి నరేషన్ ఇచ్చాను. తాప్సీ కి కథ నచ్చింది. వెంటనే చేస్తాను అని చెప్పింది. అని దర్శకుడు దశరథ్ తెలిపారు.

సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే ముందుగానే అందరి పేర్లు రాసుకున్నాం అన్ని పాత్రలకు వాళ్ళనే అప్రోచ్ అయ్యాం. ఫస్ట్ డే షూట్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. హీరోయిన్ హౌస్ సెట్ వేశాము. మధ్యలో ఒక 40 డేస్ షూట్ ఆగిపోయింది. అప్పుడు బడ్జెట్ సమ్మె ఏదో జరిగింది. అంతే తప్ప మళ్ళీ షూటింగ్ కి ఏ బ్రేక్ రాలేదు.

మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమాలో మీకు ఛాలెంజింగ్ సీన్స్ ఏమైనా అనిపించాయా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు దశరథ్… అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ ఛాలెంజింగ్ గా అనిపించింది. ఎందుకంటే అంతకు ముందు ఎప్పుడు నేను అలాంటివి తెరకెక్కించలేదు. ఎలా తెరకెక్కిస్తారో కూడా తెలీదు. మొదట్లో అర్థం కాలేదు. నెక్స్ట్ డే కి అవగాహన వచ్చింది.

అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే తాప్సీ ఇంట్రడక్షన్ సీన్ ఆస్ట్రేలియా లోని కియామో అనే ఊరిలో తీశాము. దానికోసం ఛాపర్ వాడాము. ఆరోజు విపరీతమైన గాలి కూడా ఉంది. మిషన్ ఇంపాసిబుల్ 3 క్లైమాక్స్ చేసిన ఆయన ఆ సీక్వెన్స్ అంత షూట్ చేశారు అన్న మాట. ఆ స్టంట్ అంతా అతను కొరియోగ్రాఫ్ చేశాడు. రెండు రోజులు ఆ సీక్వెన్స్ షూట్ చేశాము. చాలా స్ట్రెస్ ఫుల్ మూమెంట్ అది అని దర్శకుడు దశరథ్ తెలిపారు.

ప్రభాస్ కాజల్ కెమిస్ట్రీ బాగా కుదిరిందని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు దశరథ్… అప్పుడే డార్లింగ్ సినిమా రిలీజ్ అయ్యింది. డార్లింగ్ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య జరిగే చిలిపి తగాదాలు ఉంటాయి. అదే విధంగా మన సినిమాలో కూడా సేమ్ సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ టైం కి వాళ్ళిద్దరికీ ఒక సినిమా చేసిన అడ్వాంటేజ్ ఉంది. ప్రభాస్ కాజల్ ఇద్దరు అద్భుతంగా చేశారు.

ప్రభాస్ గారిని మొదటిసారిగా సొంతం మూవీ ఆడియో ఫంక్షన్ లో చూశాను. అబ్బా భలే ఉన్నాడు ఎవరు ఈ అబ్బాయి అని అనిపించింది. అప్పుడు ఇంకా ఈశ్వర్ సినిమా జరుగుతుంది. తర్వాత నాకు వర్షం సినిమా నాకు చాలా నచ్చిన సినిమా. అలాంటిది ఆవకాశం వచ్చింది. ఎలాగైనా అవకాశం మిస్ చేసుకోవద్దు అనుకున్న, ఆన్ కెమెరా ప్రభాస్ కి ఆఫ్ కెమెరా ప్రభాస్ కి డిఫరెన్స్ ఏం ఉండదు.

Srinu Vaitla : ఆనందం సినిమా తెర వెనుక విశేషాలు.. మీకు తెలియని నిజాలు దర్శకుడు శ్రీను వైట్ల మాటల్లో..?

Hello Friends, My Name is Surya, I Am The Writer And Founder Of This Blog And Share All The Information Related To Entertainment Through This Website.

Sharing Is Caring:

Leave a Comment