Bhaskar : బొమ్మరిల్లు సినిమా గురించి మీకు తెలియని నిజాలు.. దర్శకుడు భాస్కర్ మాటల్లో..? : దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తన మొదటి సినిమా బొమ్మరిల్లు తెర వెనుక విశేషాలు మరియు పలు ఆసక్తికర విషయాలు పంచుకోవడం జరిగింది.
బొమ్మరిల్లు స్టోరి మొదట అల్లు అర్జున్ కు చెప్పాం కానీ…
దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా బొమ్మరిల్లు కథ ముందుగా అల్లు అర్జున్ కి వినిపించారంటగా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు భాస్కర్… బొమ్మరిల్లు ఫస్ట్ వెర్షన్ కథ అల్లు అర్జున్ కి చెప్పాము. అప్పటికి క్యారెక్టర్లు డెవలప్ చేస్తున్నాం. అలా అల్లు అర్జున్ తో సినిమా చేయడం కుదరలేదు అని దర్శకుడు భాస్కర్ తెలిపారు.
Bhaskar : బొమ్మరిల్లు సినిమా గురించి మీకు తెలియని నిజాలు.. దర్శకుడు భాస్కర్ మాటల్లో..?
దర్శకుడు భాస్కర్ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో బొమ్మరిల్లు సినిమా తెర వెనుక విశేషాలు మరియు ఎవ్వరికి తెలియని నిజాలు పంచుకోవడం జరిగింది.
బొమ్మరిల్లు ఐడియా ఎలా వచ్చింది. అలాగే దిల్ రాజు గారిని ఎలా అప్రోచ్ అయ్యారని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు భాస్కర్… నేను ఫిలిం ఇన్స్టిట్యూట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడే రాసిన ఐడియా. పర్సనల్ ఇన్సిడెంట్స్ లో నుంచి వచ్చిన ఐడియా అది.
ఒక మంచి ఫ్యామిలీ ఒక మంచి అమ్మాయి ఈ అమ్మాయిని ఎందుకు ఒప్పుకోరు అనేది నా క్వశ్చన్ మైండ్ లో వచ్చింది అన్న మాట. ఎందుకంటే ఈ అమ్మాయి ఎవరు అన్నది ఫ్యామిలీకి తెలీదు. లవ్ చేస్తున్న వ్యక్తి రోజు కలుస్తున్నాడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ అమ్మాయి గురించి తెలుసు ఈ అమ్మాయి ఎలాంటిది అని కానీ ఫ్యామిలీకి తెలీదు ఆ అమ్మాయి ఏంటో అప్పుడు ఒక వారం రోజులు టైం స్పెండ్ చేస్తే వీడికి ఎందుకు నచ్చింది అనేది అర్థం అవుతుంది.
అలా మొదటగా వచ్చిన ఐడియా. అలా ఒక అమ్మాయిని ఏడు రోజులు ఇంటికి తీసుకెళ్తే ఏమవుతుంది అనేది ఒక ఐడియా గా స్టార్ట్ అయ్యింది. తర్వాత ఏంటంటే అందులో ఒక ఫాదర్ సన్ ఎలాంటి ఫ్యామిలీ ఎలాంటి ఫాదర్ ఎలాంటి సన్ ఎలాంటి వాడు అనే క్యారక్టరేజషన్ రాసేటప్పుడు ఫాదర్ కి సన్ కి మధ్య ఉన్న ప్రాబ్లెమ్ ఇష్యూ తీసుకోని దాంట్లో ఈ అమ్మాయిని కలపడం జరిగింది.
సో అలా ఒక స్ట్రక్చర్ ఫార్మ్ అయ్యింది. ఫస్ట్ ఐడియా బేసిక్ గా ఎందుకు ఒప్పుకోరు అనే థాట్ నుంచి వచ్చిన ఐడియా. ఫాదర్ అండ్ సన్ విషయానికి వచ్చేసరికి నచ్చింది చేయలేకపోతే ఎంత టార్చర్ ఉంటాది. ఇంకోటి ఏంటి అంటే నచ్చింది చేయద్దు అని చెప్పే ఫాదర్ అయితే పర్లేదు. కానీ మంచి ఫాదర్ ఆయన, అది కూడా పర్సనల్ గా అనుభవించాను కాబట్టి, ఎంత గొప్ప విషయం ఇచ్చిన కూడా అది నచ్చింది ఇవ్వకపోతే వాళ్ళు సాటిస్పై అవ్వరు.
ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి ఎలా అంటే రాజు గారు దిల్ అప్పటి నుంచే పరిచయం. సుకుమార్ తో ఆర్య సినిమా చేస్తున్నప్పుడు రాజు గారితో ట్రావెల్ అయ్యాను. ఒక 15 డేస్ వర్క్ చేశాను. కేరళ లో ఆర్య సినిమా షెడ్యూల్ ప్యాకప్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాం. అప్పుడు రాజు గారు అన్నారు. ఆర్య సినిమా హిట్ అయితే నీకు సినిమా ఇస్తా నువ్వు చేసేయ్ అమ్మ అన్నారు.
ఆర్య సినిమా హిట్ అయ్యింది ఇమ్మీడియేట్ గా కథ చెప్పామన్నారు. రెండు కథలు చెప్పాను. ఫ్యామిలీ స్క్రిప్ట్ ఏదైనా చేద్దాం అన్నారు. అప్పుడు ఈ కథ చెప్పగానే దిల్ రాజు గారికి విపరీతంగా నచ్చింది. అలా బొమ్మరిల్లు సినిమా పట్టాలెక్కింది. అని దర్శకుడు భాస్కర్ తెలిపారు.
బొమ్మరిల్లు స్క్రిప్ట్ లాక్ చేశాక కూడా మళ్ళీ రీరైట్ చేశారంట అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు భాస్కర్… హీరోయిన్ క్యారక్టరేజషన్ ఎలా చేద్దాం అన్నది ఒక డిస్కషన్ జరుగుతూ ఉన్నది. ఫస్ట్ ఒక వెర్షన్ చేసేశాం. ఫుల్ గా రాసుకున్నాం ఆల్మోస్ట్ ఓకే స్క్రిప్ట్ అంత షూట్ కి వెళ్ళిపోదాం అనే రేంజ్ కి వచ్చేసరికి ఎక్కడో కొడతా ఉంది. ఏదో కరెక్ట్ గా లేదు అనిపించింది.
అప్పుడు దిల్ రాజు గారికి కొన్ని రోజులు ఆపండి సర్ అన్నాను. రివర్క్ చేస్తాను. అమ్మాయి క్యారక్టరేజషన్ ఏదో ఇంకా మిస్ అవుతుంది అనే ఫీలింగ్. ఒక 15 డేస్ టైం అడిగాను. నేను వాసు వర్మ ఇద్దరం దిల్ రాజు ఫార్మ్ హౌస్ లో వెళ్లి కూర్చున్నాం. ప్రతి రోజు ఏదోకటి మాట్లాడుతూనే ఉండే వాళ్ళం. అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలి అనే చెప్తూనే ఉన్నాం అన్న మాట. 15 డేస్ లో నేను కథ చెప్పి తీరాలి అలాంటి ఒక సిట్యుయేషన్.
ఎందుకంటే స్టార్ట్ అవ్వాల్సిన సినిమాను నేను హోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పోస్టుపోన్ చేయలేను. ఒకవేళ అది అవ్వకపోతే ముందుగా రాసుకున్న వెర్షన్ చేయాలి. 14 డేస్ అయిపోయింది. ఒక సింగల్ పదం కూడా రాయలేదు. 15 వ రోజు వచ్చేసరికి ఫుల్ టెన్షన్ అన్న మాట ఆరోజు రాత్రి ఆల్మోస్ట్ పడుకోలేదు. ఎంత ఆలోచిస్తున్న ఒక చిన్న ఐడియా రావట్లేదు. ఏంటి ఇది అని చెప్పి అప్పుడు ప్యాడ్ కూడా విసిరేశాను.
అప్పుడు ఒక సీన్ వాసు వర్మకు చెప్పాను. ఒక ఇన్సిడెంట్ జరిగింది. లైఫ్ లో ఒక అమ్మాయి ఒకసారి తెలియకుండా తల తగిలింది. నేను సారీ చెప్పి వెళ్తుంటే ఆ అమ్మాయి నన్ను పిలిచి అదేంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావ్ కొమ్ములు వస్తాయి తెలీదా ఇంకోసారి గుద్దు అని చెప్పింది. ఇది రియల్ గా నా లైఫ్ లో జరిగింది వాసు వర్మ అన్నాను. ఇది బాగుంది కదా, ఎర్లీ మార్నింగ్ 4 టు 6 లోపు 2 గంటల్లో మొత్తం రాసేశాము.
అలా హాసిని క్యారెక్టర్ అప్పుడు పుట్టింది. నెక్స్ట్ డే ఈవెనింగ్ రాజు గారికి చెప్పాను. చెప్పగానే ఇమ్మీడియేట్ గా లేచి ఎవరు కావాలి చెప్పు హీరోయిన్, చాల బాగుంది క్యారక్టరేజషన్ నచ్చింది అని చెప్పారు. అప్పుడు సాటిస్పై అయ్యాము. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఒక మంచి క్యారక్టరేజషన్ వచ్చింది అని దర్శకుడు భాస్కర్ అన్నారు.
షూట్ కి వెళ్లే ముందు ప్రీ ప్రొడక్షన్ చాలా టైం తీసుకున్నారంట అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు భాస్కర్… కథ రాయడానికి ఫాస్ట్ గా రాసేశాము. కాకపోతే ఏంటి అంటే ప్రతి రోజు వర్క్ ఉండేది. ఇవ్వాళ షూట్ ఫినిష్ చేసి నైట్ వస్తే ఆల్రెడీ మేము రాసుకున్న ఒక వెర్షన్ మళ్ళీ రాస్తాం. నెక్స్ట్ డే షూట్ ఉంటాది మార్నింగ్ 4 వరకు కూడా ఫైన్ ట్యూన్ చేయడం. రైటర్ అబ్బూరి రవి చాలా ఎఫ్ర్ట్స్ పెట్టాడు.
సినిమాలో హాసిని క్యారెక్టర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ క్యారెక్టర్ గురించి రాస్తున్నప్పుడు కానీ మేకింగ్ లో ఆ రేంజ్ కి వెళ్తుంది అని ఊహించారా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు భాస్కర్… ఫస్ట్ ఏ ఈ క్యారెక్టర్ ఏ అమ్మాయి చేయబోతుందో ఆ అమ్మాయికి ఈ క్యారెక్టర్ జాక్ పాట్ అన్నది మాత్రం అందరికి తెలుసు. ఎందుకంటే అది రాసేటప్పుడు అంత ఒక ఎక్సయిట్మెంట్ ఇచ్చిన క్యారక్టరేజషన్.
జెనీలియా హ్యాపీ సినిమా చూసి తీసుకున్నాం
హాసిని క్యారెక్టర్ జెనీలియా ని ఎలా అప్రోచ్ అయ్యారని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు భాస్కర్… జెనీలియా అప్పుడు హ్యాపీ సినిమా చేస్తుంది. బన్నీ వాసుని అడిగి కొన్ని రషెస్ చూశాము. ఒక మూడు సీన్స్ రషెస్ చుపించామన్నాను. అందులో ఇదొక సీన్ లో ఒక పేజీ డైలాగ్ ప్రామ్ప్టింగ్ లేకుండా చెప్పింది. నేను ఇమ్మీడియేట్ గా ఫిక్స్ అయ్యాను. ఈ అమ్మాయే కావాలని ఆ టైంలో జెనీలియా వద్దు అని చాలామంది అన్నారు. జెనీలియా కావాలని నేను డిసైడ్ అయిపోయాను.
క్లైమాక్స్ విషయానికి వస్తే రైటర్ అబ్బూరి రవి గారు చాలా వెర్షన్స్ రాశారు. నేను కూడా చాలా రాశాను. షూట్ కు వెళ్లే ముందు ప్రకాష్ రాజ్ సీన్ పేపర్ అడిగారు. ఆయన చెన్నైకి వెళ్తున్నారు. ఎయిర్పోర్ట్ కు వెళ్ళాక ప్రకాష్ రాజ్ గారు ఫోన్ చేసి భాస్కర్ ఏదో మిస్ అవుతుంది నీకు అనిపిస్తుందా అన్నారు. వన్ డే షూట్ పోస్టుపోన్ చేయమని ప్రకాష్ రాజ్ అడుగుతారు.
ప్రకాష్ రాజ్ వచ్చాక ఆయన ఫ్లాట్ కి నేను రైటర్ అబ్బూరి రవి దిల్ రాజు హీరో సిద్దార్థ్ అందరం వెళ్ళాము. ప్రకాష్ రాజ్ ఇంకొక వెర్షన్ ట్రై చెయ్యి అన్నారు. అలా ఫైనల్ వెర్షన్ రాసుకున్నాం. నెక్స్ట్ డే యూనిట్ మొత్తానికి చెప్పాం పిన్ డ్రాప్ సైలెంట్ ఎవరు మాట్లాడద్దు అని, హౌస్ సెట్ బయట చెట్టు కింద నేను సిద్దార్థ్ దిల్ రాజు వాసు వర్మ కూర్చున్నాం.
బ్రేక్ ఫాస్ట్ చేశాము. ఎవ్వరు మాట్లాడుకోవట్లేదు. అలా కూర్చొనే ఉన్నాం లోపలికి అస్సలు వెళ్ళలేదు. ఎవ్వరు అడగలేదు షూట్ చేద్దామని మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది. లంచ్ చేసి వచ్చి మళ్ళీ అదే చెట్టు కింద వచ్చి కూర్చున్నాం. ఒక 3:30 కి వచ్చి ప్రకాష్ రాజ్ అడిగారు. సీన్ చేద్దాం అని చెప్పి లోపలికి వెళ్ళాము. ఈవెనింగ్ 4:30 కి కెమెరా మొత్తం సెటప్ చేశాము. ఒక్కటే సింగల్ షాట్ స్టార్ట్ కెమెరా యాక్షన్ నేను మానిటర్ చూస్తున్న సిద్దార్థ్ చేస్తున్నాడు. ఫాదర్ ని నిందిస్తున్నాడు. నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను. దిల్ రాజు గారు వచ్చి కట్ చెప్పారు అని దర్శకుడు భాస్కర్ తెలిపారు.
Venu Yeldandi : బలగం సినిమా తెర వెనుక విశేషాలు.. ఎవ్వరికి తెలియని నిజాలు దర్శకుడు వేణు మాటల్లో..?