Balakrishna : చెన్నకేశవ రెడ్డి సినిమా తెర వెనుక విశేషాలు.. ఎవ్వరికి తెలియని నిజాలు.. దర్శకుడు వివి వినాయక్ మాటల్లో..?

Balakrishna : చెన్నకేశవ రెడ్డి సినిమా తెర వెనుక విశేషాలు.. ఎవ్వరికి తెలియని నిజాలు.. దర్శకుడు వివి వినాయక్ మాటల్లో..? : దర్శకుడు వివి వినాయక్ చెన్నకేశవ రెడ్డి సినిమా తెర వెనుక విశేషాలు మరియు పలు ఆసక్తికర విషయాలు పంచుకోవడం జరిగింది.

Balakrishna : చెన్నకేశవ రెడ్డి సినిమా తెర వెనుక విశేషాలు.. ఎవ్వరికి తెలియని నిజాలు.. దర్శకుడు వివి వినాయక్ మాటల్లో..?

Balakrishna : చెన్నకేశవ రెడ్డి సినిమా తెర వెనుక విశేషాలు.. ఎవ్వరికి తెలియని నిజాలు.. దర్శకుడు వివి వినాయక్ మాటల్లో..?

దర్శకుడు వివి వినాయక్ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా చెన్నకేశవ రెడ్డి సినిమా తెర వెనుక విశేషాలు ఎవ్వరికి తెలియని నిజాలు పంచుకోవడం జరిగింది.

చెన్నకేశవ రెడ్డి సినిమా ఐడియా ఎలా స్టార్ట్ అయ్యింది. బాలయ్య గారిని ఎలా అప్రోచ్ అయ్యారు అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు వివి వినాయక్… బాలయ్య గారిని నేను అప్రోచ్ అవ్వడం కాదు బెల్లంకొండ సురేష్ గారు ఆల్రెడీ బాలయ్యతో సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఒక కథ నా దగ్గర ముందు నుంచే ఉంది. అది అనుకోకుండా ఆది సినిమా తర్వాత బాలయ్య గారిని అడిగితే ఓకే చేద్దాం అని బాలయ్య గారు అన్నారు.

బాలయ్య గారికి కథ చెప్పడం ఆయన వెంటనే చేస్తా అని చెప్పారు. బాలయ్య గారు ఓకే అంటారా లేదా అనే డౌట్ ఎందుకంటే ఫాదర్ అండ్ సన్ డ్యూయల్ రోల్ కదా ఏం అంటారో అన్న డౌట్ ఉండేది. ఫాదర్ క్యారెక్టర్ అని కూడా చెప్పాను. బాలయ్య గారు మాత్రం చెప్పిన వెంటనే ఇమ్మీడియేట్ గా ఓకే అన్నారు. బాలయ్య ఓకే అన్న ఒక వారంలోనే షూటింగ్ మొదలు పెట్టాం.

బాలయ్య బాబు సినిమాల్లో అప్పటివరకు హైయెస్ట్ బిజినెస్ హైయెస్ట్ ఓపెనింగ్స్ ప్రొడ్యూసర్ కి హైయెస్ట్ ప్రాఫిట్స్ వచ్చాయి. అంతే కాకుండా దర్శకుడిగా నాకు కూడా మంచి పేరు వచ్చింది. నేను అనుకున్నంత పెద్ద రేంజ్ కు సినిమా వెళ్లకపోవటానికి రీజన్ నేను ఏం అనుకున్నాను అంటే బాలయ్య లాంటి పెద్ద హీరో దొరికాడు.

Balakrishna : చెన్నకేశవ రెడ్డి సినిమా తెర వెనుక విశేషాలు.. ఎవ్వరికి తెలియని నిజాలు.. దర్శకుడు వివి వినాయక్ మాటల్లో..?
Image Source : Twitter / manabalayya.com

బాలయ్యను అలా చూపించాలి ఇలా చూపించాలి అనే ఇదే ఎక్కువగా ఉండేది. బాలయ్యను డైనమిక్ గా చూపించాలి అనే పిచ్చి ఎక్కువ అయిపోయి కథ మీద ఫోకస్ తగ్గింది ఏమో అనిపించింది. కథ తప్పు కాదు కానీ స్క్రీన్ ప్లే కొంచెం చూసుకుంటే బాగుండేది అనిపించింది.

మొదటగా టబు గారు చేసిన క్యారెక్టర్ ని సౌందర్య గారిని అనుకున్నాను. బెంగుళూరు వెళ్లి సౌందర్య గారికి కథ వినిపించాను. కథ విన్న తర్వాత ఆవిడ ఓల్డ్ క్యారెక్టర్ కదా ఇప్పుడు అప్పుడే వద్దు వినాయక్ గారు అన్నారు. అప్పటికే సౌందర్య గారు చేసిన ఐదు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. అప్పుడే వద్దు ఇలాంటి ఓల్డ్ క్యారెక్టర్ అని ఆవిడ చెప్పేసింది. అప్పుడు ఎవరు అని అనుకుంటున్నా టైం లో సడన్ గా నా మైండ్ లోకి టబు గారు చేస్తే బాగుంటుంది అని అనిపించింది. టబుకి వెళ్లి కథ చెప్పాను. ఆవిడ వెంటనే చేస్తాను అని చెప్పింది.

చెన్నకేశవ రెడ్డి సినిమాలో శ్రియ గారు ఎలా వచ్చారు అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు వివి వినాయక్… శ్రియ అప్పటికే అందరికి తెలిసిన హీరోయిన్ మామూలుగానే శ్రియకి కథ చెప్పడం జరిగింది. ఆమె వెంటనే ఓకే చేస్తాను అని చెప్పింది.

మొదటిసారి డైరెక్ట్ గా బాలయ్య బాబుని చూసినప్పుడు సినిమాల్లో చూడటం తప్ప డైరెక్ట్ గా చూడలేదు. మొదటగా బాలయ్య ఇంటికి వెళ్లి చూసినప్పుడు ఆయన అప్పుడే ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చి కూర్చున్నారు. బాలయ్య మంచి కర్లీ హెయిర్ భలే ఉన్నారే ఈయన అని అనిపించింది. బాలయ్యకు మేకప్ ఎందుకు అవసరం లేదు అనిపించింది. ఎందుకంటే బాలయ్య హ్యాండ్సమ్ గా ఉంటారు.

బాలయ్య గారిలో గొప్ప విషయం ఏంటి అంటే అందరు అంటారు పంచువాలిటీ అని, అంతేకాకుండా ఆయన ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కి ఇచ్చే రెస్పెక్ట్ నాది అప్పటికి సెకండ్ ఫిలిం అంతే నా వయసు కూడా తక్కువే కానీ ఆయన తను నా డైరెక్టర్ అంతే. అసలు ఒక్కసారి కూడా ఇది ఏంటి అది ఎందుకు అని ఎప్పుడు చెప్పరు.

బాలయ్యలో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఏదైనా సీన్ చెప్పటానికి దగ్గరికి వెళ్తే గురువు గారు అని నిల్చుంటారు. అంత మర్యాద ఇస్తారు డైరెక్టర్ కి, ఇప్పుడు అందరికి తెలిసింది ఆయన ఏంటో అన్స్టాపబుల్ షో వచ్చాక, ఆయనకు ఎండ అంటే బాగా ఇష్టం. ఎండలోనే నిల్చుంటారు. ఎండలోనే ఉంటారు.

ఒక రేర్ సీక్వెన్స్ నేను స్పాట్ లోనే ఉన్న చాలా భయపడ్డాను. ఏంటి అంటే ఆ సీన్ లో చాపర్స్ చేజ్ ఉంటాది అది ఏంటి అంటే జీప్ పైన నిల్చొని ఒక నిచ్చెన పట్టుకొని వేలాడుతూ షాట్ చేయాలి. అసలు అయన ఏ కేర్ తీసుకోలేదు. ఫైట్ మాస్టర్ కి బాలయ్యకు ఒక అండర్ స్టాండింగ్ ఉంది. ఫైట్ మాస్టర్ ని అడిగితే బాలయ్య చేసేస్తారు లే అని చెప్తారు. నాకేమో టెన్షన్ చాలా భయమేసింది. అసలు రోప్ కూడా లేదు జస్ట్ దాని మీద నిల్చొని చేత్తో పట్టుకొని చేస్తున్నారు.

లెన్తీ షాట్ అది పైగా ఒరిజినల్ ఛాపర్ కు వేశారు. ఫైట్ మాస్టర్ ఏమో ఏం కాదు ఆయన చేస్తారు అని ధైర్యంగా ఉన్నారు. నాకేమో భయమేస్తుంది. బాలయ్య చిన్న క్యారెక్టర్ కి పెద్ద క్యారెక్టర్ కి వేరియేషన్ చాలా బాగా చూపించారు. కొన్ని సీన్స్ లో బాలయ్య ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. సినిమాలో ప్రతి షాట్ లవ్ చేసి అద్భుతంగా చేశాము.

చిన్నప్పుడు నేను చూసిన ఖైదీ వేట సినిమా రిఫరెన్స్ మైండ్ లో ఉంటాది. అంటే దానిలో సీన్స్ అవి ఏం ఉండవు. కానీ ఫాదర్ అండ్ సన్ కాన్సెప్ట్ మాత్రం బ్రెయిన్ లో ఉండింది అని దర్శకుడు వివి వినాయక్ అన్నారు.

సీన్స్ డిస్కస్ చేసేటప్పుడు బాలయ్య గారి ఇన్పుట్స్ ఎంతవరకు ఉండేది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు వివి వినాయక్… అస్సలు డిస్కషన్ ఏ లేదు నా దగ్గర కథ ఉంది వెళ్లి చెప్పాను. బాలయ్యకి నచ్చింది. వెంటనే డైలాగ్ వెర్షన్ రాసుకున్నాం సినిమా షూటింగ్ కి వెళ్ళిపోయాము.

చెన్నకేశవ రెడ్డి సినిమా షూటింగ్ లాస్ట్ మూమెంట్ లో కొంచెం హడావిడి గా అయిపోయింది అంటా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు వివి వినాయక్… రిలీజ్ డేట్ మాత్రం చాలా హడావిడిగా చేసి పెట్టడం, సినిమా చూసి తప్పో ఒప్పో చూసే టైం లేదు. సినిమా విడుదల అయ్యాక ఒక సాంగ్ షూట్ చేసి వేయటం జరిగింది.

Balakrishna : చెన్నకేశవ రెడ్డి సినిమా తెర వెనుక విశేషాలు.. ఎవ్వరికి తెలియని నిజాలు.. దర్శకుడు వివి వినాయక్ మాటల్లో..?
Image Source : Twitter / manabalayya.com

సినిమా ప్లాప్ అయినా ఇంకో సినిమా ఇస్తా అన్న బాలయ్య…

మీతో సినిమా చేస్తున్నప్పుడు నాకు బాగా అనిపించింది. సినిమా రిజల్ట్ పైన ఎక్కువ పెట్టేసుకోవద్దు. సినిమా బాగా వచ్చింది. మీతో వర్క్ చేయటం నాకు బాగా అనిపించింది. మీరు రిజల్ట్ ని ఎక్కువ తీసుకోవద్దు. ఏదైనా కథ ఉంటె చెప్పండి. మనం మళ్ళీ కలిసి ఇంకో సినిమా చేద్దాం అని బాలయ్య గారు చెప్పారు.

బాలయ్యకు చెల్లెలు పాత్ర అంటే లయ కన్నీళ్లు పెట్టుకుంది…

బాలయ్య చెల్లెలు పాత్రకు ముందుగా లయను అనుకున్నాను. ఫిలిం సిటీ లో లయను కలిసి కథ చెప్పాను. లయ కళ్ళ వెంబడి నీళ్లు ఒకటే ఏడుస్తుంది. ఎందుకు సిస్టర్ క్యారెక్టర్ అడుగుతారు. అంటే తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా పని చేయరా అలా కాదు అండి అన్నాను. లయ ఫుల్ గా ఏడ్చింది. హీరోయిన్ గా ఎందుకు ఇవ్వరు ఛాన్స్ అని లయ గారు అన్నారు. సారీ అమ్మ ఏమి అనుకోవద్దు ప్లీజ్ నెక్స్ట్ చేద్దాం అని చెప్పేసి వచ్చేశా అని దర్శకుడు వివి వినాయక్ తెలిపారు.

మణిశర్మ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు. మణిశర్మ పాటలు మరియు నేపధ్య సంగీతం అద్భుతంగా చేశాడు. అని దర్శకుడు వివి వినాయక్ తెలిపారు.

Raghavendra Rao : అన్నమయ్య సినిమా తెర వెనుక ఎవ్వరికి తెలియని నిజాలు… దర్శకుడు రాఘవేంద్ర రావు మాటల్లో…

Hello Friends, My Name is Surya, I Am The Writer And Founder Of This Blog And Share All The Information Related To Entertainment Through This Website.

Sharing Is Caring:

Leave a Comment