Anil Ravipudi : పటాస్ సినిమా గురించి మీకు తెలియని నిజాలు దర్శకుడు అనిల్ రావిపూడి మాటల్లో…

Anil Ravipudi : పటాస్ సినిమా గురించి మీకు తెలియని నిజాలు దర్శకుడు అనిల్ రావిపూడి మాటల్లో… : దర్శకుడు అనిల్ రావిపూడి పటాస్ సినిమా గురించి తెర వెనుక విశేషాలు మరియు ఆసక్తికర విషయాల్ని పంచుకోవడం జరిగింది.

Anil Ravipudi : పటాస్ సినిమా గురించి మీకు తెలియని నిజాలు దర్శకుడు అనిల్ రావిపూడి మాటల్లో…

టెంపర్ పటాస్ సినిమాలు ఒక్కటి కాదా… డైరెక్టర్ అనిల్ రావిపూడి

పటాస్ షూటింగ్ ఒక నెలలో అయిపోతుంది అనే లోపు రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కువగా వచ్చే వారు రోజు ర్యాగింగ్ చేసేవారు. నాపైన జోక్స్ వేసేవారు. నాతో సినిమా చేయవా అని అడిగేవారు. పటాస్ ఆయన ముందే చూసేశారు. ఒకరోజు డిస్కషన్ వచ్చింది. టెంపర్ సినిమా కూడా ఇదే కథ మీద వెళ్తుంది అంట అని అన్నారు.

రెండు సినిమాల సెంటర్ పాయింట్ ఒక్కటే దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే అని చెప్పాను. రెండు సినిమాల కథలు ఒకలా ఉండవు. టెంపర్ సినిమా రిలీజ్ అయ్యాక అన్నారు కానీ ఎక్కడ కంపేరిజన్ లేదు.ఎన్టీఆర్ గారికి పటాస్ సినిమా విపరీతంగా నచ్చింది. అని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు.

Anil Ravipudi : పటాస్ సినిమా గురించి మీకు తెలియని నిజాలు దర్శకుడు అనిల్ రావిపూడి మాటల్లో…

దర్శకుడు అనిల్ రావిపూడి ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా పటాస్ సినిమా తెర వెనుక విశేషాల్ని పంచుకోవడం జరిగింది. ఆ ఆసక్తికర విషయాలు ఏంటో దర్శకుడి మాటల్లో తెలుసుకుందాం.

పటాస్ సినిమా ఐడియా ఎలా స్టార్ట్ అయ్యింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు అనిల్ రావిపూడి… కందిరీగ సినిమా రైటర్ గా మంచి పేరు వచ్చింది.కందిరీగ సినిమా తర్వాత డైరెక్షన్ ట్రైల్స్ మొదలు పెట్టాను. ఎలాంటి సబ్జెక్ట్ తో డెబ్యూట్ సినిమా తీయాలి అనే ఆలోచన మొదలు అయ్యింది.

మొదటి నుంచి నాకు కమర్షియల్ స్లాట్ లో సినిమా తీయాలని ఉండేది. ఎందుకు అంటే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమా చేయాలనీ, అంతే కాకుండా A B C సెంటర్స్ ఆడియన్స్ అందరికి దగ్గరయ్యే సినిమా చేయాలి. అలా ఫస్ట్ ఫిలిం అది అయితే బాగుంటుంది అని టేక్ ఆఫ్ అనుకున్నాను.

ఎలాంటి కథ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తుంటే ఒక పోలీస్ సబ్జెక్టు చేస్తే మాక్సిమం 80 టు 90% బ్లాక్ బస్టర్స్ అవుతాయి కరెక్ట్ గా డీల్ చేయగలిగితే, నేను బిలీవ్ చేశాను. అందరి హీరోస్ పోలీస్ సబ్జెక్ట్స్ చూసి రీసెర్చ్ చేశాను. కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసిన ప్రతి ఫిలిం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

పోలీస్ అంటేనే ఒక పవర్ ఒక హీరోయిజం సగం యూనిఫామ్ ఏ మోస్తుంది. ఇంకో సగం హీరోయిజం యాడ్ చేస్తే ఫస్ట్ ఫిలిం కి మనకు గ్రాండ్ టేక్ ఆఫ్ ఉంటది. ఫస్ట్ ఒక పోలీస్ సబ్జెక్టు చేయాలి అనుకున్న, అప్పుడే సింగం హిందీ సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా చూసి బాగా ప్రేరణ పొందాను. దానికి రోహిత్ శెట్టి ఒరిజినల్ సినిమా కథను మార్పులు చేర్పులు చేసి సక్సెస్ అయ్యాడు.

నేను మా ఫ్రెండ్ రైటర్ సాయి ఒక లైన్ అనుకుని అందులో ఎలాంటి ఎలిమెంట్స్ పెట్టాలి. అలా వన్ బై వన్ పార్దయా ఎపిసోడ్, ప్రెస్ మీట్ ఎపిసోడ్, మదర్స్ ఎపిసోడ్ మరియు ముస్లిం ఎపిసోడ్ అలా అన్ని ఎలిమెంట్స్ ని రాసుకున్నాం.

పటాస్ కథతో ముందుగా ఎవరిని అప్రోచ్ అయ్యారని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు అనిల్ రావిపూడి… ఫస్ట్ కళ్యాణ్ రామ్ తోనే స్టార్ట్ అయ్యింది. ఎందుకు అంటే ఇప్పుడు స్టార్స్ అంటే వాళ్ళ యాక్సస్ దొరకదు. యాక్సస్ దొరికిన అవుతుందో లేదో తెలీదు. నాకేమో సినిమా తొందరగా స్టార్ట్ చేయాలనీ ఉండేది.

రైటర్ గా రాశాను కానీ అంత ఫేమ్ లేదు. మనకు ఎవరు ఇస్తారు అవకాశాలు అని, అలా కళ్యాణ్ రామ్ కొత్త డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో చాలామంది కొత్త డైరెక్టర్స్ ని పరిచయం చేశాడు. ఒక ఇక్వషన్ అనుకున్నాను ఏంటంటే కళ్యాణ్ రామ్ సురేందర్ రెడ్డి తో సినిమా అతనొక్కడే చేస్తే డైరెక్ట్ గా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇదే ఇక్వషన్ మనం కూడా వర్కౌట్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది.

అలా కళ్యాణ్ రామ్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఓం సినిమా షూటింగ్ లో ఉన్నారు. సబ్జెక్టు చాలా బాగుంది నేనే ప్రొడ్యూస్ చేస్తాను. ఎవరైనా పెద్ద హీరోని అప్రోచ్ అవుదాం అన్నారు. నేను మీతో చేయాలి అనుకున్నాను పెద్ద హీరో అంటే అవ్వదు లెండి సర్ అని అక్కడి నుంచి వచ్చేశాను. ఎందుకంటే నాకు ప్రాజెక్ట్ ఇమ్మీడియేట్ గా స్టార్ట్ అవ్వాలి.

అప్పుడు రానా దగ్గరికి వెళ్ళాము. అక్కడ 8 టు 9 మంత్స్ స్క్రిప్ట్ మీద వర్క్ చేశాము. చివరకు 2012 లో మొదలు పెడితే 2014 జూన్ లో సినిమా షూటింగ్ మొదలు అయ్యింది.

Anil Ravipudi : పటాస్ సినిమా గురించి మీకు తెలియని నిజాలు దర్శకుడు అనిల్ రావిపూడి మాటల్లో…
Image Source : Twitter / Only Movies News

సీనియర్ ఎన్టీఆర్ గారి ఫొటో చూసి గట్టిగా మీరు ఏదో కోరుకున్నారంట అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు అనిల్ రావిపూడి… ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఆఫీస్ ఎంట్రన్స్ లో సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉంటుంది. మా ఇంట్లో నాన్న మరియు పెద్ద నాన్న సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.

ఫస్ట్ టైం మనం డైరెక్షన్ చేయబోతున్నాం కదా ఫొటోలో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ ని చూస్తూ అయ్యేటట్టు చూడు అన్న గారు అని మనసులో అనుకున్న, అప్పటికి వర్కౌట్ కాకపోయినా ఎట్టకేలకు చిరాఖరికి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లోనే నా మొదటి సినిమా చేశాను.

పటాస్ కథ చెప్పాక కళ్యాణ్ రామ్ ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు అనిల్ రావిపూడి… ఫస్ట్ నుంచి కథ ఫుల్ ప్యాకెడ్ గా ఉంది. 2:30 గంటల నరేషన్ అది, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం కథ ఉండింది. చిన్న చిన్నవి చెప్పారు తప్పితే పెద్దగా చేంజెస్ ఏమి చెప్పలేదు. కథ విన్నప్పుడే కళ్యాణ్ రామ్ హ్యుజ్ ఫిలిం అవుతుంది అని నాకంటే ఎక్కువగా నమ్మరు.

కళ్యాణ్ రామ్ ని కలవడానికి ఒక నటుడు చుట్టూ రోజు తిరిగేవారంట ఎవరా ఆ నటుడు అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు అనిల్ రావిపూడి… అదుర్స్ రఘు ఆ నటుడు. రఘు అన్న నాకు చాలా హెల్ప్ చేశారు. రఘు అన్న కళ్యాణ్ రామ్ ని కలవడంలో కీ రోల్ పోషించారు. నేను రఘు అన్న వెంట పడితే రఘు అన్న కళ్యాణ్ రామ్ వెంట పడేవాడు. ఒకరోజు కళ్యాణ్ రామ్ తో మీటింగ్ సెట్ చేశాడు. అలా కళ్యాణ్ రామ్ కి కథ వినిపించాను.

హీరోయిన్ శృతి శోధిని తీసుకోవడానికి రీజన్ ఏంటి అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు అనిల్ రావిపూడి… స్టార్ హీరోయిన్ పెట్టాలని ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే మాకున్న లిమిటెడ్ బడ్జెట్ కి కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది అని అనిపించింది. అంతే కాకుండా ఆ అమ్మాయి న్యూస్ రిపోర్టర్ మన సినిమాలో కరెక్ట్ గా సరిపోతుంది అని భావించాను.

Anil Ravipudi : పటాస్ సినిమా గురించి మీకు తెలియని నిజాలు దర్శకుడు అనిల్ రావిపూడి మాటల్లో…
Image Source : Twitter / Only Movies News

రకుల్ ప్రీత్ సింగ్ చేయాల్సిన సినిమా…

మొదటగా రకుల్ ప్రీత్ సింగ్ ని అనుకున్నాం. రకుల్ ప్రీత్ సింగ్ అప్పుడే ఫిలిం ఇండస్ట్రీ కి ఎంటర్ అవుతుంది. రకుల్ మేనేజర్ ని కలిశాము. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అది కుదరలేదు.

హీరో క్యారక్టరేజేషన్ ఎలా రాసుకున్నారని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు అనిల్ రావిపూడి… సినిమా ఆడిటోరియంని ఎంగేజ్ చేసేది హీరో క్యారెక్టర్ నే, కళ్యాణ్ రామ్ మీద ఎంటటైనెమెంట్ ఏంటి అని ఎవరు బిలీవ్ చేయలేదు మొదట్లో, నేను బ్లైండ్ గా బిలీవ్ చేశాను కళ్యాణ్ రామ్ చేయగలరని నేను 100% బిలీవ్ చేస్తే ఆయన 500% బిలీవ్ చేశారు నేను చేయగలను.

కాస్టింగ్ విషయానికి వస్తే సాయి కుమార్ గారిని అప్రోచ్ అయ్యి కథ చెప్పాను. ఆయనకు కథ ఆయన క్యారెక్టర్ విపరీతంగా నచ్చింది. చేస్తున్న అని చెప్పారు. అశుతోష్ రానా గారు విలన్ గా అద్భుతంగా నటించారు. పోసాని కృష్ణ మురళి, పవిత్ర లోకేష్, ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమాకు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మను అనుకున్నారా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు అనిల్ రావిపూడి… సాయి కార్తీక్ ఎలా వచ్చాడు అంటే, ఓం సినిమాకు ఒక సాంగ్ చేశాడు. కళ్యాణ్ రామ్ ఒకసారి చూడు నీకు సింక్ అయితే పెట్టుకుందాం లేకపోతే లేదు అన్నారు. ఆఫీస్ పక్కనే సాయి కార్తీక్ స్టూడియో ఉండేది. వర్క్ చేసుకోవడానికి ఆఫీస్ పక్కనే స్టూడియో ఉంది అని కమిట్ అయిపోయాను.

బాలకృష్ణ గారి సాంగ్ పెట్టాలనే ఐడియా ఎలా వచ్చింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు అనిల్ రావిపూడి… కళ్యాణ్ రామ్ అప్పుడు లో లో ఉన్నప్పుడు ఒక రీమిక్స్ సాంగ్ పెడితే బాగుంటుంది అనిపించింది. నా ఫేవరేట్ సాంగ్ అది ప్రభు దేవా గారు ఎక్స్ట్రార్డినరీ గా కంపోజ్ చేశారు. ఆ పాట సినిమాకు వన్ అఫ్ ది హైలైట్.

ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ బ్లాక్ మదర్స్ సీన్ ఐడియా ఎలా వచ్చింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు అనిల్ రావిపూడి… జనరల్ గా రోడ్ల మీద సమ్మెలు జరుగుతున్నప్పుడు కుర్రాళ్ళు అందరూ వచ్చి చేస్తుంటారు. అప్పుడు అనిపించేది పేరెంట్స్ ఏం అనరా అని, వియిర్డ్ గా ఆలోచించ పోలీసులే ఎందుకు కొట్టాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళే మదర్స్ కొడితే బాగుంటుంది కదా అని అనిపించింది.

Mahesh Babu : దూకుడు సినిమా తెర వెనుక విశేషాల్ని పంచుకున్న దర్శకుడు శ్రీను వైట్ల..!

Hello Friends, My Name is Surya, I Am The Writer And Founder Of This Blog And Share All The Information Related To Entertainment Through This Website.

Sharing Is Caring:

Leave a Comment