Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ తన గురించి ఎవ్వరికి తెలియని ఆసక్తికర విషయాలు.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..! : అనసూయ భరద్వాజ్ గురించి ఎవ్వరికి తెలియని నిజాలు మరియు పలు ఆసక్తికర విషయాల్ని ఆమె పంచుకోవడం జరిగింది.
నాగ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిన అనసూయ భరద్వాజ్
అనసూయ భరద్వాజ్ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా నాగ సినిమాలో స్టూడెంట్ గా యాక్ట్ చేశారు ఆ ఆఫర్ ఎలా వచ్చింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా అనసూయ భరద్వాజ్… నాగ సినిమాలో నేను జూనియర్ ఆర్టిస్ట్ గా స్ట్రగుల్ అయ్యి తర్వాత జబర్దస్త్ ద్వారా బ్రేక్ వచ్చింది అని చాలా మంది అనుకుంటారు. అందులో నిజం ఏం మాత్రం లేదు.
అప్పట్లో కాలేజీ బంక్ కొట్టి సినిమాకు వెళ్లాలని ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. కానీ అక్కడ నాగ సినిమా షూటింగ్ జరుగుతుంది. నాకు 450 రూపాయలు ఆఫర్ చేశారు. నేను అక్కడ ఇడ్లీ వడకు పడిపోయాను. టక టక తినేశాను ఇడ్లీ వడ స్పెషల్లీ చట్నీ యమ్మీ గా ఉండింది.
సునీల్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ లో సీన్ అందులో నేను సునీల్ వెనకాల ఉంటాను. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్, మా నాన్న గారు వెరీ వెరీ స్ట్రిక్ట్ అసలు సినిమా చూడటమే ఇష్టపడరు. నాకు తెలిసి చంద్రముఖి సినిమా 50వ రోజు మా అమ్మతో కలిసి థియేటర్ లో చూసాను. దానికంటే ముందు చిన్నపుడు ఏడేళ్ల వయసులో రామ్ లక్కన్ అనే సినిమా థియేటర్ లో చూశాను అంతే. అసలు థియేటర్ కి తీసుకెళ్లారు.
మా ఇంట్లో కేబుల్ కనెక్షన్ సమ్మర్ హాలిడేస్ లో తప్ప మిగతా రోజుల్లో ఉండేదే కాదు. మా ఫ్యామిలీ వెరీ స్ట్రిక్ట్. అలాంటిది నాగ సినిమాలో కనిపిస్తానంటే భయమేసింది. నాగ సినిమాకు ఇచ్చిన 450 రూపాయలు వెళ్లి అమ్మకు ఇచ్చాను. అమ్మకు వెళ్లి డబ్బులు ఇచ్చిన తర్వాత పిచ్చా నీకు అని అమ్మ అంది. అప్పుడే నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను.
Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ తన గురించి ఎవ్వరికి తెలియని ఆసక్తికర విషయాలు.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..!
అనసూయ భరద్వాజ్ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాల్ని పంచుకోవడం జరిగింది. మూవీ ఆఫర్స్ ఎలా వచ్చాయి అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా అనసూయ భరద్వాజ్… నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది. వరుసగా మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. ఆ టైంలోనే సుకుమార్ సర్ ఆర్య 2 ఆఫర్ చేశారు. ఇప్పటికి సుకుమార్ సర్ అంటుంటారు నువ్వు నాకు నో చెప్పావ్ అని, ఆర్య 2 సినిమాలో ఏ క్యారెక్టర్ నాకు తెలీదు.
యాక్టర్ గా ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా అనసూయ భరద్వాజ్… క్షణం సినిమా యాక్టువల్ గ ముందుగా సోగ్గాడే చిన్ని నాయన సినిమా రిలీజ్ అయ్యింది. కానీ క్షణం మూవీ నేను సైన్ చేసింది మరియు షూటింగ్ కూడా చేసింది. రిలీజ్ మాత్రం సోగ్గాడే చిన్ని నాయన ముందుగా అయ్యింది.
మామ లక్ష్మి అనే ప్రోగ్రామ్ స్టార్ మా లో చేసేదాన్ని. ఆ ప్రోగ్రామ్ డైలీ వచ్చేది అప్పట్లో 500 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. ఆ ప్రోగ్రామ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగేది. ఆ ప్రోగ్రామ్ లో ఎక్కువగా లంగా వోణి చీరలు ఎక్కువగా కట్టుకునేదాన్ని. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ అప్పుడప్పుడు వచ్చి చూసేవారు. సడెన్ గా ఒకరోజు షూట్ లోనే అడిగారు. ఇంకా నాగార్జున సర్ అంటే ఎవరు కాదు అంటారు. చిన్నప్పుడు హలో బ్రదర్ సినిమా పిచ్చి పిచ్చిగా చూసేదాన్ని. నాగ్ సర్ తో ఛాన్స్ అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు అనుకున్నాను.
నేను దేవి శ్రీ ప్రసాద్ యూఎస్ఎ టూర్ 2013 లో చేశాను. ఆ టైంలో అడివి శేష్ అప్రోచ్ అయ్యాడు. హీరోలు అందరు లైన్ వేయడానికి అప్రోచ్ అవుతారని అవాయిడ్ చేశాను. మూడు నెలల తర్వాత ఒక రోజు కాఫీ షాప్ లో అనుకోకుండా కలిశాము. కూర్చోపెట్టి నరేషన్ ఇచ్చారు. జబర్దస్త్ లో నేను ఏదో సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అంటా. ఈ అమ్మాయి మన సినిమా క్యారెక్టర్ సెట్ అవుతుంది అని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇప్పటికి క్షణం సినిమాలో ఇంకా మంచిగా చేస్తే బాగుండేది అనిపించింది.
రంగస్థలం సినిమా రంగమ్మ అత్త పాత్ర
రంగస్థలం సినిమా విషయానికి వస్తే అప్పటివరకు అనసూయ ఒక ఎత్తు అక్కడి నుంచి మీ లైఫ్ టర్నింగ్ అయ్యింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా అనసూయ భరద్వాజ్… ఇలా అనే నాలుగు సంవత్సరాలు నాకు సినిమానే రాలేదు. రంగస్థలం సినిమా ఫస్ట్ షెడ్యూల్ తర్వాత నాకు నిధి అగర్వాల్ మదర్ క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది. నాకు అప్పుడు నా వయసు 32. ఇప్పుడు ఏ పాత్రలు అయిన చేస్తాను. పాత్ర కీ రోల్ అయ్యి ఉండాలి. జనాలు ఆ పాత్ర గురించి మాట్లాడుకోవాలి.
సుకుమార్ గారంటే భయంకరమైన గౌరవం. అడివి శేష్, సుకుమార్ సర్, రవికాంత్ పేరెపు, మల్లెమాల ప్రొడక్షన్స్ ,నితిన్ భరత్ వీళ్ళు నాకు ఎక్కడ లేని గ్రాటిట్యూడ్ ఉంది అన్న మాట. నేను ఉప్పెన సినిమా చేయాల్సి ఉండింది. కానీ అందులో హీరోయిన్ పాత్ర తప్ప లేడీ పాత్రలకు అంత ఇంపార్టెన్స్ లేదు. నేను బుచ్చి బాబుకి చేయను అని చెప్పాను. బుచ్చి మీరు చేయమంటే చేసేస్తాను.
రంగమ్మ అత్త పాత్ర లాగా దాన్ని నిలబెట్టే పాత్ర అయితేనే పిలవండి అని చెప్పాను. ప్రతి ఒక యాక్టర్ కోరుకునేది నాకు గుర్తింపు రావాలి డబ్బులు రావాలి అనే అనుకుంటారు. మైత్రి మూవీ మేకర్స్ అంత పెద్ద ప్రొడక్షన్ అని తెలీదు. సుకుమార్ రామ్ చరణ్ రత్నవేలు మరియు దేవి శ్రీ ప్రసాద్ అక్కడి దాకా వెళ్ళాను చాలు అనుకున్నాను. ఆడిషన్ ఏ ఒక అచీవ్మెంట్ అనుకున్నాను. రంగస్థలం టీం మొత్తం నన్ను అత్త అనే పిలుస్తారు.
పుష్ప విషయానికి వస్తే సుకుమార్ గారు మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. అది ఎలా వచ్చింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా అనసూయ భరద్వాజ్… ముందే చెప్తున్న ఇది రంగమ్మ అత్త లా ఎక్సపెక్ట్ చేయద్దు అని సుకుమార్ గారు అన్నారు. సర్ మీరు ఈ పాత్ర ఇవ్వడమే ఎక్కువ అని నేను చెప్పాను.
సుకుమార్ గారు నాకు గురువు గారి లెక్క. దాక్షాయణి పాత్ర మొరటుగా ఉండే మంగళం శీను భార్య పాత్ర. సెట్ కు వెళ్లే ప్రతి రోజు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనిపిస్తూ ఉండేది. పుష్ప సినిమాలో నా సీన్ ఏదో లెంగ్త్ ఇష్యూ వాళ్ళ ప్రొడ్యూసర్స్ డిసైడ్ అయ్యి సీన్ తీసేశారు. ఆ సీన్ లో సునీల్ మీద కూర్చొనే సీన్ అది.
ఆ సీన్ తీసేసినందుకు సుకుమార్ గారు అప్సెట్ అయ్యారు. ఆ సీన్ తీసేశాం అంటే నాకు ప్రొడ్యూసర్ రవి సర్ చెప్పారు. ఏంటి మీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అంట పార్ట్ 2 లో, ఆ సీన్ తీసేస్తే సుకుమార్ గారు ఫోన్ చేసి ఎందుకు తీసేశారు అన్నారంటా, అప్పుడు మళ్ళీ ఆ సీన్ యాడ్ చేశారు.