Raghavendra Rao : అన్నమయ్య సినిమా తెర వెనుక ఎవ్వరికి తెలియని నిజాలు… దర్శకుడు రాఘవేంద్ర రావు మాటల్లో…

Raghavendra Rao : అన్నమయ్య సినిమా తెర వెనుక ఎవ్వరికి తెలియని నిజాలు… దర్శకుడు రాఘవేంద్ర రావు మాటల్లో… : దర్శకుడు రాఘవేంద్ర రావు అన్నమయ్య సినిమా తెర వెనుక విశేషాలు మరియు పలు ఆసక్తికర విషయాల్ని పంచుకోవడం జరిగింది.

Raghavendra Rao : అన్నమయ్య సినిమా తెర వెనుక ఎవ్వరికి తెలియని నిజాలు… దర్శకుడు రాఘవేంద్ర రావు మాటల్లో…

వేంకటేశ్వర స్వామి పాత్రకు కమల్ హాసన్ అనుకున్నట్టు గుర్తు కానీ..!

నిర్మాత దొరస్వామి రాజు గారు వేంకటేశ్వర స్వామి పాత్రకు కమల్ హాసన్ అయితే ఎలా ఉంటుంది అని అడిగినట్టు గుర్తు నాకు దేనికో కుదరలేదు అని దర్శకుడు రాఘవేంద్ర రావు గారు అన్నారు.

Raghavendra Rao : అన్నమయ్య సినిమా తెర వెనుక ఎవ్వరికి తెలియని నిజాలు… దర్శకుడు రాఘవేంద్ర రావు మాటల్లో…

దర్శకుడు రాఘవేంద్ర రావు గారు ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో అన్నమయ్య సినిమా తెర వెనుక విశేషాలు మరియు ఎవ్వరికి తెలియని పలు ఆసక్తికర విషయాల్ని పంచుకోవడం జరిగింది.

అన్నమయ్య సినిమా ముందుగా ఆత్రేయ గారు చేయాలి అనుకున్నారు. జంధ్యాల గారు చేయాలి అనుకోని కొన్ని సాంగ్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది కట్ చేస్తే ఆ అదృష్టం మీకు దక్కింది. అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు రాఘవేంద్ర రావు… ఇప్పటికి ఎవరు అడిగిన అదే చెప్తాను నేను అన్నమయ్య రావడానికి నాకన్న ముందు చాలామంది ట్రై చేశారు.

అందులో గొప్ప డైరెక్టర్స్ విశ్వనాథ్ గారు మరియు బాపు గారు ట్రై చేశారు. నాకన్న గొప్ప డైరెక్టర్స్ వాళ్లిద్దరూ అని నా ఫీలింగ్ వాళ్ళు కూడా చేయలేకపోవడానికి కారణం బహుశా ఇన్నేళ్లు వేంకటేశ్వర స్వామితో నాకున్న కనెక్షన్ కి స్వామి నాకోసం వదిలి పెట్టాడు అనిపిస్తుంది.

కాకపోతే ఒక మంచి ఇది ఏంటి అంటే బాపు గారు విశ్వనాథ్ గారు ఇద్దరు అన్నారు. ఈ సినిమా నువ్వు తీయటమే మంచిది అయ్యింది అన్నారు. ఒకవేళ మేము తీసిన కూడా ఇంత బాగా చేసేవాళ్ళం కాదు. బాగా తీసేవాళ్ళం కాదు అనే ఉద్దేశం ఏంటి అంటే గొప్ప మనుషులు ఒరిజినల్ సబ్జెక్ట్స్ ని డీవియేట్ చేయకుండా చేస్తారు. నేను కొంచెం సినిమా లిబర్టీ తీసుకోని క్లైమాక్స్ కానీ అలాగే కొన్ని సీన్స్ కానీ కొంచెం డ్రమటైజ్ చేయటం మూలంగా ఒక డ్రామా బాగా పండింది అన్న మాట.

ఆత్రేయ గారు ఆయన డైరెక్షన్ లో చేద్దామని రాసుకున్నారంట అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు రాఘవేంద్ర రావు… అన్నమయ్య రైటర్ భారవి గారు ఆత్రేయ గారు పిలిస్తేనే ఆయన వర్క్ చేశారు. భారవి గారు వేంకటేశ్వర స్వామి కొండ మీద హరికథలు చెప్పేవారు. భారవి గారు హరికథలు అద్భుతంగా చెప్తారు. ఒకరోజు ఆయన కథ ఉంది ఒకసారి వినండి అన్నారు.

నాకు అప్పటివరకు అస్సలు ఐడియా లేదు. కథ విన్నాను ఒక అరగంట సేపు చెప్పారు. కుర్చీలో కూర్చొని వినటం మొదలు పెట్టిన నేను తర్వాత భక్తిభావంతో నేల మీద కూర్చొని వినటం మొదలు పెట్టాను. కథ విన్నాక 10000 అడ్వాన్స్ ఇచ్చాను. ఈ కథ ఎవ్వరు తీయరు. ఎందుకంటే చాలామంది తీద్దాం అనుకోని తీయలేకపోయారు. నేను తీస్తాను ఎప్పుడు తీస్తానో నాకు తెలీదు కథ ఉంచండి అని చెప్పి పెట్టాను . అప్పుడు దొరస్వామి రాజు గారు టీటీడీ బోర్డ్ లో ఉన్నారు ఆయనకు తెలిసి మనం తీద్దాం అన్నారు.

Raghavendra Rao : అన్నమయ్య సినిమా తెర వెనుక ఎవ్వరికి తెలియని నిజాలు… దర్శకుడు రాఘవేంద్ర రావు మాటల్లో…
Image Source : Twitter / Vinodh

నాగార్జున గారు ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు. స్పెసిఫిక్ గా అన్నమయ్య పాత్రకి ఆయన్నే చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు రాఘవేంద్ర రావు… కేవలం ఆ క్రెడిట్ అంతా నిర్మాత దొరస్వామి రాజు గారిదే, దొరస్వామి రాజు గారు నాగార్జున ఎలా ఉంటాడు అండి అని అన్నారు. ముందు కాసేపు ఆలోచించాను. తర్వాత నాకు గుర్తుకు వచ్చింది.

అన్నమయ్య పాత్ర ఎవ్వరు వేసిన కూడా కంపేరిజన్ వస్తుంది. ఆల్రెడీ నాగేశ్వరరావు గారు భక్తుడి పాత్రల్లో ఎన్నో సినిమాలు చేశారు. తర్వాత వాళ్ళ అబ్బాయి నాగార్జున కూడా చేస్తున్నారంటే ప్లస్ పాయింట్ అవుతుంది. మీడియా వాళ్ళు చాలా డౌట్స్ రైజ్ చేశారు. గ్లామర్ బాయ్ నాగార్జున ఏంటి, గ్లామర్ సాంగ్స్ తో సినిమాలు తీసే రాఘవేంద్ర రావు ఏంటి సుమన్ వేంకటేశ్వర స్వామిగా ఏంటి అని ప్రశ్నలు విమర్శలు తలెత్తాయి.

అప్పుడు ఏమి చేశాం అంటే నిర్మాత నేను ఇద్దరం కలిసి ఒకటి డిసైడ్ అయ్యాము. సినిమా పూర్తి అయ్యేవరకు మీడియా సమావేశాలు పెట్టకూడదు. లాస్ట్ లో పెట్టాలి తప్ప ముందుగా పెట్టకూడదు అనేది ఫిక్స్ అయ్యాము.

నాగార్జునకు అవార్డు మాత్రం వస్తుంది కానీ కమర్షియల్ సక్సెస్ చెప్పలేను… దర్శకుడు రాఘవేంద్ర రావు

నాగార్జున గారికి కథ చెప్పారు. ఆయన ఫస్ట్ రియాక్షన్ ఏంటి అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు రాఘవేంద్ర రావు… నాగార్జున ఒక ఇంట్రెస్టింగ్ పీరియడ్ కథ విన్నాను. డెఫినిట్ గా నువ్వు చేస్తే బాగుంటుంది. 100% అవార్డు మాత్రం వస్తుంది. కమర్షియల్ గా ఎంత సక్సెస్ అవుతుందో చెప్పలేను కానీ అవార్డు మాత్రం వస్తుంది అని చెప్పాను.

ఒక రూమ్ లో నాగార్జున భారవిని కూర్చో పెట్టి కథ చెప్పమని నేను వేరే రూమ్ లో వెళ్లి కూర్చున్న కథ అయిన తర్వాత పిలవండి అని చెప్పను. ఒక గంట అయిన తర్వాత పిలిచారు వెళ్ళాను. లోపలి వెళ్లేసరికి నాగార్జున కళ్ళు ఎర్రబడి పోయాయి. నాగార్జున బాగా ఎమోషనల్ అయ్యాడు. డైరెక్టర్ గారు మీరు అవార్డు అన్నారు. కానీ కమర్షియల్ గా పెద్ద హిట్ అవుతుంది అని నాగార్జున అన్నారు. మొదటి నుంచి కూడా నాగార్జునకు సినిమా పెద్ద హిట్ అవుతుంది అని పూర్తి నమ్మకం ఉంది.

వేంకటేశ్వర స్వామి గా సుమన్ తీసుకోవాలనే ఐడియా ఎలా వచ్చింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు రాఘవేంద్ర రావు… సుమన్ కళగా ఉంటాడు. సుమన్ కు చెప్తే సుమన్ ఏ ఆశ్చర్యపోయాడు. సుమన్ చాలా కమిటెడ్ గా డివోషనల్ గా చేశాడు. భారవి గారు కథ చెప్తే జోక్స్ ఏమి చెయ్యట్లేదు కదా నాతో అని సుమన్ షాక్ అయ్యాడు.

Raghavendra Rao : అన్నమయ్య సినిమా తెర వెనుక ఎవ్వరికి తెలియని నిజాలు… దర్శకుడు రాఘవేంద్ర రావు మాటల్లో…
Image Source : Twitter / Shine Stream Live Telugu

అలాగే హీరోయిన్స్ విషయానికి వస్తే రమ్యకృష్ణ కూడా మంచి మంచి కమర్షియల్ సినిమాలు చేస్తుంది. రిస్క్ ఏమో ఆలోచించండి అని చెప్పింది. నాకేమో ఆ అమ్మాయి సూత్రధారి సినిమాలో పెద్ద బొట్టు పెట్టుకుంది. ఆ సినిమాలో చాలా బాగా అనిపించింది. రమ్యకృష్ణ పెద్ద బొట్టు పెడితే చాలా యాప్ట్ గా ఉంటుంది అని చెప్పి ఆమెను కన్విన్స్ చేసి ఒప్పించాను. అని దర్శకుడు రాఘవేంద్ర రావు అన్నారు.

అన్నమయ్య సినిమాకు కీరవాణి అందించిన పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశాడు. తను చేసిన మ్యూజిక్ కు నాకు మాత్రం ఆస్కార్ అప్పుడే వచ్చినట్టు లెక్క అని దర్శకుడు రాఘవేంద్ర రావు గారు తెలిపారు.

నాగార్జున పెర్ఫార్మెన్స్ అంతా గొప్పగా చేయకపోతే నాకు అంత పేరు వచ్చేది కాదు. చాలా భక్తిభావంతో నాగార్జున చేశాడు. అలా నాగార్జున నేను ఒకరినొకరు చాలాసార్లు థాంక్స్ చెప్పుకున్నాం. అన్నమయ్య తర్వాత వరుసగా శ్రీరామ దాసు, సాయి బాబా మరియు ఓం నమో వెంకటేశాయ సినిమాలు చేశాము. నేను ఏదైనా చెబితే ఆయన మైండ్ లో ఏదో ఉంది చేస్తారు అనే నమ్మకం అలా సినిమాలతో వచ్చేసింది అని దర్శకుడు రాఘవేంద్ర రావు అన్నారు.

Sukumar : రంగస్థలం సినిమా తెర వెనుక మీకు తెలియని నిజాలు… దర్శకుడు సుకుమార్ మాటల్లో..?

Hello Friends, My Name is Surya, I Am The Writer And Founder Of This Blog And Share All The Information Related To Entertainment Through This Website.

Sharing Is Caring:

Leave a Comment