Hanu-Man : హను మాన్ మూవీ తెరవెనుక విశేషాలు… డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాటల్లో…

Hanu-Man : హను మాన్ మూవీ తెరవెనుక విశేషాలు… డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాటల్లో… : హను మాన్ సినిమా తెరవెనుక విశేషాల్ని మరియు ఆసక్తికర విషయాల్ని పంచుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ…

Hanu-Man : హను మాన్ మూవీ తెరవెనుక విశేషాలు… డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాటల్లో…

Hanu-Man : హను మాన్ మూవీ తెరవెనుక విశేషాలు… డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాటల్లో…

హను మాన్ సినిమా విడుదలైన కొన్నిరోజుల తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో హను మాన్ సినిమా తెరవెనుక విశేషాల్ని పంచుకోవడం జరిగింది.

హను మాన్ సినిమా లాంటి సూపర్ హీరో ఫిలిం ఐడియా ఎలా ఎప్పుడు మొదలు అయ్యింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ… జాంబీ రెడ్డి కమర్షియల్ సక్సెస్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అనే ఆలోచనలో నుంచి పుట్టినదే సూపర్ హీరో ఫిలిం. నాకు సూపర్ హీరో ఫిలిమ్స్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న ఈ సినిమాతో అది కుదిరింది.

నిర్మాత నిరంజన్ రెడ్డి మనం కలిసి చేస్తున్నాం మీరు కథ రెడీ చేసుకోండి అని చెప్పారు. సూపర్ హీరో అంటే మన హనుమంతులు వారు అయితే బాగుంటుంది అనిపించింది. టైటిల్ గురించి ఆలోచిస్తుంటే హాలీవుడ్ లో స్పైడర్ మాన్ లాగా హను మాన్ అనే టైటిల్ పెడితే పర్ఫెక్ట్ అనిపించింది. నిర్మాత నిరంజన్ రెడ్డికి కూడా టైటిల్ బాగా నచ్చింది అని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు.

నిర్మాత నిరంజన్ రెడ్డికి చాలామంది చెప్పారు ప్రశాంత్ వర్మతో సినిమా ఎందుకు చేస్తున్నావ్ డబ్బులు వేస్ట్ అంత బడ్జెట్ ఎందుకు అని, కానీ నిరంజన్ రెడ్డి వినలేదు ప్రశాంత్ మీ విజన్ ఏంటో తెలుసు నేను నిన్ను నమ్ముతున్నాను మనం కలిసి సినిమా చేస్తున్నాం అని విపరీతంగా సపోర్ట్ చేశారు. నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు కాబట్టే ఈ రేంజ్ సినిమా చేయగలిగాను అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు.

హను మాన్ సినిమాలోకి తేజ సజ్జా ఎలా వచ్చాడు అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ… హనుమాన్ సినిమా స్టార్ హీరోతో చేయాలి అనుకున్నాం కథ కూడా ఒక స్టార్ హీరోకి నచ్చింది. కానీ అది కొన్ని కారణాల వల్ల కాంబినేషన్ కుదరలేదు.

Hanu-Man : హను మాన్ మూవీ తెరవెనుక విశేషాలు… డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాటల్లో…
Image Source : Twitter / Prasanth Varma

జాంబీ రెడ్డి సక్సెస్ తర్వాత తేజకు హీరోగా చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ తేజ ఎలాంటి సినిమా చేయాల అనే డైలమాలో ఉన్నాడు. ఒకరోజు ఆఫీస్ కి వచ్చాడు. అలా ఆఫీస్ బయట ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు అనిపించింది తేజ పర్ఫెక్ట్ గా హను మాన్ పాత్రకు సూట్ అవుతాడు. తేజను పిలిపించి మనం కలిసి సినిమా చేస్తున్నాం సూపర్ హీరో ఫిలిం అని చెప్పను. తేజకి ఇమేజ్ లేదు లవబుల్ గాయ్ హను మాన్ పాత్రకి పర్ఫెక్ట్ అనిపించాడు.

హను మాన్ సినిమాలో మిగతా క్యారెక్టర్స్ అందరిని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ… హీరోయిన్ ఏ మాత్రం ఇమేజ్ లేని క్యారెక్టర్ అయ్యి ఉండాలి అలానే రెబెల్ గా ఉండాలి. బిగిల్ సినిమాలో అమృత అయ్యర్ పాత్ర రెబెల్ గా ఉంటుంది. ఆమెకు కథ వినిపించాము వెంటనే చేస్తున్న అని చెప్పారు.

వరలక్ష్మి పాత్ర ఆమెను తప్ప వేరే ఎవరిని ఊహించుకోలేదు ఆమె చేస్తుందో లేదో కూడా తెలీదు. ఒకరోజు ఫోన్ ఆమెకు కథ వినిపించాను ఇమ్మీడియేట్ గా ఆమె ఒప్పుకోవడం జరిగింది. వినయ్ రాయ్ పాత్రను మన తెలుగు హీరో మొదటగా చేస్తా అన్నారు. కుదరలేదు. ఆ పాత్రకు వినయ్ రాయ్ అయితే బాగుంటుంది అని వరలక్ష్మి సజెస్ట్ చేశారు.

విభీషణుడు పాత్రకి రిషబ్ శెట్టిని అనుకున్నాం…

విభీషణుడు పాత్రకు ముందుగా రిషబ్ శెట్టిని అనుకున్నాం, తర్వాత విజయ్ సేతుపతిని ట్రై చేశాం అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఫైనల్ గా సముద్రఖని ఇంకా బెటర్ గా సూట్ అవుతారు అని అనిపించింది.

హనుమంతుడు మరియు విభీషణుడు పాత్రకు కనెక్షన్ పెట్టాలి అని ఎలా అనిపించింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ… ఒక యూనివర్స్ బిల్డ్ చేద్దాం అనుకునే ప్రాసెస్ లో కొన్ని పాత్రలు క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి. విభీషణుడు పాత్రను నెక్స్ట్ పార్ట్ లో ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నాం కానీ చివర్లో హనుమంతులు వారి పాత్రకు బిల్డప్ ఉండాలి అలాగే అక్కడ ఏదో సరిపోవట్లేదు అని అలా విభీషణుడు పాత్ర వచ్చింది.

హను మాన్ సినిమాలో కామెడీ సీన్స్ కూడా హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయి దాని గురించి ఏం చెప్తారు అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ… వెన్నెల కిషోర్ ఇంతవరకు చేయని పాత్ర చేశారు. కమెడియన్ సత్య క్యారెక్టర్ ఫన్ హిలేరియస్ వర్కౌట్ అయ్యింది. అలాగే గెటప్ శీను కూడా అందరిని అలరించాడు.

హను మాన్ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేశారు. హరిగౌర మరియు అనుదీప్ దేవ్, పాటలు అద్భుతంగా ఉన్నాయి. మరి మఖ్యంగా హనుమాన్ చాలీసా అద్భుతంగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌర బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అందించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయారు.

హను మాన్ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ రెస్పాన్స్ కి ట్రైలర్ ని ఎలా కట్ చేయాలో అర్థం కాలేదు మొత్తం 50 వెర్షన్స్ కట్ చేశాము. ట్రైలర్ క్రాక్ చేయటానికి సుమారు నాలుగు నుంచి ఐదు నెలలు టైం పట్టింది. ఆడియన్స్ రాంగ్ గా Expect చేయకూడదు అనే అంత టైం తీసుకున్నాం.

Hanu-Man : హను మాన్ మూవీ తెరవెనుక విశేషాలు… డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాటల్లో…
Image Source : Twitter / Prasanth Varma

హను మాన్ సినిమా ఫస్ట్ బడ్జెట్ ఎంత, చివరకు వచ్చేసరికి ఎంత అయ్యింది అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ… ఈ సినిమా ఫస్ట్ బడ్జెట్ 12 కోట్లు. శాటిలైట్ రైట్స్ మరియు హిందీ డబ్బింగ్ రైట్స్ ఎక్కువగా అమ్ముడు అవ్వడంతో ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి సినిమా స్కేల్ ను పెంచామన్నారు.

అలా సినిమా స్కేల్ ను పెంచాము. తమిళ్, కన్నడ, మలయాళం, చైనా మరియు జపాన్ నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి. అలా 26 కోట్ల వరకు కొన్నారు. సినిమా చివరకు వచ్చేసరికి 40 కోట్లు బడ్జెట్ అయ్యింది.

హను మాన్ సినిమా క్లైమాక్స్ గురించి స్పెషల్ గ చెప్పుకోవాలి చూసిన ఆడియన్స్ అందరికి గూసిబంప్స్ వచ్చాయి అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ… మొదటగా లెన్త్ ఎక్కువగా చూపించాలి అనుకోలేదు. బడ్జెట్ వల్ల ఆ vfx చేయడమే చాలా ఎక్కువ అనుకున్నాం కానీ సినిమా పైన అంచనాలు పెరగడంతో మెగాస్టార్ చిరంజీవి పెట్టాలి అనుకున్నాం. చివరకు vfx టీం మేము చేస్తాం అని ఛాలెంజింగ్ గా తీసుకోని చేశారు.

నేను కూడా క్లైమాక్స్ పార్ట్ షాట్స్ చూడలేదు. ఫైనల్ కాపీ చూస్తే నాకే పూనకం వచ్చింది. నా ఆపిల్ వాచ్ లో చూస్తే మీ హార్ట్ బీట్ ఫాస్ట్ గా కొట్టుకుంటుంది డాక్టర్ ని సంప్రదించండి అని వచ్చింది. థియేటర్లో చూసిన ఆడియన్స్ అందరూ క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ గూసిబంప్స్ వచ్చాయి అని చెప్తున్నారు.

హను మాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్…

హను మాన్ సినిమా సంక్రాతి కానుకగా జనవరి 12 2024 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేశారు. హను మాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల్ని అలరించడమే కాకుండా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా 40 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద 350 కోట్లను కలెక్ట్ చేసింది.

Hanu Raghavapudi : సీతా రామం సినిమా తెర వెనుక విశేషాల్ని పంచుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి…

Hello Friends, My Name is Surya, I Am The Writer And Founder Of This Blog And Share All The Information Related To Entertainment Through This Website.

Sharing Is Caring:

Leave a Comment