Sumanth : గోదావరి సినిమా తెర వెనుక విశేషాలు… అక్కినేని నాగేశ్వరరావు గురించి పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్న హీరో సుమంత్..!

Sumanth : గోదావరి సినిమా తెర వెనుక విశేషాలు… అక్కినేని నాగేశ్వరరావు గురించి పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్న హీరో సుమంత్..! : హీరో సుమంత్ గోదావరి సినిమా తెర వెనుక విశేషాలు మరియు గోదావరి సినిమా ఎక్స్పీరియన్సెస్ అంతే కాకుండా వారి తాత గారైన నాగేశ్వరరావు గురించి పలు ఆసక్తికర విషయాల్ని పంచుకోవడం జరిగింది.

Sumanth : గోదావరి సినిమా తెర వెనుక విశేషాలు… అక్కినేని నాగేశ్వరరావు గురించి పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్న హీరో సుమంత్..!

అక్కినేని నాగేశ్వరరావుకి అందాల రాముడు సినిమా షూటింగ్ టైంలో గుండె ప్రాబ్లెమ్ వచ్చింది

హీరో సుమంత్ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో నాగేశ్వరరావు గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. గోదావరి సినిమా స్క్రిప్ట్ చదివాక నాగేశ్వరరావు గారితో ఏమైనా డిస్కస్ చేయడం జరిగిందా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా సుమంత్…

విచిత్రం ఏంటి అంటే మా తాత గారు మా చిన్న మామయ్య నాగార్జున గారు అదే టైంలో ఇంచుమించు ఏవ్ లొకేషన్స్ లో శ్రీ రామదాసు షూటింగ్ చేస్తున్నారు. సో నేను వెళ్ళాను గోదావరి షూటింగ్ అప్పుడు కలవటం జరిగింది. గోదావరి సినిమా పాయింట్ తాత గారికి తెలుసు. ఆయన చేసిన అందాల రాముడి సినిమా లాగా ఉంటుంది అని చెప్పాను. అందాల రాముడు సినిమా తాత గారికి చాలా ప్రత్యేకమైన సినిమా.

బాపు గారితో చేసిన మొదటి సినిమా కావడం విశేషం. ఆ సినిమా ఒక ఎక్స్పెరిమెంటల్. అదే టైం లో అప్పుడు విశ్వనాథ్ గారు బాపు గారు అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అవుతున్న తరుణం. వాళ్లిద్దరూ డిఫరెంట్ సినిమాలు తీయటానికి నాంది పలికారు. అందాల రాముడు సినిమా షూటింగ్ టైంలోనే తాత గారికి మొదటిసారి గుండె ప్రాబ్లెమ్ వచ్చింది. ఆ సినిమాలో గోదావరిలో దూకి ఈత కొట్టే సీన్ లో తాత గారికి ఏదో ప్రాబ్లెమ్ ఉంది అని అనిపించింది అంటా. అందాల రాముడు సినిమా విశేషాలు తాత గారు నాతో పంచుకోవడం జరిగింది.

Sumanth : గోదావరి సినిమా తెర వెనుక విశేషాలు… అక్కినేని నాగేశ్వరరావు గురించి పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్న హీరో సుమంత్..!
Image Source : Twitter / BA Raju’s Team

Sumanth : గోదావరి సినిమా తెర వెనుక విశేషాలు… అక్కినేని నాగేశ్వరరావు గురించి పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్న హీరో సుమంత్..!

హీరో సుమంత్ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో గోదావరి సినిమా తెర వెనుక విశేషాల్ని పంచుకోవడం జరిగింది. శేఖర్ కమ్ముల గారు ఈ కథ మీకు ఎప్పుడు చెప్పారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా సుమంత్…

నాకు కరెక్ట్ గా గుర్తు లేదు కానీ, అప్పటికే నేను గౌరి మరియు ధన 51 సినిమాలు చేశాను. నా ఇంట్లోనే శేఖర్ కమ్ములను కలిసినట్టు నాకు గుర్తు. ఆయన నాకు నరేషన్ ఇవ్వలేదు. శేఖర్ కమ్ముల గురించి అప్పుడు తాను డాలర్ డ్రీమ్స్ మరియు ఆనంద్ సినిమాలు చేశాడు. ఆనంద్ సినిమా నాకు బాగా ఇష్టమైన సినిమా. గోదావరి సినిమా స్క్రిప్ట్ నాకు ఇచ్చారు. ఎందుకంటే ఆ టైంలో ఒక బౌండెడ్ స్క్రిప్ట్ ఒక ఇంగ్లీష్ సినిమాల ఇవ్వటం అనేది కొంచెం రేర్ విషయం అనే చెప్పాలి.

ఎందుకు అంటే డైలాగ్స్ ఇంగ్లీష్ లో ఉండి తెలుగులో ఉండి చాలా డీటైల్డ్ గా ఉంది. ప్రోబబ్లీ మోస్ట్ డీటైల్డ్ స్క్రిప్ట్. ఆ టైంలో మిగతా వాళ్ళందరూ నరేషన్ తో ప్రెసెంట్ చేస్తారు. కానీ ఇప్పుడు స్క్రిప్ట్స్ ఇవ్వడం చదవడం కామన్ అయిపొయింది. అప్పుడు అలా ఉండేది కాదు. స్క్రిప్ట్ మొత్తం చదివాను. నాకు కొంచెం కొత్తగా అనిపించింది. చాలా డిఫరెంట్ గా ఉంది. నేను ఆ టైంకి మా తాత గారి అందాల రాముడు సినిమా కూడా చూడలేదు.

మీ తాత గారు చేసిన అందాల రాముడు సినిమా మీదే ఆధారపడి ఉంటుంది అని శేఖర్ కమ్ముల గారు అన్నారు. నేను అందాల రాముడు సినిమా చూశాను. స్క్రిప్ట్ కూడా చదివాను. స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. తర్వాత మా నాన్న గారికి స్క్రిప్ట్ ఇచ్చాను. మా నాన్న గారు కూడా స్క్రిప్ట్ చదివారు. నాన్నకు కూడా స్క్రిప్ట్ విపరీతంగా నచ్చింది. జనరల్ గా నా సినిమాలన్ని నేనే చదివి నేనే డిసైడ్ అవుతాను. అదికాక ఆ టైంలో సత్యం సినిమా తర్వాత వరుసగా నాకు రెండు హిట్స్ వచ్చాయి.

అందుకే స్వంతంగా థింక్ చేసి స్క్రిప్ట్ ఫైనల్ చేసేవాడిని. దానికి ముందు అయితే నా సినిమా కథలన్నీ మిగతా వాళ్ళు కొంచెం సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత నుంచి నేనే డిసిషన్ తీసుకోవడం మొదలు పెట్టాను. నాకు స్క్రిప్ట్ నచ్చింది. అంతే కాకుండా మా నాన్న గారికి స్క్రిప్ట్ నచ్చింది. సో ఆలా గోదావరి సినిమా పట్టాలెక్కింది.

శేఖర్ కమ్ముల గారు మీకు స్క్రిప్ట్ చెప్పారు. స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. బట్ మీకన్నా ముందు ఆయన కొంతమంది లిస్ట్ అవుట్ చేసుకున్నారు. అప్రోచ్ అవ్వలేదు. కానీ నాకు తెలిసింది ఏంటి అంటే మాధవన్ గోపీచంద్ ఇలా లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా సుమంత్… ఏమో నాకు తెలీదు. ప్రతి సినిమాలో ఇవి జరగటం చాలా మాములే, నేనే చేయాల్సిన సినిమాలు వేరే వాళ్ళు చేయటం. వేరే వాళ్ళు చేయాల్సిన సినిమాలు నాకు రావటం అనేది కామన్. అది జరుగుతూనే ఉంటుంది.

గోదావరి సినిమా హైదరాబాద్ లో ఓపెనింగ్ అయ్యింది. తర్వాత ఇక్కడ కొన్ని డేస్ షూట్ చేశాక మీరు అక్కడికి వెళ్ళారా అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా సుమంత్… నేను లేకుండా వాళ్ళు ఒక వారం షూటింగ్ చేశారు. ఎక్కడ చేశారో నాకు కూడా తెలీదు. నేను రాజమండ్రి షూటింగ్ లో జాయిన్ అయ్యాను. రాజమండ్రి పక్కన ఉన్న మారేడుమిల్లి ఫారెస్ట్ లో షూట్ చేశాము. నా ఫస్ట్ షాట్ ఆ ఫారెస్ట్ ఏరియాలోనే అక్కడే చేశాము.

గోదావరి సినిమా షూటింగ్ టైంలో ఆ అడవిలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అండ్ కమలిని ముఖర్జీ గారితో నటించటం అని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా సుమంత్… ఫస్ట్ ట్రెజర్ హంట్ సీక్వెన్స్ తో షూట్ స్టార్ట్ చేశాము. నాకు కూడా కొత్తగా అనిపించింది. డెఫినిట్ గా నేను ఇప్పటివరకు చేసిన సినిమాలకు బిన్నంగా ఉంటుంది. ఈ సినిమా కన్నా ముందు సత్యం మరియు గౌరి రెండు కమర్షియల్ హిట్స్ ఉన్నాయి.

గోదావరి సినిమా ఏంటి అంటే టేకింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ కొంచెం అండర్ ప్లే చేయటం సహజంగా మాట్లాడటం అది కొంచెం అడ్జస్ట్ అవ్వటానికి నాకు ఒకరోజు టైం పట్టింది. అంతే కాకుండ అదే టైంలో మహానంది అనే మాస్ మూవీ చేస్తున్నాను. ఆ సినిమాకు ఈ సినిమాకు అస్సలు పొంతన ఉండదు. ఈ సినిమాకు తగ్గట్టు అడ్జస్ట్ అవ్వటానికి కొంచెం టైం పట్టింది.

ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అంటే రాజమండ్రి నుంచి లొకేషన్ కి వెళ్ళటానికి రెండు గంటలు టైం పట్టేది. ఎక్కువ మంది ఆర్టిస్ట్స్ ఉండటం. నేను కూడా అంతమందితో ఎప్పుడు చేయలేదు. అప్పటివరకు నాకు కూడా కొత్త అనే చెప్పుకోవాలి. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు గోదావరిలో విపరీతమైన వరదలు వచ్చాయి. వరదలు అయ్యిన తర్వాత వెళ్లి మేము షూట్ చేయడం జరిగింది.

Sumanth : గోదావరి సినిమా తెర వెనుక విశేషాలు… అక్కినేని నాగేశ్వరరావు గురించి పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్న హీరో సుమంత్..!
Image Source : Twitter / BA Raju’s Team

కమలిని ముఖర్జీని మొదటిసారి అక్కడే కలిశాను

మొదటిసారి కమలిని ముఖర్జీని షూట్ లోనే కలిశాను. నాకు ముందుగా ఏం పరిచయం లేదు. ఆనంద్ సినిమా చూశాక కమలిని ముఖర్జీ చాలా బాగా చేసింది అనిపించింది. ఇవ్వాళ షూట్ అయిపోయాక నెక్స్ట్ డే షూట్ కి డైలాగ్ రీడ్ కలిసి ఇద్దరం చేసేవాళ్ళం. శేఖర్ కమ్ములకు తెలుసు కమలిని ముఖర్జీ టైమింగ్ ఎలా ఉంటుంది. ఆల్రెడీ ఆమెతో పని చేశాడు. ఎక్కువ డైలాగ్స్ రీడింగ్స్ కానీ ఎక్కువ రిహార్సల్స్ కానీ ఎక్కువగా చేయలేదు. చాలా సహజంగా వచ్చింది. ఎందుకంటే సినిమా అలాంటిది.

Dasaradh : మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా తెర వెనుక విశేషాలు.. ప్రభాస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు దశరథ్..?

Hello Friends, My Name is Surya, I Am The Writer And Founder Of This Blog And Share All The Information Related To Entertainment Through This Website.

Sharing Is Caring:

Leave a Comment