Srinu Vaitla : ఆనందం సినిమా తెర వెనుక విశేషాలు.. మీకు తెలియని నిజాలు దర్శకుడు శ్రీను వైట్ల మాటల్లో..?

Srinu Vaitla : ఆనందం సినిమా తెర వెనుక విశేషాలు.. మీకు తెలియని నిజాలు దర్శకుడు శ్రీను వైట్ల మాటల్లో..? : దర్శకుడు శ్రీను వైట్ల ఆనందం సినిమా తెర వెనుక విశేషాలు మరియు ఎవ్వరికి తెలియని నిజాలు, పలు ఆసక్తికర విషయాలు పంచుకోవడం జరిగింది.

Srinu Vaitla : ఆనందం సినిమా తెర వెనుక విశేషాలు.. మీకు తెలియని నిజాలు దర్శకుడు శ్రీను వైట్ల మాటల్లో..?

ఆనందం సినిమాకు మొదటగా హీరో ఉదయ్ కిరణ్

దర్శకుడు శ్రీను వైట్ల ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా సినిమా కాస్టింగ్ గురించి యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు శ్రీను వైట్ల… ఆనందం సినిమాకు మొదటగా ఉదయ్ కిరణ్ అనుకున్నాం. ఉదయ్ కిరణ్ ని కలిసి కథ చెప్పాను. ఉదయ్ కిరణ్ కు కథ బాగా నచ్చింది. కానీ అప్పటికే తను నువ్వు నేను మరియు మనసంతా నువ్వే సినిమాలు చేస్తున్నాడు. ఉదయ్ కిరణ్ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు.

Srinu Vaitla : ఆనందం సినిమా తెర వెనుక విశేషాలు.. మీకు తెలియని నిజాలు దర్శకుడు శ్రీను వైట్ల మాటల్లో..?

దర్శకుడు శ్రీను వైట్ల ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఆనందం మూవీ తెర వెనుక విశేషాలు మరియు ఎవ్వరికి తెలియని నిజాల్ని పంచుకోవడం జరిగింది. ఆనందం కథ ఎలా మొదలైంది. రామోజీ రావు గారిని ఎలా అప్రోచ్ అయ్యారని యాంకర్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా దర్శకుడు శ్రీను వైట్ల…

నా మొదటి సినిమా నీకోసం రామోజీ రావు గారే కొని రిలీజ్ చేశారు. అది క్రిటికల్లీ అక్లైమ్డ్ ఆ బడ్జెట్ కు ఆయనకు వర్కౌట్ అయ్యింది. నీకోసం సినిమా టివిలో చాలా బాగా ఆడింది. నీకోసం సినిమాకు మొత్తం ఏడూ నంది అవార్డ్స్ వచ్చాయి. కమర్షియల్ గా సినిమా అంతగా ఆడలేదు. ఒక కమర్షియల్ సక్సెస్ కోసం చూస్తున్న టైం అది. ఆ టైంలో రామోజీ రావు గారు మనం సినిమా చేద్దాం అని ముందే ప్రామిస్ చేశారు.

Srinu Vaitla : ఆనందం సినిమా తెర వెనుక విశేషాలు.. మీకు తెలియని నిజాలు దర్శకుడు శ్రీను వైట్ల మాటల్లో..?
Image Source : Twitter / Only Movies News

ఆనందం సినిమా తర్వాత ఉషా కిరణ్ మూవీస్ నుంచి నన్ను అప్రోచ్ అయ్యి ఒక వేరే రైటర్ రాసిన స్టోరీ నాకు చెప్పారు. మీరు అయితే ఈ కథకు బాగుంటుంది అని చెప్పారు. ఆ కథను విన్నాను. ఆ కథ ఎక్కడ నా స్టైల్ లో లేదు. బట్ ఆ కథను నా స్టైల్ లో ట్రీట్ చేశాను. నేను రైటర్ చింతపల్లి రమణ కలిసి కూర్చొని నా స్టైల్ లో సినిమా రాసుకున్నాం.

రామోజీ రావు గారికి నరేషన్ ఇవ్వాలి. నేను చింతపల్లి రమణ గారు రామోజీ ఫిలిం సిటీ కి వెళ్లి రామోజీ రావు గారికి నరేషన్ ఇచ్చాము. నరేషన్ ఇచ్చిన తర్వాత ఆయన చెప్పిన విధానం చాలా బాగుంది. బట్ ఈ సినిమాకు మీరు చేసిన కామెడీకి జెల్ అవ్వట్లేదు అని అన్నారు. అది నేను కూడా రియలైజ్ అయ్యాను. ఎందుకంటే ఆ కథ మీద ఉషా కిరణ్ మూవీస్ వారు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కథ బాగుంది అని వాళ్ళు ఫీల్ అయ్యారు.

మళ్ళీ నేను చింతపల్లి రమణ గారు కూర్చొని ఇంకో వెర్షన్ రాశాము. సెకండ్ టైం నరేషన్ ఇచ్చినప్పుడు కూడా రామోజీ రావు గారి కళ్ళలో ఎదో డిస్ సాటిస్ఫాక్షన్ కనిపించింది. అప్పుడు నేను ఈ కథ వదిలేద్దాం సర్ అని అన్నాను. ఎంతసేపు చెప్పిన కామెడీ బాగుంది అనే అంటున్నారు. సో ఈ కథకు నేను కరెక్ట్ కాదు అండి. నేను ఇంకో కథ చెప్తాను అండి అని అన్నాను. వెరీ గుడ్ మీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది అని రామోజీ రావు గారు అన్నారు.

రామోజీ ఫిలిం సిటీ నుంచి నేను చింతపల్లి రమణ గారు తిరిగి వస్తున్నాం. చింతపల్లి రమణ గారు బాగా డిస్సపాయింట్ అయ్యారు. మన మంచికే జరిగింది మనం ఇంకోటి చేద్దాం అని నేను అన్నాను. నా మైండ్ లో కొత్త ఐడియా కోసం ఆలోచిస్తున్న రావట్లేదు. నెక్స్ట్ డే మిడ్ నైట్ ఒక ఫ్లాష్ వచ్చింది. నా రూమ్ మేట్ కి షేర్ చేశాను. చాలా బాగుంది అన్నాడు. అది 2 మినిట్స్ ఐడియా.

ఆ ఐడియాను నెక్స్ట్ డే ఉషా కిరణ్ మూవీస్ అజయ్ గారికి చెప్పాను. అజయ్ గారికి ఐడియా చాలా బాగా నచ్చింది. ఐడియాకు కనెక్ట్ అయ్యారు. ఒక 40 సీన్స్ మీరు రాసుకొని రండి అని అన్నారు. రాసుకొని వస్తే నేను రామోజీ రావు గారి దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పారు.

అక్కడి నుంచి వచ్చిన తర్వాత నా అసిస్టెంట్ డైరెక్టర్స్ తో కలిసి మొదటి రోజు షామిర్ పేట్ కు వెళ్లి రాసుకున్నాం. రెండు మూడవ రోజు గండిపేట్ కు వెళ్లి రాసుకున్నాం. మొత్తం మూడు రోజుల్లో 80 సీన్స్ రాసుకున్నాను. నాల్గవ రోజు మొత్తం ఒకసారి ఆర్డర్ లో పెట్టుకున్నాను.

ఐదవ రోజు వెళ్లి ఉషా కిరణ్ మూవీస్ అజయ్ గారికి చెప్పాను. ఆయన షాక్ అసలు చాలా బాగుంది అన్నారు. ఆయన 40 సీన్స్ చెప్తే నేను ఏమో 80 సీన్స్ రాసుకొని వెళ్ళాను. నేను ట్రై చేస్తాను రేపే రామోజీ రావు గారితో మీటింగ్ కి అని అజయ్ గారు చెప్పారు. నెక్స్ట్ డే రామోజీ రావు అపాయింట్మెంట్ ఇచ్చారు. రామోజీ రావు గారికి స్టార్ట్ తో ఫినిష్ ఫుల్ కథను చెప్పాను. సింగల్ కరెక్షన్ చెప్పలేదు గో హెడ్ అని రామోజీ రావు గారు అన్నారు.

రామోజీ రావు గారు కథ చాలా బాగుంది. మీరు చేసుకోండి అన్నారు. ఒక మంచి రోజు చూసి స్టార్ట్ చేస్తాం సర్ అని నేను అన్నాను. ఆయన అన్న మాట నాకు బాగా గుర్తు. ఒక చెడ్డ రోజు చూసి స్టార్ట్ చేయండి. ఎందుకు హిట్ అవ్వదో చూద్దాం అన్నాడు. ఆయనకు అంత కాన్ఫిడెన్స్ కథ మీద, రామోజీ రావు గారు ముహూర్తం ఇలాంటివి అసలు నమ్మరు. ఏప్రిల్ లో సినిమా స్టార్ట్ అయ్యింది.

Srinu Vaitla : ఆనందం సినిమా తెర వెనుక విశేషాలు.. మీకు తెలియని నిజాలు దర్శకుడు శ్రీను వైట్ల మాటల్లో..?
Image Source : Twitter / Only Movies News

వైజాగ్ లో ఒక షెడ్యూల్ ఊటీలో ఒక షెడ్యూల్ మిగతాది అంత హైదరాబాద్ లోనే షూట్ చేశాము. మాములుగా రామోజీ రావు గారు షూటింగ్ కి 60 డేస్ టైం ఇచ్చారు. కానీ సినిమాను 42 డేస్ లోనే తీశాను. 19 రోజులు టాకీ తీశాను. 23 రోజులు పాటలు తీశాను.

కాస్టింగ్ విషయానికి వస్తే ఆకాష్ ని సెకండ్ క్యారెక్టర్ అనుకున్నాను. మళ్ళీ ఆకాష్ కు చెప్పాను నువ్వే మెయిన్ హీరో అని ఆకాష్ ని బరువు తగ్గమని చెప్పాను. ఆకాష్ బరువు తగ్గి వచ్చాడు. సెకండ్ క్యారెక్టర్ వెంకట్ ని తీసుకున్నాం అప్పటికి వెంకట్ సీతారాముల కల్యాణంలో చేశాడు. వెంకట్ కి పెయిర్ గా చేసిన తను రాయ్ అప్పటికి ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా చేస్తుంది. ఆమెను అలా తీసుకున్నాం.

మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ కి శ్రియను అనుకున్నాం

మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ కి శ్రియను అనుకున్నాను. ఫస్ట్ శ్రియను నేనే ఇంట్రడ్యూస్ చేయాల్సింది. నేను శ్రియాను ఒక ఆల్బం లో చూసి చాలా బాగుంది అని అనుకున్నాను. ఆనందం కంటే ముందు ఇష్టం సినిమా స్టార్ట్ అయ్యింది. అలా కన్నడ అమ్మాయి రేఖను తీసుకున్నాం.

మ్యూజిక్ విషయానికి వస్తే దేవి శ్రీ ప్రసాద్ అప్పటికే దేవి మరియు నవ్వుతు బ్రతకాలిరా అనే సినిమాలు చేశాడు. అలా దేవి శ్రీ ప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గ పెట్టుకున్నాం. దేవి శ్రీ ప్రసాద్ నాది చాలా పెద్ద ట్రావెల్. నేను అసిస్టెంట్ ఉన్నప్పుడు నుంచి కూడా దేవి శ్రీ ప్రసాద్ నాన్న గారితో పరిచయం ఉంది. ఆయనతో నాకు ఎక్కువ ఇంటరాక్షన్ ఉంది. ప్రతిరోజూ ఆయన ఇంటికి వెళ్తుండే వాడిని సో అలా దేవి శ్రీ ప్రసాద్ పరిచయం.

దేవి శ్రీ ప్రసాద్ కీబోర్డ్ కంపోజ్ చేస్తుండే వాడు. నేను ఏదైనా కథ అనుకుంటే థీమ్స్ చేయమని అడిగేవాడిని. చేసి పెట్టేవాడు. నేను డైరెక్టర్ అయ్యాక నిన్నే ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటా అని చెప్పాను. నేను హీరో రాజశేఖర్ తో అపరిచితుడు అనే సినిమా చేయాల్సింది. దానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఏ కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది.

నీకోసం సినిమా అప్పుడు దేవి శ్రీ ప్రసాద్ అనుకున్నాం బడ్జెట్ ఇష్యూ వల్ల అప్పుడు కుదరలేదు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ నే అనుకున్న, దేవి శ్రీ ప్రసాద్ ఫెంటాస్టిక్ గా పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.

నేను దేవి శ్రీ ప్రసాద్ కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గరలో ఉన్న మయూర్ థియేటర్ కి వెళ్ళాం. థియేటర్ మొత్తం హౌస్ ఫుల్ అయ్యింది. సినిమా వాళ్ళు కూడా వచ్చారు. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సినిమా చూసి షేక్ హ్యాండ్ ఇచ్చారు. సినిమా పూర్తి అయ్యిన తర్వాత అందరికంటే ఎక్కువగా త్రివిక్రమ్ గారే అభినందించారు. కళ్ళ వెంబడి నీళ్లు తెప్పించారు. మూవీ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అని త్రివిక్రమ్ గారు అన్నారు.

Bhaskar : బొమ్మరిల్లు సినిమా గురించి మీకు తెలియని నిజాలు.. దర్శకుడు భాస్కర్ మాటల్లో..?

Hello Friends, My Name is Surya, I Am The Writer And Founder Of This Blog And Share All The Information Related To Entertainment Through This Website.

Sharing Is Caring:

Leave a Comment