మెకానిక్ రాకీ ఫస్ట్ రివ్యూ : మెకానిక్ రాకీ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో రివ్యూ, విశ్వక్ సేన్ కి ఈ సినిమా ప్లస్సా మైనస్సా..?

మెకానిక్ రాకీ ఫస్ట్ రివ్యూ : మెకానిక్ రాకీ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో రివ్యూ, విశ్వక్ సేన్ కి ఈ సినిమా ప్లస్సా మైనస్సా..? : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మెకానిక్ రాకీ. మెకానిక్ రాకీ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ నవంబర్ 21 2024 వ తేదిన విడుదల అయ్యింది. మెకానిక్ రాకీ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.

మెకానిక్ రాకీ ఫస్ట్ రివ్యూ : మెకానిక్ రాకీ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో రివ్యూ, విశ్వక్ సేన్ కి ఈ సినిమా ప్లస్సా మైనస్సా..?
Image Source : Twitter / SRT Entertainments

మెకానిక్ రాకీ ఫస్ట్ రివ్యూ : మెకానిక్ రాకీ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో రివ్యూ, విశ్వక్ సేన్ కి ఈ సినిమా ప్లస్సా మైనస్సా..?

మెకానిక్ రాకీ మూవీ కథ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగుతూ వెళ్తుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పాత్ర పేరు నగుమోము రాకేష్ అందరూ రాకీ అని పిలుస్తూ ఉంటారు. రాకీ బీటెక్ చదువుతుంటాడు. చదువు మధ్యలోనే ఆపేస్తాడు. రాకీ ఫాదర్ గా సీనియర్ యాక్టర్ నరేష్ గారు నటించారు. నరేష్ గారి పాత్ర పేరు రామకృష్ణ. రాకీ వాళ్ళ ఫాదర్ గ్యారేజ్ లోనే మెకానిక్ గా చేస్తుంటాడు. అంతే కాకుండా డ్రైవింగ్ కూడా నేర్పిస్తాడు.

మెకానిక్ రాకీ సినిమాలో కథానాయికలుగా శ్రద్ధా శ్రీనాథ్ మరియు మీనాక్షి చౌదరి నటించారు. రాకీ చదువుకునే రోజుల్లో తాను ప్రేమించిన అమ్మాయే మీనాక్షి చౌదరి పాత్ర పేరు ప్రియ. ప్రియ రాకీ ఫ్రెండ్ చెల్లెలు. శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర పేరు మాయ. మెకానిక్ రాకీ మూవీ సినిమాలో ప్రియ మరియు మాయ ఇద్దరు రాకీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవటానికి వస్తారు. రాకీ మరియు ప్రియ మధ్య ప్రేమ మొదలయ్యే లోపే రాకీ చదువు మానేస్తాడు. చాలా రోజుల తర్వాత ప్రియను కలుస్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం రాకీ,ప్రియ మరియు మాయ పాత్రలతో సినిమా సాగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా అంత ఇంపాక్ట్ లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ సీన్స్ పర్లేదు అనిపించినా, స్క్రీన్ ప్లే మాత్రం చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా స్లో గా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే తెరకెక్కించటంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు అని చెప్పుకోవాలి.

మెకానిక్ రాకీ మూవీ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ ని డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు అని చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం స్లోగా ఉన్న సెకండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్స్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులకి స్లోగా అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం అందరికి చాలా బాగా నచ్చుతుంది. ట్విస్ట్స్ మాత్రం థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. ఎమోషనల్ సీన్స్ మాత్రం ఇంకొంచెం బాగా తీయచ్చు అనే ఫీలింగ్ వచ్చేస్తది. ఓవర్ అల్ గా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది.

నటీనటుల విషయానికి వస్తే

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విశ్వక్ సేన్ ప్రూవ్డ్ యాక్టర్. ఈ సినిమాలో విశ్వక్ సేన్ రాకీ పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాడు అనిపిస్తుంది. హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్ మరియు మీనాక్షి చౌదరి పాత్రలు కూడా గ్లామర్ కే పరిమితం కాకుండా క్యారెక్టర్ స్కోప్ ఉన్న పాత్రలు దక్కాయి. ఇద్దరు హీరోయిన్లు అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ మరియు సునీల్ కీలక పాత్రలను పోషించారు.

మ్యూజిక్ విషయానికి వస్తే

మెకానిక్ రాకీ సినిమాకు మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ అయిన జాక్స్ బిజోయ్ మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించారు. ఈ సినిమాలో రెండు పాటలు ఉంటాయి. పాటలు అంతగా మెప్పించలేకపోయాయి అనే చెప్పుకోవాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.

పాజిటివ్స్ :

విశ్వక్ సేన్ నటన
మీనాక్షి చౌదరి మరియు శ్రద్ధా శ్రీనాథ్ నటన
సెకండ్ హాఫ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ట్విస్ట్స్

నెగటివ్స్

ఫస్ట్ హాఫ్
స్క్రీన్ ప్లే

మెకానిక్ రాకీ సినిమాను రవితేజ ముళ్ళపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మించారు. మెకానిక్ రాకీ సినిమా విషయానికి వస్తే ఓవర్ అల్ గా సినిమా పర్లేదు అని చెప్పుకోవాలి. ఈ సినిమా రివ్యూ ఆడియన్స్ పాయింట్ అఫ్ వ్యూ నుంచి రాసింది. వ్యక్తిగత దూషణ అలాంటిదేం లేదు.

బిగ్ బాస్ 8 తెలుగు : బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నిఖిల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విశ్వక్ సేన్..?

Hello Friends, My Name is Surya, I Am The Writer And Founder Of This Blog And Share All The Information Related To Entertainment Through This Website.

Sharing Is Caring:

Leave a Comment