జీబ్రా మూవీ రివ్యూ : జీబ్రా మూవీతో సత్య దేవ్ హిట్ కొట్టాడా..? : విలక్షణ నటుడు సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన అప్ కమింగ్ చిత్రం జీబ్రా. జీబ్రా సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 22 2024 వ తేది శుక్రవారం విడుదల అయ్యింది. జీబ్రా సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించగలిగిందో తెలుసుకుందాం.
జీబ్రా మూవీ రివ్యూ : జీబ్రా మూవీతో సత్య దేవ్ హిట్ కొట్టాడా..?
జీబ్రా సినిమా కథ విషయానికి వస్తే సత్యదేవ్ బ్యాంకు మేనేజర్ గా చేస్తుంటారు. సత్యదేవ్ పాత్ర పేరు సూర్య. తనని ప్రేమించే అమ్మాయి స్వాతి ప్రియ భవాని శంకర్ ఈ పాత్రను పోషించించింది. సత్యదేవ్ ఫ్రెండ్ గా కమెడియన్ సత్య నటించాడు. హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ని బ్యాంకు ఫ్రాడ్ ఇష్యూ నుండి బయటపడేసే ప్రాసెస్ లో హీరో సత్యదేవ్ ఐదు కోట్ల రూపాయల ఫ్రాడ్ స్కాం లో ఇరుక్కుంటాడు.
పుష్ప ఫేమ్ జాలి రెడ్డి అలియాస్ డాలి ధనుంజయ్ ఎంట్రీ సీన్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఒకానొక టైంలో హీరో సత్యదేవ్ హా లేకపోతే ధనుంజయ్ అనే ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. ధనుంజయ్ పాత్రకి ఇచ్చే ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ అంతే. హీరో సత్యదేవ్ ధనుంజయ్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. హీరో సత్య దేవ్ ఆ ఐదు కోట్ల రూపాయల ఫ్రాడ్ స్కాం నుంచి ఎలా బయటపడ్డాడు. సూర్యకి ధనుంజయ్ మధ్య గొడవేంటి, హీరో సత్యదేవ్ ఎలా బయటపడ్డాడు అనేది జీబ్రా కథ.
జీబ్రా సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా ఆద్యంతం తన స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ కట్టి పడేశాడు. జీబ్రా కథ కథనం మాటలు డైరెక్షన్ అన్ని బాగున్నాయి. డైరెక్టర్ మొదటి సినిమా పెంగ్విన్. రెండవ సినిమానే జీబ్రాను తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. జీబ్రా సినిమా ట్విస్ట్స్ తో అలరించారు. జీబ్రా సినిమా పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్.
నటీనటుల విషయానికి వస్తే
హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథల్ని ఎంచుకోవడంలో సత్యదేవ్ ముందుంటాడు. సత్యదేవ్ బ్యాంకు మేనేజర్ పాత్రలో అద్భుతంగా నటించాడు. పుష్ప సినిమాలో జాలి రెడ్డి పాత్ర నిడివి తక్కువ ఉండటంతో అంతగా ఏం అనిపించలేదు. కానీ ఈ సినిమాలో ధనుంజయ్ తన నటనతో ప్రేక్షకుల్ని ఆశ్చర్య పరచడమే కాకుండా అద్బుతంగా నటించాడు. హీరోయిన్ ప్రియా భవాని శంకర్ అద్భుతంగా నటించింది. కమెడియన్ సత్య క్యారెక్టర్ హైలైట్ అని చెప్పుకోవాలి. సత్య రాజ్ మరియు సునీల్ వాళ్ళ పాత్రలతో అందరిని ఆకట్టుకున్నాడు.
మ్యూజిక్ విషయానికి వస్తే
కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందించారు. జీబ్రా సినిమా పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా అందించాడు.
పాజిటివ్స్
కథ
కథనం
మాటలు
డైరెక్షన్
నటీనటుల పెర్ఫార్మెన్స్
మ్యూజిక్
జీబ్రా మూవీ క్రూ
స్టోరి స్క్రీన్ ప్లే డైరెక్షన్ : ఈశ్వర్ కార్తీక్
డైలాగ్స్ : మీరాఖ్
సినిమాటోగ్రఫీ : సత్య పొన్మార్
ఎడిటర్ : అనిల్ క్రిష్
మ్యూజిక్ డైరెక్టర్ : రవి బస్రూర్
నిర్మాతలు : బాలా సుందరం, దినేష్ సుందరం మరియు ఎస్ఎన్ రెడ్డి
ఆరోజే నా మనసులో హీరో అయిపోయాడు.. ఆ హీరో ఎవరో తెలుసా.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..?