ఆరోజే నా మనసులో హీరో అయిపోయాడు.. ఆ హీరో ఎవరో తెలుసా.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..? : జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నచ్చిన ఆ స్టార్ హీరో ఎవరు. ఆ స్టార్ హీరో గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్. ఆ విశేషాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
ఆరోజే నా మనసులో హీరో అయిపోయాడు.. ఆ హీరో ఎవరో తెలుసా.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..?
డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నచ్చిన హీరో మరెవరో కాదు. పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ అని ఆయన చెప్పడం జరిగింది. అంతే కాకుండా రామ్ చరణ్ కొడుకు కంటే కూడా తనకు తమ్ముడి లాంటి వాడని పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… రామ్ చరణ్ కి నేను వరుసకు బాబాయినే కానీ చిన్నప్పటి నుంచి నేను అన్నయ్య చిరంజీవి గారి దగ్గరే ఉండటం. చరణ్ నా ముందే పుట్టి పెరగడం వల్ల నాకు ఒక చిన్న తమ్ముడిలా కనిపిస్తాడు. నా మొదటి సినిమా అయిపోయాక నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. చరణ్ దగ్గర డబ్బులు తీసుకునేవాడిని. మా వదిన చరణ్ కి డబ్బులు ఇచ్చేది. డబ్బులు తీసుకోని వడ్డీ కట్టి ఇచ్చేస్తాను అని చెప్పేవాడిని. కానీ ఇప్పటికి ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఖుషి సినిమా వరకు కూడా చరణ్ అడిగేవాడు. డబ్బులు ఎప్పుడు ఇస్తావని అడిగేవాడు.
సడన్ గా ఒకరోజు రామ్ చరణ్ ని హీరో చేస్తున్నారు. పూరి జగన్నాధ్ డైరెక్టర్, అశ్విని దత్త్ ప్రొడ్యూసర్ గా అని చెప్పారు. కొంచెం ఆనందం వేసింది. అప్పుడే చరణ్ హీరో అయిపోతున్నాడా అనిపించింది. కానీ సినిమా మొదలు పెట్టక ముందే చరణ్ లైఫ్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. కానీ మాములుగా ఆ ఇన్సిడెంట్ జీవితంలో వేరే ఎవరికైనా జరిగితే బాధ్యతను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చరణ్ పక్కన సపోర్ట్ ఎవ్వరు లేకపోయినా ఒక్కడే బాధ్యతగా నిజాయితీగా ధర్మంగా హ్యాండిల్ చేసే విధానం చూసి నాకు ఆరోజే నా మనసులో హీరో అయిపోయాడు. చరణ్ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. బాబాయి కంటే కూడా ఒక అన్నయ్యగా చరణ్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.
రామ్ చరణ్ అప్ కమింగ్ ఫిల్మ్ గేమ్ ఛేంజర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వాని నటిస్తుంది. గేమ్ ఛేంజర్ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శంకర్ కి డైరెక్టర్ గా తెలుగులో డెబ్యూట్ మూవీ కావడం విశేషం. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ కి గేమ్ ఛేంజర్ సినిమా స్పెషల్ ఫిల్మ్. ఎందుకంటే దిల్ రాజు బ్యానర్ లో నిర్మిస్తున్న 50 వ చిత్రం కావడం విశేషం. గేమ్ ఛేంజర్ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ ని తాజాగా విడుదల చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్ ని లక్నో లో నిర్వహించడం జరిగింది. గేమ్ ఛేంజర్ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. గేమ్ ఛేంజర్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10 2025 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.