వార్ 2 లో ఎన్టీఆర్ అన్న బటన్ విప్పుతాడు.. మీరు బట్టలు చింపుకొనికి రెడీగా ఉండండి.. ఎన్టీఆర్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విశ్వక్ సేన్..? : మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన చిత్రం దేవర పార్ట్ 1. దేవర సినిమా నవంబర్ 15 2024 వ తేది నాటికి 50 రోజుల్ని పూర్తి చేసుకుంది. దేవర సినిమా 50 డేస్ సందర్భంగా ప్రొడ్యూసర్ నాగ వంశీ మరియు హీరో విశ్వక్ సేన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ థియేటర్ కి రావడం జరిగింది. అభిమానులతో కలిసి చూడటం జరిగింది.
వార్ 2 లో ఎన్టీఆర్ అన్న బటన్ విప్పుతాడు.. మీరు బట్టలు చింపుకొనికి రెడీగా ఉండండి.. ఎన్టీఆర్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విశ్వక్ సేన్..?
హీరో విశ్వక్ సేన్ ఎన్టీఆర్ డై హార్ట్ ఫ్యాన్ అని అందరికి తెలిసిన విషయమే, విశ్వక్ సేన్ ఎక్కడికి వెళ్లిన మీడియా వారు కానీ ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులు కానీ ఎన్టీఆర్ గురించి అడగకుండా ఉండరు. విశ్వక్ సేన్ కి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. విశ్వక్ సేన్ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. తాజాగా నవంబర్ 15 2024 వ తేదీ దేవర సినిమా 50 డేస్ పూర్తి చేసుకుంది. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ థియేటర్ కి హీరో విశ్వక్ సేన్ మరియు ప్రొడ్యూసర్ నాగ వంశీ పాల్గొనడం జరిగింది.
నిర్మాత నాగ వంశీ దేవర సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేశారు
ప్రొడ్యూసర్ నాగ వంశీ దేవర పార్ట్ 1 సినిమాను ఆంధ్ర మరియు తెలంగాణాలో డిస్ట్రిబ్యూషన్ చేశారు. డిస్టిబ్యూటర్స్ దేవర సినిమాతో లాభాలు పొందారు. అంతే కాకుండా ప్రొడ్యూసర్ నాగ వంశీ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ మీద ఉన్న ఇష్టంతోనే దేవర సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రొడ్యూసర్ నాగ వంశీ బ్యానర్ లో ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమా చేయడం జరిగింది. అరవింద సమేత వీర రాఘవ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
ఎన్టీఆర్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విశ్వక్ సేన్..?
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పైన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ అన్న బటన్ విప్పుతుండు అనుకుంటా, మీరు బట్టలు చింపుకోవడానికి రెడీగా ఉండండి. అంతే కాకుండా ఎదురుగా హృతిక్ రోషన్ ఉన్న సరిపోడు. ఫస్ట్ అఫ్ అల్ నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మీఅందరితో కలిసి సినిమా చూడాలనే వచ్చాను. ఇక్కడికి వచ్చిన అందరికి ఎన్టీఆర్ అన్న తరపున థాంక్స్. ఎన్టీఆర్ అన్న ఎప్పుడు చెప్పే మాటనే అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని విశ్వక్ సేన్ అన్నారు.
దేవర సినిమా 50 డేస్
దేవర పార్ట్ 1 సినిమా సెప్టెంబర్ 27 2024 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. దేవర పార్ట్ 1 సినిమా బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఎన్టీఆర్ కెరీర్లో RRR సినిమా కాకుండా ఇండివిడ్యువల్ గా 500 కోట్లు బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మొదటి సినిమా దేవర కావడం విశేషం. దేవర సినిమా నవంబర్ 15 2024 వ తేదీ నాటికి 50 డేస్ ని పూర్తి చేసుకుంది. ఆంధ్ర మరియు తెలంగాణాలో 50 డేస్ 54 సెంటర్లలో ఆడుతుంది.